Brahmamudi August 29th Episode: రాజ్‌కి గుర్తొచ్చిన గతం.. యామినికి ముచ్చెమటలు, రుద్రాణి మాస్టర్ ప్లాన్

Photo Courtesy: JioHotstar

అపర్ణ మాటలతో కావ్యతో గడిపిన క్షణాలు, ఆమెతో తన పెళ్లి సహా గతం గుర్తుచేసుకున్న రాజ్.. కళ్లు తిరిగి పడిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. అందరూ కలిసి రాజ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తారు. రాజ్ పరిస్ధితి విషమంగానే ఉందని డాక్టర్ చెప్పడంతో ఫ్యామిలీ అంతా ఏడుస్తుంటారు. ఇదంతా నా వల్లే జరిగిందని, నా ఆవేశం వల్లే వాడు ఇలాంటి పరిస్ధితికి వచ్చాడని బాధపడుతుంది అపర్ణ. ఒక్కసారి కూడా ఆలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడానని అంటుంది.

వాడికి గతాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేయొద్దని, అది వాడి ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ ముందు నుంచి చెబుతూనే ఉన్నాడని.. కానీ నేను వాడి ప్రాణం మీదకి తీసుకొచ్చానని బాధపడుతుంది. దాంతో అపర్ణని ఇందిర, ధాన్యలక్ష్మీ ఓదారుస్తారు. నీకు మొదటి నుంచి అన్యాయం చేస్తూనే ఉన్నానని నన్ను క్షమించాలని అడుగుతుంది అపర్ణ. ఇలాంటివి జరగకూడదని మా అందరికీ ఎంత నచ్చబెబుతున్నా మేం వినకుండా క్షణికావేశంలో నేను చేసిన తప్పు వాడిని చావు అంచులదాకా తీసుకెళ్లిపోయిందని బాధపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఆగస్ట్ 29వ తేదీ ఎపిసోడ్ 812లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial August 29th 2025 Episode 812 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

తన వల్లే రాజ్ ఆసుపత్రి పాలయ్యాడని, ప్రాణాల మీదకి వచ్చిందని అపర్ణ బాధపడుతూ కావ్యను క్షమాపణలు అడుగుతుంది. మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటీ? నేను ఆయనకి భార్యను కావడానికి ముందే మీరు ఆయనికి తల్లి అని అంటుంది. ప్రాణం పోసిన నేనే ఈరోజు ప్రాణాల మీదకి తీసుకొచ్చానని, వాడి తల్లిని అనే చెప్పుకునే అర్హత కూడా నాకు లేదని కుమిలిపోతుంది అపర్ణ. ఇంతలో యామిని చప్పట్లు కొడుతూ అక్కడికి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. మీ అందరి నటనా అద్భుతంగా ఉందని, తప్పు నీదంటే నీదని తప్పించుకోవాలని అనుకుంటున్నారా అని మండిపడుతుంది.

నేను చేసిన సాయానికి నా కాలు కడిగి ఆ నీళ్లు మీ నెత్తి మీద చల్లుకోవాలని అంటుంది యామిని. రాజ్‌ గతం మరిచిపోయి ఏం చేయాలో తెలియని పరిస్ధితుల్లో ఉంటే తోడుగా నిలబడ్డానని చెబుతుంది. నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా పరిచయం చేసి తనకి కొత్త జీవితాన్ని ఇచ్చానని చెబుతుంది యామిని. గతాన్ని గుర్తుచేస్తే తన ప్రాణాలకి ప్రమాదమని డాక్టర్లు చెప్పడంతో తనకి రక్షణ కవచంలా మారి అనుక్షణం తనని కాపాడుకుంటూ వచ్చానని చెబుతుంది. కానీ మీరందరూ ఏం చేశారు? పదే పదే గతాన్ని గుర్తుచేయడానికి ప్రయత్నించారని మండిపడుతుంది యామిని. తన ప్రాణాలతో ఆడుకోవాలని చూశారని, మీరు.. ఆ పెద్దావిడ ప్లాన్లు వేసి రాజ్‌ను రెచ్చగొట్టారని అంటుంది.

