Brahmamudi August 22nd Episode: నీ కడుపుకి కారణం ఎవరు .. కళావతిని నిలదీసిన రాజ్, యామిని ప్లాన్ అట్టర్ ఫ్లాప్

Photo Courtesy: JioHotstar

అమెరికాకు బయల్దేరిన రాజ్‌ను ఆపడానికి ఇందిర, అపర్ణలు ఎంతో ప్రయత్నిస్తారు. కానీ అతను ఎవరి వాట వినిపించుకోకుండా అమెరికా వెళ్లేందుకే నిర్ణయం తీసుకుంటాడు. మా బావ ఎవరి కోసం ఆగాలి అని ప్రశ్నిస్తుంది యామిని. తనను ఎంతో ప్రేమిస్తే కళావతి మా బావ జీవితంతో ఆడుకుందని అంటుంది. నా కోడలి జోలికి రావొద్దని వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. రాజ్ అమెరికా వెళ్లిపోతుండటంతో యామిని సంతోషిస్తుంది. ఆ వెంటనే కావ్యకి ఫోన్ చేసి మా బావని నాకు దగ్గర చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని అంటుంది.

త్వరలోనే నేను మా బావ దగ్గరికి వెళ్లిపోతానని, ఆ వెంటనే అతనిని నా దారిలోకి తెచ్చుకుని పెళ్లి చేసుకుని, పిల్లల్ని కంటానని చెబుతుంది. ఆ మాటలతో కావ్య బాధపడుతూ కృష్ణుడి దగ్గర తన గోడు వెళ్లబోసుకుంటుంది. రుద్రాణికి యామిని ఫోన్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని చెప్పమని అంటుంది. రాజ్‌ను దక్కించుకోవడానికి అతనికి నిజం చెప్పేయాలని కావ్య నిర్ణయం తీసుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఆగస్ట్ 22వ తేదీ ఎపిసోడ్ 807లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial August 22nd 2025 Episode 807 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

నేను అమెరికా వెళ్లిపోతున్నానని తెలిస్తే తను రాకుండా ఎందుకు ఉంటుంది.. తప్పకుండా వస్తుందని రుద్రాణితో అంటాడు రాజ్. నేను కూడా అదే నమ్మకంతో చెబుతున్నా.. తను రాదు, ఎందుకంటే నిన్ను ఫేస్ చేయలేదని అంటుంది రుద్రాణి. నిజం బయటపడుతుందని అదేంటో నేను చెప్పలేనని అంటుంది. అడిగితే నిజముందని అంటారు, కానీ అదేంటో చెప్పరని మండిపడతాడు. నువ్వు కావ్యని వదిలేసి ఇలా వెళ్లడం చాలా తప్పని అంటుంది రుద్రాణి. మా ఇద్దరి మంచి కోరేవారే అయితే నిజం ఏంటో చెప్పమని రాజ్ నిలదీస్తాడు. ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా రాజ్ కారు ఎక్కబోతుండటంతో కళావతి కడుపుతో ఉందని నిజం చెబుతుంది రుద్రాణి. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు.

ఈ నిజాన్ని నీకు చెప్పలేక, నీతో పెళ్లికి ఒప్పుకోలేక పాపం తనలో తానే ఎంత బాధపడుతుందో తెలుసా? అని అంటుంది రుద్రాణి. ఇన్ని రోజులుగా నువ్వు ఎంత వెంటపడుతున్నా, పెళ్లి చేసుకోమని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కావ్య ఒప్పుకోకపోవడానికి కారణం ఇదేనని చెబుతుంది. ఇంతలో కావ్య అక్కడికి వచ్చి మీతో ఒక విషయం చెప్పాలని అంటుంది. దాంతో రాజ్.. నువ్వు ప్రెగ్నెంటా అని నిలదీస్తాడు. రామ్‌ని ఆపడానికి నిజం చెప్పక తప్పలేదని తనను క్షమించమని కావ్యని అడుగుతుంది రుద్రాణి. ఆ వెంటనే రాజ్ బాగా నవ్వుకుని ప్లాన్ అదిరిపోయిందని, దీనికి సూత్రధారి ఎవరని అడుగుతాడు. మీరు కడుపుతో ఉన్నానని చెబితే నమ్ముతానని ఎలా అనుకున్నారని ప్రశ్నిస్తాడు రాజ్.

