Brahmamudi October 18th Episode: రాజ్‌ దీక్షని పెంట పెంట చేసిన తాగుబోతు.... మీడియాకు కావ్య వార్నింగ్

Photo Courtesy: JioHotstar

కనకం ఇంటికి వచ్చిన రాజ్.. నువ్వు మర్యాదగా నాతో వస్తావా? లేక విడాకులు ఇస్తావా? తేల్చుకోమని అంటాడు. దాంతో కావ్య మరో మాట లేకుండా విడాకుల పత్రాల మీద సంతకం చేసేస్తుంది. దాంతో షాకైన రాజ్.. విడాకుల పత్రాలను చించేస్తాడు. నువ్వు వచ్చే వరకు నీ ఇంటి ముందు టెంట్ వేసుకుని నిరాహారదీక్ష‌కు దిగుతాడు. రాజ్ డివోర్స్ పేపర్లతో వస్తాడని రుద్రాణి సంబరాలు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి మన ప్లాన్ సక్సెస్ కాకుండా ఇలాంటివి వద్దంటాడు. కాసేపటికి ఇందిర కుటుంబ సభ్యులను పిలిచి రాజ్‌ తీసుకొచ్చిన విడాకుల పేపర్ల మీద కావ్య సంతకం చేయించిందని అంటుంది.

కానీ భార్యను తీసుకెళ్లేవరకు మెట్టుదిగని రాజ్.. ఆమె ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగాడని చెబుతుంది. దాంతో షాకైన రుద్రాణి.. అలా చేస్తే మన ఇంటి పరువు ఏం కావాలని అంటుంది. భార్య కోసం ఏమైనా చేయొచ్చని చెబుతుంది ఇందిర. రాజ్ నిరాహారదీక్ష చేస్తుండగా కావ్య వచ్చి కాఫీ తాగుతూ, యాపిల్ తింటూ రెచ్చగొడుతుంది. ఇంతలో అక్కడికి ఓ తాగుబోతు వచ్చి... నీ దీక్ష గురించి ప్రపంచానికి చెబుతానని చెప్పి మీడియాని పిలిపిస్తాడు. మీడియాను చూసిన రాజ్ ... కావ్య దగ్గరికి వస్తుండగా అతనిని రౌండప్ చేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 18వ తేదీ ఎపిసోడ్ 855లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial October 18th 2025 Episode 855 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్య ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తోన్న రాజ్‌ను మీడియా ప్రతినిధులు రౌండప్ చేస్తారు. మీ బిడ్డ విషయంలో మీకు, మీ భార్యకు గొడవలు జరుగుతున్న మాట నిజమేనా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... పక్కనే ఉన్న తాగుబోతు అవును అంటాడు. నా బ్రదర్ చెప్పినట్లు ఆవిడ వినాల్సిందే అంటాడు. అలా చేస్తే పోలీసులు రాజ్ గారిని అరెస్ట్ చేస్తారని, జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుందని మీడియా హెచ్చరిస్తుంది. అరచేతితో సూర్యుడిని ఆపలేరు, మీ సంకెళ్లు మీ జైలు గోడలు మా బ్రదర్ ఉద్యమాన్ని ఆపలేరంటూ తాగుబోతు వాగుతాడు.

మీ భార్యతో గొడవలు ఉన్నట్లుగానే మేం భావిస్తున్నాం.. కేవలం మీరు గొప్పింటికి చెందిన వాళ్లు కాబట్టే ఇలా పట్టుబడుతున్నారా? భార్య మాటను భర్త ఎందుకు వినాలని అనుకుంటున్నారా? అని మీడియా వాళ్లు అడుగుతారు. అవును అదే నిజం.. ఆడపెత్తనం బోడి పెత్తనమని నేనెందుకు వినాలి, భార్యలే భర్త మాట వినాలని తాగుబోతు అంటాడు. దాంతో వీడు నన్ను మొత్తం ఇరికించేశాడని రాజ్ టెన్షన్ పడుతుండగా కావ్య వచ్చి నేను మీకు మొన్నే చెప్పాను, ఎలాంటి గొడవలు లేవని అంటుంది. ఆయన నన్ను సరదాగా ఏడిపించడానికి ఇలా టెంట్ వేసి ఇలా చేస్తున్నారని చెబుతుంది కావ్య. ఈ తాగుబోతు మాటల్ని నమ్మి వచ్చేస్తారా అని సీరియస్ అవుతుంది.