కావ్య సంగతి చెప్పాల్సిన పనే లేదని.. తోక లాగా ఎప్పుడూ వెనకాలే తిరుగుతుంటుందని, గతానికి సంబంధించిన విషయాలన్నీ గుర్తుచేస్తూనే ఉంటుందని చెబుతుంది యామిని. అందుకే రాజ్‌కి ఇలా జరిగిందని మండిపడుతుంది. అసలు మీకెవ్వరికీ రాజ్ గురించి బాధపడే అర్హత లేదని.. తన గురించి బాధపడేది నేను ఒక్కదానినే అంటుంది యామిని. ఈరోజు తనకేమైనా జరిగితే మీలో ఒక్కరిని కూడా వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలతో రగిలిపోయిన కావ్య .. యామినిని లాగి కొడుతుంది. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది కావ్య.

నువ్వెంత నీ బతుకెంత మా కుటుంబాన్ని వేలెత్తి చూపించాలని అనుకుంటున్నావా? సిగ్గు లేకుండా నా మొగుడిని, నీ మొగుడిగా చేసుకోవాలని పెళ్లికి రెడీ అయిపోయావని ఫైర్ అవుతుంది కావ్య. అసలు దీనంతటికి కారణం నువ్వే కదా? ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించినట్లు నటించి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఆయనను రెచ్చగొట్టి పంపించావని కావ్య చెప్పడంతో యామిని షాక్ అవుతుంది. ఆయనలో అనుమానం రేపావని, నన్ను వెతుక్కుంటూ ఆయన నా ఇంటికి వచ్చి నన్ను అవమానించేలా రెచ్చగొట్టింది నువ్వే కదా అని అంటుంది. ఆయన మనసును చెడగొట్టి, నోటికొచ్చినట్లుగా మాట్లాడేలా చేసి మా అత్తయ్య గారి చేత నిజం చెప్పేలా చేసింది నువ్వు కదా అని నిలదీస్తుంది కావ్య.

కావ్య ఆవేశాన్ని చూసిన రుద్రాణి.. వెంటనే యామినిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. నన్నే కొడుతుందా? నా బావకి అలాంటి పరిస్ధితి క్రియేట్ చేసిన దానిని వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది. ఇందాక చెంప దెబ్బతో సరిపెట్టింది? ఈసారి చంపేస్తుందని రుద్రాణి చెబుతుంది. నువ్వు కావ్యని అనవసరంగా కెలికావని అంటుంది. బావ మీద వాళ్లకేనా హక్కు.. నాకేం లేదా అని ప్రశ్నిస్తుంది యామిని. ప్రేమించడం తప్ప రాజ్‌కు దగ్గరవ్వడానికి నీకేం హక్కు ఉందని రుద్రాణి ప్రశ్నిస్తుంది. కానీ ఆ కావ్యకి సర్వహక్కులు ఉన్నాయని.. అగ్నిసాక్షిగా అందరి ముందు రాజ్ చేత తాళి కట్టించుకుందని, రాజ్ తన భర్త అని చెప్పుకోవడానికి 100 కారణాలు ఉన్నాయని మరి నీకేం ఉన్నాయని అడుగుతుంది రుద్రాణి.

