»   » ఆశ్చర్యపోతారు: తీన్మార్ బిత్తిరి సత్తి.... సంపాదన ఎంతో తెలుసా?

ఆశ్చర్యపోతారు: తీన్మార్ బిత్తిరి సత్తి.... సంపాదన ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగంతో పోలిస్తే... బుల్లితెర ఇండస్ట్రీ చాలా చిన్నదే. అయితే ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత బుల్లితెర మరింత విస్తరించింది. బుల్లితెర కార్యక్రమాలన్నీ ఇంటర్నెట్ కు అనుసంధానం కావడం, మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడకం పెరగడంతో అరచేతిలో అన్ని కార్యక్రమాలు చూసే అవకాశం లభిస్తోంది.

దీంతో టీవీల్లో మిస్సయిన కార్యక్రమాలు ఇంటర్నెట్ ద్వారా చూసే వారి సంఖ్య పెరిగి పోయింది. ఈ కారణంగా బుల్లితెర రంగానికి ఆదరణ మరింత పెరిగింది... బుల్లితెర వీక్షకుల సంఖ్య సినిమాలు చూసే వారి సంఖ్యకంటే ఎక్కువైంది. దీంతో బుల్లితెరకు పని చేసే యాంకర్లు, కమెడియన్లకు డిమాండ్ పెరిగింది. వారి పాపులారిటీని బట్టి రెమ్యూనరేషన్ కూడా భారీగా పొందుతున్నారు.

బుల్లితెరపై ఇపుడు అనసూయ, రష్మి, బిత్తిరి సత్తి, యాంకర్ ప్రదీప్, యాంకర్ రవి, శ్రీముఖి, లాస్య, చలాకీ చంటి వాళ్లు తమ తమ షోలతో సూపర్ సక్సెస్ అయ్యారు. తీన్మార్ కార్యక్రమం వల్లనే వి6 ఛానల్ పాపులారిటీ, రేటింగ్ కూడా బాగా పెరిగింది. దీంతో బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ కూడా భారీగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఎవరీ బిత్తిరి సత్తి?

ఎవరీ బిత్తిరి సత్తి?

బెల్లితెరపై బిత్తిరి సత్తిగా అందరికీ సుపరిచితమైన సత్తి అసలు పేరు చేవేళ్ల రవి. రంగారెడ్డి జిల్లా పమేనా గ్రామానికి చెందిన వాడు. చిన్నతనం నుండి ప్రముఖులను ఇమేట్ చేస్తూ అందరినీ ఎంటర్టెన్ చేసేవాడు. అతనిలోని ఆ టాలెంటే ఇపుడు అతన్ని పెద్ద సెలబ్రిటీ చేసింది.

తొలి షో ఏ ఛానల్ లో?

తొలి షో ఏ ఛానల్ లో?

స్నేహితుల సలహా మేరకు హైదరాబాద్ వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నించిన రవి మొదట్లో చాలా కష్టాలు పడ్డాడు. మొదటి అవకాశం జీ తెలుగు ఛానల్ లో కామెడీ క్లబ్ అనే కార్యక్రమానికి యాంకరింగ్ చేసే అవకాశం దక్కింది. ఈ షో సక్సెస్ కావడంతో అతనికి వి6 తీన్మార్ లో అవకాశం వచ్చింది.

అతని .జీవితాన్ని మార్చేసింది

అతని .జీవితాన్ని మార్చేసింది

వి6 చానల్ కార్యక్రమం ‘తీన్మార్' చేవేళ్ల రవి జీవితాన్నే మార్చేసింది. బిత్తిరి సత్తిగా అతని కొత్త అవరతారం, డిఫరెంట్ యాటిట్యూడ్ అతన్ని పెద్ద సెలబ్రిటీని చేసింది. ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో పల్లె ప్రాంతాల నుండి, పట్టనాల వరకు బిత్తిరి సత్తి గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

తీన్మార్ షో తొలి జీతం

తీన్మార్ షో తొలి జీతం

తీన్మార్ షోలో అవకాశం కోసం తొలి నెల తన టాలెంట్ నిరూపించుకోవడానికి జీతం లేకుండానే పని చేసాడట సత్తి. అతని పనితీరు నచ్చడంతో మరుసటి నెల నుండి రూ. 30 వేల జీతం ఫిక్స్ చేసారట ఛానల్ వారు.

ఇపుడు నెలకు లక్ష ముప్పైవేలు?

ఇపుడు నెలకు లక్ష ముప్పైవేలు?

తీన్మార్ షో బాగా పాపులర్ కావడం, ఈ షో కారణంగా టీవీ ఛానల్ రేటింగ్ కూడా భారీగా పెరగడంతో బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచారు. ఇపుడు అతడు నెలకు రూ. లక్ష ముప్పైవేలు తీసుకుంటున్నట్లు సమాచారం.

బుల్లితెర యాంకర్ ప్రదీప్... రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బుల్లితెర యాంకర్ ప్రదీప్... రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు ఎంటర్టెన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన యాంకర్ ప్రదీప్. అటు బుల్లితెర కార్యక్రమాలు, ఇటు ఆడియో ఫంక్షన్లతో పాటు అప్పుడప్పుడు వెండితెరపై కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆ హీరోతోనా? తెలుగు యాంకర్ లాస్య గురించి షాకింగ్ న్యూస్?

ఆ హీరోతోనా? తెలుగు యాంకర్ లాస్య గురించి షాకింగ్ న్యూస్?

ఎంటర్టెన్మెంట్ రంగంలో స్టార్ ఇమేజ్, పాపులారిటీ పెరిగుతున్న కొద్దీ అభిమానుల పాలోయింగ్ పెరిగినట్లే..... వారి గురించి రూమర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఖతర్నాక్ కామెడీ షో... కమెడియన్లకి అసలెంత ముడుతోందో తెలుసా..?

ఖతర్నాక్ కామెడీ షో... కమెడియన్లకి అసలెంత ముడుతోందో తెలుసా..?

మీరూహించలేరు: ఖతర్నాక్ కామెడీ షో... కమెడియన్లకి అసలెంత ముడుతోందో తెలుసా..?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

టీఆర్పీ ల గొడవలేనా?? టీవీ షో లో కొట్టుకునే దాకా వెళ్ళిన యాంకర్ రవి-ప్రభాకర్

టీఆర్పీ ల గొడవలేనా?? టీవీ షో లో కొట్టుకునే దాకా వెళ్ళిన యాంకర్ రవి-ప్రభాకర్

టీఆర్పీ ల గొడవలేనా?? టీవీ షో లో కొట్టుకునే దాకా వెళ్ళిన యాంకర్ రవి-ప్రభాకర్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Check out Income And Remuneration Details Of Small screen famous actor Bithiri Sathi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu