Brahmamudi October 15th Episode: రుద్రాణికి కావ్య వార్నింగ్... రాజ్‌పై మహిళా సంఘాల్ని దించిన రుద్రాణి

Photo Courtesy: JioHotstar

రాజ్ ప్రవర్తనతో ఒంటరిగా బాధపడుతున్న కావ్యని కృష్ణమూర్తి ఓదారుస్తాడు. నువ్వేం తప్పు చేయడం లేదు.. యుద్ధం చేస్తున్నావ్ ఎక్కడా? తగ్గొద్దని కూతురికి అండగ నిలబడతాడు. రాజ్‌ని ఎలాగైనా మార్చాలని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా నిరాహారదీక్ష చేస్తున్నట్లుగా నటిస్తారు. కానీ వాళ్లని పట్టించుకోకుండా రాజ్ మాత్రం టిఫిన్ తినడానికి వెళ్లడంతో అతనిని కుటుంబ సభ్యులు విసిగించేస్తారు. మనం కొన్నిరోజులు ఇలాగే చేస్తే కావ్యని ఇంటికి తీసుకొస్తాడని ఇందిర అంటుంది.

రుద్రాణి - రాహుల్‌ల ప్లాన్ ప్రకారం ఉదయాన్నే మీడియా ప్రతినిధులు కనకం ఇంటికి వస్తారు. వారిని చూసి షాక్ అయిన కనకం వెంటనే వెళ్లి కృష్ణమూర్తి, కావ్యలకు విషయం చెబుతుంది. వాళ్ల మాటలకి నువ్వు రెచ్చిపోవద్దు, నేను చూసుకుంటానని కనకానికి కావ్య చెబుతుంది. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు కావ్య షాక్ అవుతుంది. నేను దుగ్గిరాల కుటుంబాన్ని వదిలిరాలేదని, రాజ్ గారిలో ఏ గొడవలు లేవని చెబుతుంది కావ్య. కానీ మీడియా వాళ్లు రాజ్‌ మీద దుష్ప్రచారం చేయడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 15వ తేదీ ఎపిసోడ్ 852లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial October 15th 2025 Episode 852 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్య ఇంటికి మీడియా వెళ్లడంపై రుద్రాణి నానామాటలు అంటుంది. అలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తి కోసం నువ్వు దిగజారొద్దని, నువ్వు ఊ అంటే అమ్మాయిలు క్యూ కడతారని అంటుంది. దాంతో ఇందిర కోపంతో రుద్రాణి చెంప పగులగొడుతుంది. రుద్రాణికి కాపురాలు కూల్చడం తెలిసినంత బాగా వాటిని నిలబెట్టడం రాదని మండిపడుతుంది అపర్ణ. వాడు తీసుకున్న పిచ్చి నిర్ణయాలే కావ్యని మీడియా ముందు నిలబెట్టాయని, తప్పు చేసింది నా మనవడని అంటుంది. అది తప్పు చేయనంత వరకు దానికే సపోర్ట్ చేస్తామని అపర్ణ తేల్చి చెబుతుంది. ఇప్పటి వరకు అల్లరి పాలైంది చాలని, మన పరువుని, మన ఇంటిని రోడ్డున పడేయొద్దని బతిమలాడుతుంది అపర్ణ. వెళ్లి దానిని ఇంటికి తీసుకురమ్మని చెబుతుంది.

నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను? ఇంక నా వల్ల కాదని అంటాడు రాజ్. గట్టిగా ప్రయత్నిస్తే ఈ ప్రపంచంలో కానిది అంటూ ఏది ఉండదని, తప్పు చేసింది నువ్వు, నీ తప్పుకి నా కోడలు శిక్ష అనుభవిస్తుంది అంటే నేను ఒప్పకోనని తేల్చేస్తుంది అపర్ణ. మీడియాతో గొడవ చేయించి దుగ్గిరాల ఫ్యామిలీని ముక్కలు చేయాలని అనుకున్న ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో రుద్రాణిప రాహుల్ సెటైర్లు వేస్తాడు. రాజ్‌ని, కావ్యని విడగొడతానని నా చేత మీడియా వాళ్లని ఇన్వాల్వ్ చేయించావ్... నీ ప్లాన్ నీకే రివర్స్ కొట్టిందని అంటాడు.

రాజ్‌కి సపోర్ట్ చేసి ఆ కావ్యని ఇంట్లో నుంచి గెంటేస్తారని ఆ ప్లాన్ వేశానని ఆ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యేలా అందరూ ఆ కావ్యకి సపోర్ట్ చేశారు. దానిని ఇంటిల్లిపాది ఎందుకంత మోస్తున్నారో నాకు అర్ధం కావడం లేదని అంటుంది రుద్రాణి. ఇంతలో కావ్య ఆమెకు ఫోన్ చేస్తుండటంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఆ మీడియా వాళ్లని పంపించింది మనమేనని డౌట్ వచ్చిందా? అని రాహుల్ టెన్షన్ పడతాడు. ఈ మీడియా కవరేజ్ ఐడియా మీదేనా? నేను పుట్టింటికి రాగానే ఆయనకు, నాకు ఎలా పుల్లలు పెట్టాలా? ఆ ఇంటి పరువుని రోడ్డునపడేసి కుటుంబాన్ని ఎలా ముక్కలు చేయాలా? అని ఆ శకునిలా పథకాలు రచిస్తున్నారా? అని మండిపడుతుంది కావ్య. అసలు ఆ మీడియా వాళ్లకి మనింటి ప్రాబ్లమ్ ఎలా తెలుస్తుంది? అని నిలదీస్తుంది.

వాళ్లకి నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీ దగ్గరికి పంపించానని అనుకుంటున్నావా? తిన్నింటి వాసాలు లెక్కపెట్టాలని చూడటం, ఉన్నింటి పరువు తీయాలని అనుకోవడం నా ఇంటా వంటా లేదని కవర్ చేయాలని చూస్తుంది రుద్రాణి. మీరెంటో మీ క్యారెక్టర్ నాకు బాగా తెలుసు.. ఎప్పుడెప్పుడు ఆ ఇంటిని ముక్కలు చేద్దామా? ఆలోచించడమే కదా నీ పని? కంచు కోటలా ఈ కావ్య ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూనే ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది. మీడియా వాళ్లు రావడం వెనుక మీ హస్తం ఉందేమోనని ఈ కాల్ చేశానని, ఆ డౌట్ కన్ఫర్మ్ అయితే మాత్రం ట్రీట్‌మెంట్ వేరేలా ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఆ మాటలతో రగిలిపోయిన రుద్రాణి.. దీనికి పొగరు బాగా పెరిగిందని, ఇంకా డోస్ పెంచి ఆ రాజ్ దీనిని అసహ్యించుకునేలా చేయాలని అంటుంది రుద్రాణి.

ఈసారి మహిళా సంఘాలని పంపిద్దామని, ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే వాళ్లు అసలు ఊరుకోరని చెప్పడంతో వెంటనే వాళ్లకి ఫోన్ చేస్తాడు రాహుల్. మీడియా వాళ్లు చేసిన రచ్చతో రగిలిపోయిన రాజ్.. కావ్యకి ఫోన్ చేసి ఫైర్ అవుతాడు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్ధమవుతుందా? నేను బిడ్డను వద్దు అంటే నువ్వు కావాలని పుట్టింటికి వెళ్లిపోయావు? ఇంట్లో ఉన్న సమస్యను మీ ఇంట్లో పెట్టావ్? ఇప్పుడు ఏకంగా మీడియాని పిలిపించి దుగ్గిరాల వారింటి పరువుని రోడ్డు మీద పడేయాలని చూస్తున్నావా? అని క్లాస్ పీకుతాడు రాజ్. పరువు కోసం పరిగెత్తుకుంటూ నీ దగ్గరకొచ్చి.. నిన్ను తీసుకెళ్తానని అనుకుంటున్నావా? అని మండిపడతాడు.

తల్లిగా నా బిడ్డను కాపాడుకోవడమే కాదు, భార్యగా నా అత్తారింటి పరువును కాపాడుకోవడం కూడా నా బాధ్యతేనని చెబుతుంది కావ్య. మీ మాట వినని నేను చెప్పడం లేదు.. కానీ నా బిడ్డను ఎందుకు తీసేయమంటున్నారో కారణం చెప్పమంటున్నానని అడుగుతుంది. ఆ కారణం చెప్పేది అయితే నేను చెప్పేవాడిని కదా? ఇన్నిసార్లు అడిగినా చెప్పడం లేదంటే ఎందుకు అర్ధం చేసుకోవడం లేదని అడుగుతాడు. ఇది ఒక బిడ్డ ప్రాణానికి సంబంధించిన విషయమని చెబుతుంది. ఈ రాక్షసిని ఎలా తీసుకురావాల నాకు అర్ధం కావడం లేదని రగిలిపోతాడు రాజ్.

ఒంటరిగా బాధపడుతున్న కావ్య దగ్గరికి కనకం వచ్చి ఓదారుస్తుంది. కడుపులోని బిడ్డను చంపుకోమ్మని చెప్పిన అల్లుడుగారి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావని మండిపడుతుంది కనకం. నీకు మేం ఉన్నాం కదా? నీ బిడ్డ మీద ఈగ కూడా వాలనివ్వం... ఇన్ని రోజులు ఈ సమస్య నీ ఇంటిది మాత్రమే.. కానీ మీడియా వాళ్ల వల్ల ఇప్పుడు ఈ సమాజానికి ప్రాబ్లమ్ అయ్యిందని చెబుతుంది కనకం. ఈ సమాజంలో పరువు కోసమైనా అల్లుడుగారు తన మనసు మార్చుకుంటారని చెబుతుంది కనకం. నీకు బిడ్డ కావాలంటే వాళ్లని కొంతకాలం బాధపెట్టక తప్పదని అంటుంది. అందరి దృష్టిలో ఆయనని అల్లరి చేయాలని నేను ఇక్కడికి రాలేదని, నా కారణంగా ఆయనని మీడియా వాళ్లు నానారకాలుగా మాట్లాడుతుంటే నా వల్ల కావడం లేదని చెబుతుంది.

కావ్య ఫోటో చూసుకుంటూ రాజ్ బాధపడతాడు. నన్ను అన్ని విషయాల్లో అర్ధం చేసుకున్న నువ్వు .. ఈ విషయంలో మాత్రం ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నావని అనుకుంటాడు. ఉదయాన్నే దుగ్గిరాల వారింటికి మహిళా సంఘాల ప్రతినిధులు వస్తారు. మేం శ్రీశక్తి మహిళా సంఘం నుంచి వస్తున్నామని రాజ్‌తో మాట్లాడటానికి వస్తున్నామని చెబుతారు. కట్టుకున్న భార్యను వద్దు అనడం తప్పు కాదా? బిడ్డను వద్దు అనడం తప్పు కాదా? బలవంతంగా అబార్షన్ చేయించుకోమనడం తప్పు కాదా? అని నిలదీస్తారు. నా భార్యంటే నాకు ప్రేమ మాత్రమే కాదు, ఎంతో గౌరవమని చెబుతాడు రాజ్. ఆఫీస్‌లోనూ ఆడవాళ్లకి సమానమైన హక్కులు కల్పించానని అంటాడు.

మీరు చెప్పేదంతా నిజమైతే మీ భార్య మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి ఎందుకు వెళ్లిపోయిందని మహిళా సంఘాల వాళ్లు ప్రశ్నిస్తారు. నా భార్య కోసమే నేను ఇదంతా చేస్తున్నానని అంటాడు రాజ్. భార్య మీద ప్రేమతో బిడ్డను వదలుకుంటున్నారా? మీరు చెప్పే మాటలు కనీసం నమ్మేలా ఉన్నాయా? అని మహిళా సంఘాల నేతలు ప్రశ్నిస్తారు. మీ భార్యకు మీరు న్యాయం చేయకపోతే? ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిస్తారు. మీకు ఏం హక్కుందని నా మేనల్లుడిని నిలదీస్తున్నారని మండిపడుతుంది రుద్రాణి. కావ్యపై సర్వహక్కులు రాజ్‌కి ఉన్నాయని.. పిల్లలు కావాలా? వద్దా? అనేది భర్తగా తన నిర్ణయమని అంటుంది. మీరు కావ్య గారిని ఇబ్బంది పెడుతున్నారని, బిడ్డను బలవంతంగా తీయించాలని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టామంటే చాలు మీరంతా జైళ్లో కూర్చొంటారని మహిళా సంఘాల నేతలు హెచ్చరిస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X