రాజ్ కూడా నిన్ను ప్రేమించడం లేదని, నీది జస్ట్ వన్ సైడ్ లవ్ అని అంటుంది. కానీ వాళ్లది భార్యాభర్తల బంధమని, నువ్వెళ్లి అడిగితే భార్య కొట్టకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఇన్ని రోజులు రాజ్‌కి గతం గుర్తుచేస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయపడింది కాబట్టే నువ్వు ఏం చేసినా, ఎన్ని ఆటలు ఆడినా కావ్య భరించిందని చెబుతుంది. ఇప్పుడు నువ్వెళ్లి తలదూర్చావంటే అసలు దీనింతటికి కారణం నువ్వేనని పిచ్చకొట్టుడు కొడతారని వార్నింగ్ ఇస్తుంది. టైం మనది కానప్పుడు సైలెంట్‌గా ఉండాలని హితవు చెబుతుంది రుద్రాణి. అవకాశం వచ్చేంత వరకు ఇలా చచ్చిన పాములా వెయిట్ చేయాల్సిందేనా అని ప్రశ్నిస్తుంది యామిని. టైం వచ్చిన తర్వాత నేనే పిలుస్తానని చెబుతుంది రుద్రాణి.

ఒంటరిగా బాధపడుతున్న కావ్య దగ్గరికి ఇందిర వెళ్లి ఆమెను ఓదారుస్తుంది. నేను ఏం చేసినా నా వెనుక మీ మనవడు ఉన్నాడనే చేశానని అంటుంది కావ్య. కానీ నా ధైర్యమే లోపల ప్రాణాలతో పోరాడుతుందని, అలాంటప్పుడు భయపడకుండా ఎలా ఉండగలనని అడుగుతుంది. ఆడదానికి భర్తే సర్వస్వమని, అలాంటి భర్తకు ప్రాణాపాయం కలిగితే భార్య తట్టుకోలేదని అలాంటి దేవుడు నీకు అన్యాయం చేయడని చెబుతుంది ఇందిర. దాంతో దేవుడి దగ్గరికి వెళ్లి రాజ్‌ని రక్షించమని ప్రార్ధిస్తుంది కావ్య. ఇంతలో డాక్టర్ బయటికొచ్చి పేషెంట్ స్పృహలోకి వచ్చాడని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. తను బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని, మళ్లీ అలాంటి పరిస్ధితి తీసుకురావొద్దని.. మళ్లీ స్పృహ తప్పితే మాత్రం చాలా సీరియస్‌గా ఉంటుందని డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు.

రాజ్ స్పృహలోకి వచ్చి కళావతికి ఎలా ఉందని అడుగుతాడు రాజ్. తనకి ఏమైంది? బాగానే ఉంది కదా అని అంటాడు. తనికి ఏం కాలేదు బాగానే ఉంది కాదా అని అంటుంది అపర్ణ. మేమిద్దరం కారులో వెళ్లేటప్పుడే కదా యాక్సిడెంట్ జరిగింది.. నేను ఆసుపత్రిలో ఉన్నానంటే మరి తనెక్కడ ఉంది? తనకి ఏమైంది? అని అడుగుతాడు రాజ్. బావకి మెలకువ వచ్చిందని నిన్ను చూడాలని అడుగుతున్నాడని అప్పూ చెప్పడంతో కావ్య పరుగు పరుగున వస్తుంది. కావ్యని చూడగానే రాజ్ సంతోషిస్తాడు. మావాడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని, ఎప్పుడో జరిగిన శ్రీశైలం యాక్సిడెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడేంటీ? అని సుభాష్ డాక్టర్‌ని అడుగుతాడు.

ఇదంతా చూసిన యామిని .. రాజ్‌కి గతం గుర్తొచ్చిందని భయపడి ఇంట్లో సామాన్లు విసిరికొడుతుంది. ఇన్నిరోజులు బావ ప్రేమని పొందాలని, తనతో జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో ఆశలు పెంచుకున్నానని చెబుతుంది యామిని. ఆ కలలు నిజం చేసుకోవడానికి, రాజ్ చేత మూడు ముళ్లు వేయించుకోవడానికి 7 సముద్రాలు దాటేసి వస్తే ఆ కావ్య మెడలో తాళి కట్టి నాకు కన్నీళ్లు మిగిల్చాడని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X