మీడియా వాళ్లు వెళ్లిపోవడంతో రాజ్ ఊపిరి పీల్చుకుంటాడు. నేను గనుక కడుపులోని బిడ్డను చంపుకోమని అంటున్నాడని చెబితే మీ పరిస్థితి ఏంటో అర్ధమైందా? అని రాజ్‌ని ప్రశ్నిస్తుంది. నీ కడుపులోని బిడ్డను తీసేయమంటున్నాడా? అని రాజ్‌ని ఆ తాగుబోతు నానామాటలు అంటాడు. నా సపోర్ట్ నా బ్రదర్‌కి కాదు, నా చెల్లెమ్మకి అని చెబుతాడు. మీ ఆలోచన తప్పు అని ఒప్పుకుంటారా అని కావ్య అడగ్గా.. నేనేం చేస్తున్నానో? ఎందుకు చేస్తున్నానో? నాకు క్లారిటీ ఉందని అంటాడు రాజ్. నువ్వు నాతో పాటు వచ్చే వరకు ఈ దీక్ష మాత్రం ఆగదని చెబుతాడు. కావ్య ఇంటి దగ్గర ఏం జరిగిందో తెలుసుకుని ఇందిర నవ్వుకుంటూ ఉంటుంది... ఇంతలో అపర్ణ రావడంతో ఆమెకు కూడా జరిగింది చెబుతుంది.

విషయం చెప్పకుండా ఇంట్లో అందరినీ బాధపెడుతున్నాడు.. ఎంతో హ్యాపీగా బిడ్డను మోయాల్సిన నా కోడలు, వీడి కారణంగా బాధను మోస్తోందని అపర్ణ బాధపడుతుంది. నా మనవడికి మ్యూజిక్ ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది? ముందు ముందు అసలు ఆట ఉంటుందని అంటుంది. నిరాహారదీక్ష చేస్తున్న రాజ్‌ని బయట దోమలు కుడుతూ, బాగా ఆకలి వేస్తుంది. అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయానని అనుకుంటాడు. భర్త పరిస్ధితి చూసి కావ్య బాధపడి దుప్పటి తీసుకొచ్చి ఇవ్వాలని అనుకుంటుంది. ఇంతలో కనకం తన కూతురిని ఆపుతుంది. అల్లుడిగారికి అన్ని కావాల్సినవి సమకూరిస్తే ఆయన నిర్ణయం మార్చుకోడని వార్నింగ్ ఇస్తుంది. కడుపు కాలితే అన్నం విలువ... ఇలా కష్టపడితే పెళ్లాం విలువ తెలిసొస్తుందని చెబుతుంది కనకం.

కనకం ప్లాన్ ప్రకారం ఆకలితో అల్లాడిపోతున్న రాజ్ ముందు నాటు కోడికూర తింటూ నోరూరిస్తుంది కావ్య. అన్నీ మీకు నచ్చినవే చేశానని, కావాలంటే రుచి చూడొచ్చని అంటుంది కనకం. మీరు కూడా కావాల్సినంత తినొచ్చని ... కానీ మీ దీక్షను, చెప్పుల్ని కూడా బయటే వదిలేసి రావాలని అంటుంది. ఈ చేపలకి, చికెన్‌కు ఆశపడే రకం కాదని, ఈ రాజ్ దేనికి లొంగడని చెబుతాడు. పోయిన సంవత్సరం సంక్రాంతికి మా ఇంటికి వచ్చినప్పుడు ఎలా చేశానో? అలాగే నాటుకోడి పులుసు చేశానని ఇంకా రెచ్చగొడుతుంది కనకం. దాంతో రాజ్‌కి గతం గుర్తొచ్చి నోరూరిపోతుంది... పంతం పక్కనపెట్టి లోపలికి వస్తే మీరు కూడా ఈ చికెన్ తినొచ్చని అంటుంది కావ్య. అయినప్పటికీ రాజ్ పంతం వీడకపోవడంతో డోస్ పెంచాలని కనకం అంటుంది.