ఓరి తింగరోడా.. నేను చెప్పినదంతా అబద్ధం అనుకున్నావా? ఏంటీ అని రుద్రాణి తిట్టుకుంటుంది. ఇలాంటి ఫ్రాంక్స్ అన్ని వేరే వాళ్ల మీద వేస్తే నమ్మేవాడినేమో అని అంటాడు. మీ గురించి ఇలాంటి లేనిపోనివి చెబితే ఎలా నమ్ముతానని అంటాడు రాజ్. మీరెంటో మీ క్యారెక్టర్ ఏంటో తెలిసి కూడా మీరు తల్లి కాబోతున్నారని చెబితే నమ్ముతానా అని నిలదీస్తాడు. నేను చెప్పింది నిజమని, నేను నిజంగానే తల్లిని అంటుంది కావ్య. మీకు దూరంగా ఉండటానికి, మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోవడానికి కూడా కారణం ఇదేనని చెబుతుంది. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. కళావతిని నువ్వు చాలా బాగా అర్ధం చేసుకున్నావు కదా.. అలాంటి మనిషి కన్నీళ్లతో నిజం చెబితే నీకు ఇంకా అర్ధం కాలేదా? అని అడుగుతుంది రుద్రాణి. తను కడుపుతో ఉందని, త్వరలోనే తను ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందని.. ఇది నువ్వు నమ్మలేని నిజమని అంటుంది.

ఆ వెంటనే ఇందిర, అపర్ణలను కలిసిన రాజ్.. ఇంట్లో ఏం జరుగుతోంది? నిజంగా కళావతి గారు ప్రెగ్నెంటా అని అడుగుతాడు. కళావతిగారికి పెళ్లి కాలేదు కదా? తనకి ప్రెగ్నెన్సీ రావడం ఏంటీ అని నిలదీస్తాడు. ఇదంతా అబద్ధం కదా? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కళావతి గారు ఇలా అబద్ధం చెబుతున్నారు కదా అని అంటాడు రాజ్. నాతో తనకి పెళ్లి ఇష్టం లేకే, నేను తన చుట్టూ తిరగడం నచ్చకే ఇలా రుద్రాణి గారితో తను ప్రెగ్నెంట్ అని చెప్పించి ఉంటుందని అంటాడు రాజ్. నేను తనని అసహ్యించుకుని దూరంగా వెళ్లిపోవాలనే మీతో నాటకం ఆడించి ఉంటుందని అంటాడు. కళావతి ప్రెగ్నెంట్ అన్నది అబద్ధం కాదని నిజమేనని అంటారు అపర్ణ, ఇందిర. ఆ విషయం నీతో ఎలా చెప్పాలో తెలియక ఇన్నిరోజులు నీతో ఇష్టం లేనట్లుగా ప్రవర్తించిందని చెబుతారు. నువ్విలా తనకు శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతున్నావని తెలిసి నిజం చెప్పకుండా ఉండలేకపోయిందని అంటుంది ఇందిర.

ఈ నిజం మీకు ముందే తెలుసా? అని రాజ్ ప్రశ్నిస్తాడు.. ముందే తెలిసినా, నీకు నిజం చెప్పాలని అనుకున్నామని కానీ ఈలోపే ఇలా చెప్పాలని అనుకోలేదని చెబుతుంది ఇందిర. మీరంతా కలిసి నన్ను మోసం చేయాలని అనుకున్నారని, మీరందరినీ సొంత కుటుంబంలా భావించానని బాధపడతాడు రాజ్. కళావతి గారికి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, తనను ప్రేమించమని నన్నెందుకు యంకరేజ్ చేశారని నిలదీస్తాడు రాజ్. తను ప్రెగ్నెంట్ అని, తన వెంట పడొద్దని నన్నెందుకు ఆపలేదని అడుగుతాడు. కళావతి గారి ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు? అని రాజ్ ప్రశ్నించడంతో ఇందిర, అపర్ణలు షాక్ అవుతారు. కనీసం కళావతి గారికైనా తెలుసా అని అడుగుతాడు. తను నన్ను మోసం చేసిందో? మోసపోయిందో? నాకు తెలియదని కానీ తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో తెలిసేవరకు తనను అస్సలు క్షమించను, తన ముఖం చూడాలన్నా అసహ్యంగా ఉందని చెప్పండి అని చెప్పి వెళ్లిపోతాడు.

