Don't Miss!
- News
హిందూపురంలో బాలకృష్ణ అవుట్- తారక్ ఇన్: జోరుగా మంతనాలు..!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Bimbisara: బుల్లితెరపై కల్యాణ్ రామ్ రికార్డు.. మొట్టమొదటి మూవీగా బింబిసార ఘనత
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఈ కుటుంబం నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వడంతో పాటు వారిలో పలువురు స్టార్లుగా వెలుగొందడమే. ఇలా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో టాప్ స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. వీళ్ల తర్వాత ఆ రేంజ్‌లోనే సందడి చేస్తోన్న మరో హీరోనే కల్యాణ్ రామ్. కెరీర్ ఆరంభం నుంచీ వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న కల్యాణ్ రామ్.. గత ఏడాది 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి విధితమే.
తెలుగు పిల్ల డింపుల్ అందాల జాతర: ఎద భాగం కనిపించేలా ఏకంగా ఫ్లైట్‌లోనే!
సోషియో ఫాంటసీ జోనర్‌లో నందమూరి కల్యాణ్ రామ్ నటించిన చిత్రమే 'బింబిసార'. టైం ట్రావెల్ కాన్సెప్టుతో మల్లిడి వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో ఈ మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రానికి రూ. 40 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. దీంతో రూ. 22 కోట్లకు పైగా లాభాలు కూడా వచ్చాయి.

బ్లాక్ బస్టర్ అవడంతో పాటు థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసిన 'బింబిసార' మూవీ ఇటీవలే జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అయింది. దీనికి సినిమా హాళ్లు, ఓటీటీలో మాదిరిగానే బుల్లితెరపైనా భారీ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి అర్బన్ ఏరియాలో 11.46 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి ఏకంగా 9.45 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తద్వారా కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్ రాబట్టిన చిత్రంగా 'బింబిసార' రికార్డును క్రియేట్ చేసింది. అలాగే, ఈ మధ్య కాలంలో మంచి రేటింగ్ సాధించిన సినిమాగానూ నిలిచింది.
Shraddha Das: లోదుస్తులు లేకుండా శ్రద్దా దాస్ రచ్చ.. బాబోయ్ ఇలా తెగించిందేంటి!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట తెరకెక్కించిన సినిమానే 'బింబిసార'. ఈ సోషియో ఫాంటసీ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో కేథరిన్ థ్రెస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.