రాజ్ గురించి బాధపడుతున్న అపర్ణని ఇందిర, సుభాష్‌లు ఎంత పిలిచినా పలకదు. కడుపుతో ఉన్న కోడల్ని కన్నీళ్లు పెట్టిస్తున్నాడు, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డను వద్దు అంటూ... దానిని తీసుకురావడానికి ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తున్నాడని చెబుతుంది అపర్ణ. వాడి మూర్ఖత్వంతో అందరినీ బాధపెట్టి... ఇప్పుడు వాడు కూడా బాధపడుతున్నాడని, అన్నం తినకుండా ఆకలికి ఎలా తట్టుకుంటున్నాడో అని ఎమోషనల్ అవుతుంది. ప్లేట్‌లో అన్నం పెట్టిస్తాను వెళ్లి ఎవ్వరికీ కనిపించకుండా తినిపించిరా అని ఇందిర మండిపడుతుంది. వాడు ఒక్కపూట పస్తులుంటే మనసు కొట్టుకుంటుందా? అని ఫైర్ అవుతుంది. ఇలా వాడిని గారాభం చేసే అలా మొండోడిగా తయారు చేశావు... కావ్య ఇప్పుడిప్పుడే వాడి బెండు తీస్తుంటే, కొడుకు మారుతున్నాడని సంతోషించాల్సింది పోయి అలా బాధపడుతున్నావా? అని క్లాస్ పీకుతుంది ఇందిర.

కొడుకు మారాలి అంటావు.. కష్టపడితే తల్లిగా తట్టుకోలేకపోతున్నావ్.. మనిషి మారాలంటే కష్టపడక తప్పదని చెబుతుంది ఇందిర. వాడి గురించి నీకే కాదు, మాకూ బెంగగానే ఉంది... కానీ వాడు మారిపోయి అమ్మాయిని తిరిగి ఇంటికి తీసుకొస్తే అందరం హ్యాపీగా ఉంటాం కదా అని చెబుతుంది ఇందిర. పోయిన ఏడాది దీపావళి పండుగ అందరం కలిసి సంతోషంగా జరుపుకున్నాం.. తెల్లారితే దీపావళి పండుగ.. కానీ ఇప్పుడు పరిస్ధితులు ఇలా ఉన్నాయని బాధపడుతుంది అపర్ణ. పోయిన సంవత్సరం దీపావళి లాగే చాలా హ్యాపీగా గడిచిపోతుందని, అన్ని సమస్యలు పోతాయని అంటుంది ఇంది. తండ్రి దగ్గరికి భోజనం ప్లేట్ తీసుకుని వస్తుంది కావ్య. ఒక భార్యగా ఆయన్ని పస్తులుంచడం నాకిష్టం లేదని, ఆయనకి నా బిడ్డ అక్కర్లేకపోవచ్చు... కానీ ఆయన నాకు కావాలని చెబుతుంది కావ్య.

నాకు బిడ్డెంత ముఖ్యమో, ఆయన కూడా అంతే ముఖ్యమని చెబుతుంది. నేను వెళ్లి అన్నం ప్లేట్ ఇస్తే మొండితనానికి పోయి కడుపు మాడ్చుకుంటాడని, అందుకే ఎవ్వరూ చూడకుండా నువ్వే ఇవ్వమని అంటుంది కావ్య. ఒకరి మీద ఒకరు ఇంత ప్రేమ పెట్టుకుని ఈ గొడవలేంటీ? అని కృష్ణమూర్తి అడుగుతాడు. అది అడగాల్సింది నన్ను కాదు... ఆయన్నే అడగండి, నన్ను తీసుకెళ్లడానికి నిరాహారదీక్ష చేసేంత ప్రేమ ఉన్నప్పుడు నా బిడ్డను వద్దు అనడానికి కారణం ఎందుకు చెప్పలేకపోతున్నారో మీరే అడగండి అని చెబుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X