రాజ్ వెళ్లిపోయాక రుద్రాణికి దుగ్గిరాల ఫ్యామిలీ క్లాస్ తీసుకుంటుంది. ఈ మాత్రం నిజం మేం చెప్పలేకపోయామా అని ఇందిర మండిపడుతుంది. కావ్య కడుపులో పెరుగుతున్నది వాడి బిడ్డే కదా? తను మోస్తున్నది వాడి రక్తాన్ని అనే నిజం బయటపెట్టలేక కావ్య చస్తూ బతుకుతోంది. కావ్య కడుపుతో ఉందనే నిజం చెబితే దానికి కారణం ఎవరని అడుగుతాడనే కదా ఇన్ని రోజులు కావ్య మౌనంగా ఉందని మండిపడుతుంది ఇందిర. తగుదునమ్మా అని వెళ్లి, ఇప్పుడు అందరూ తలలు పెట్టుకునేలా చేశావని రుద్రాణిపై ఫైర్ అవుతుంది. అంతా తనను కార్నర్ చేయడంతో రుద్రాణి ఫైర్ అవుతుంది. కావ్య ఏదో అందని రాజ్ అలిగి అమెరికా వెళ్లిపోతోంది.. మీరెవ్వరూ ఆపడం లేదు, పోనీ కావ్య ఏమైనా ఆపుతుందా అంటే గదిలో ఏడుస్తూ కూర్చొందని అంటుంది.

దూరం అయిపోతున్న వాళ్లిద్దరినీ దగ్గర చేయాలని అనుకున్నానని.. అందుకే కావ్య కడుపుతో ఉందన్న విషయం రాజ్‌కి చెప్పేశానని అంటుంది రుద్రాణి. నువ్వు శాశ్వతంగా విడదీయడానికి వెళ్లినట్లుగా ఉందని మండిపడుతుంది ఇందిర. విడగొట్టే దానినే అయితే తనే కావ్యకు భర్త అని, కావ్య బిడ్డకు తనే తండ్రి అని రాజ్‌కి గతం గుర్తుచేసే దానిని కదా అని అంటుంది రుద్రాణి. కావ్యని రాజ్ అపార్ధం చేసుకుంటున్నాడని, ఇప్పుడేం చేద్దామని ఇందిరని అడుగుతుంది అపర్ణ. ఇక మనం ఏం చేసినా ఆయన నన్ను అపార్ధం చేసుకోకుండా అడ్డుకోలేమని అంటుంది కావ్య. ఆయన దృష్టిలో నేను తప్పు చేసిన దానిలాగే మిగిలిపోతానని చెబుతుంది.

కావ్య ప్రెగ్నెంట్ అని తెలియడంతో రాజ్ బాధపడుతుంటాడు. బావని ఓదార్చి అతనితో నా పెళ్లికి ఒప్పించమని తల్లిదండ్రులను అడుగుతుంది యామిని. దాంతో రఘునాథ్, వైదేహిలు రాజ్ దగ్గరికి వెళ్తారు. మనం బాగా నమ్మిన మనిషి మనల్ని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసని అంటుంది. నీకు మేం ఉన్నాం.. నిన్ను ప్రాణంగా ప్రేమించి, నీకోసమే బతుకున్న నా కూతురు ఉందని అంటాడు రఘునాథ్. జరిగినదంతా పీడకలగా మరిచిపోయి నా కూతురిని పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకోండని చెబుతాడు. నేను యామినిని పెళ్లి చేసుకోలేనని, నేను కళావతి కోసమే బతుకుతున్నానని.. తను నన్ను మోసం చేసి ఉండొచ్చు కానీ తప్పు మాత్రం ఎప్పటికీ చేయదని అంటాడు రాజ్. బావ మనసు ఆల్రెడీ ముక్కలైందని, దానిని ఇంకా తుక్కుతుక్కు చేశామంటే రాజ్ చచ్చినట్లు నా వాడు అవుతాడని అంటుంది యామిని. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X