Brahmamudi October 22nd Episode: రాజ్ కాలర్ పట్టుకున్న కావ్య.... అక్కకి అసలు నిజం చెప్పిన అప్పూ
Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే రాజ్ లేచిచూసేసరికి కావ్య ఇంటి ముందు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ప్రత్యక్షమవుతుంది. దీపావళి పండుగ జరుపుకుందామని వచ్చినట్లు చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఆ వెంటనే కావ్య వచ్చి రాజ్‌ను రెచ్చగొట్టడంతో నేను కూడా మీతో పాటే పండగ చేసుకుంటాను, కళావతిని సాయంత్రంలోగా మనింటికి తీసుకెళ్తానని అంటాడు. ఆ మాటలతో అందరూ షాక్ అవుతారు. కావ్యకి అబార్షన్ అయ్యేలా ప్రత్యేకంగా క్రాకర్స్ తయారు చేయించిన రుద్రాణి వాటిని స్వరాజ్ ద్వారా కాల్పించాలని అనుకుంటుంది.
అయితే ఆ పిల్లాడు మాత్రం నాకు వద్దని, మా మావయ్యతో కొనిపించుకుంటానని అంటాడు. రాజ్ తాను తీసుకొచ్చిన బట్టలు వేసుకునేలా రెచ్చగొట్టి సక్సెస్ అవుతుంది కావ్య. పిల్లాడు మారాం చేయడంతో రాజ్ బజారుకి వెళ్లి క్రాకర్స్ తీసుకుని వస్తాడు. వాటిలో తాను చేయించిన క్రాకర్స్ కలిపేస్తుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 22వ తేదీ ఎపిసోడ్ 858లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
తాము కావ్య కోసం తయారు చేయించిన క్రాకర్స్‌ని అప్పూ కాలుస్తుండటంతో ఏం జరుగుతుందోనని రాహుల్- రుద్రాణి టెన్షన్ పడుతుంటారు. కావ్య వంటగదిలో వంట చేసుకుంటోంది.. ఇక్కడ వీళ్ల స్పీడు చూస్తుంటే గంటలో మొత్తం అవజేసేలా ఉన్నారని అంటాడు రాహుల్. అంత కష్టపడి వాటిని ఎలా అవ్వనిస్తాను.. కావ్యని బయటికి రప్పిస్తానని అంటుంది రుద్రాణి. రాజ్ దగ్గరికి వెళ్లి.. నువ్వు కావ్యని ఒప్పించడానికి వచ్చావు, తను లోపల పని చేసుకుంటుంటే నువ్వు చిన్నపిల్లాడితో ఆడుకుంటుంటే సరిపోతుందా? వెళ్లి తనని కూడా తీసుకొచ్చి సంతోషపెడితేనే కదా తను దారికి వస్తుందని అంటుంది రుద్రాణి. దాంతో ఇప్పుడే వెళ్లి తీసుకొస్తానని చెబుతాడు రాజ్.
నువ్వు కూడా క్రాకర్స్ కాల్చమని రుద్రాణిని పిలుస్తాడు కళ్యాణ్. నాకు క్రాకర్స్ కాల్చడం అంతగా నచ్చదని వెళ్లిపోతుండగా.. కొంపలు కాల్చే దాంటో వచ్చే ఆనందం వీటితో రాదని ఇందిర సెటైర్లు వేస్తుంది. క్రాకర్స్ కాలుస్తుండగా బాగా స్మోక్ రావడంతో అప్పూకి ఇబ్బందిగా ఉంటుంది. క్రాకర్స్‌కి స్మోక్ రాకపోతే ఆక్సిజన్ వస్తుందా? అని కళ్యాణ్ సెటైర్లు వేస్తాడు. ఇంతలో రాజ్ కిచెన్‌లోకి వెళ్లి పండగ మొత్తం బయట చేసుకుంటుంటే మేడం గారు బయట ఏం చేస్తున్నారని కావ్యని అడుగుతాడు. పని ప్రతిరోజూ తప్పదు, పండగ సంవత్సరానికి ఒకసారే వస్తుందని అంటాడు రాజ్. పండగపూట అందరూ సంతోషంగా ఉండాలంటే కొందరు ఆడవాళ్లు ఇలా పనిచేయాల్సిందేనని అంటుంది కావ్య. వాళ్లు వండిన ఫుడ్ తింటుంటే అందరూ సంతోషిస్తారని, అదే వాళ్లకి పండగతో సమానమని అంటుంది కావ్య.
పండుగ అంటే వండుకుని తినడమే కాదు.. మాతో పాటు బయటికి వచ్చి క్రాకర్స్ కాలిస్తే వచ్చి సంతోషిస్తామని అంటాడు రాజ్. నా మేనల్లుడు నీ కోసం వెయిట్ చేస్తున్నాడని చెబుతాడు. వాడికి కావాలంటే వాడే వచ్చి పిలుస్తాడు మరి మీరెందుకు వచ్చారని అడుగుతుంది కావ్య. ముందు నేనే రావాలని అనుకున్నా.. మీరు వచ్చి గొడవ పడ్డారు కాబట్టి ఖచ్చితంగా రానని అంటుంది కావ్య. ఈరోజు నన్ను ఒప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్తానని ఛాలెంజ్ చేశారు కదా? మీరేం ప్లాన్ చేశారో ఏంటో? అని రాజ్‌ని నిలదీస్తుంది కావ్య. మరోవైపు.. క్రాకర్స్ కారణంగా అప్పూ ఇబ్బంది పడుతుండగా.. కావ్య- రాజ్ రాకపోవడంతో రుద్రాణి- రాహుల్‌లు టెన్షన్ పడతారు. మర్యాదగా ఏం ప్లాన్ చేశారో చెప్పండి అని రాజ్‌ని నిలదీస్తుంది కావ్య. నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావ్? అన్ని ప్లాన్స్ చేయలేదని అంటాడు రాజ్.
మీరు ఇంత పట్టుబడుతున్నారు కాబట్టి నేను నిజంగానేప మీ ఇంటికి వచ్చేస్తానని కావ్య చెప్పడంతో రాజ్ సంతోషిస్తాడు. నేను రావాలంటే ఒక కండీషన్ అని అంటుంది కావ్య. అంత సులువుగా నువ్వెందుకు ఒప్పుకుంటావని అనుకున్నానని.. మీరు బిడ్డను ఎందుకు వద్దు అనుకుంటున్నారో కారణం చెబితే మీతో పాటే వచ్చేస్తానని చెబుతుంది కావ్య. మీరు చెప్పినట్లుగా వింటాను, అలా జరగాలంటే నాకు కారణం తెలియాలి కదా అని అంటుంది. అలా చెప్పేవాడినే అయితే ఎప్పుడో చెప్పేవాడినని అంటాడు రాజ్. క్రాకర్స్ దెబ్బకి అప్పూ కళ్లు తిరిగి పడిపోతుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టెన్షన్ పడతారు. వంటింట్లో నుంచి రాజ్, కావ్యలు పరిగెత్తుకొస్తారు. వెంటనే డాక్టర్ వచ్చి అప్పూని పరీక్షిస్తుంది.
టెన్షన్ పడుతున్న కళ్యాణ్‌ని రాజ్ ఓదారుస్తాడు. ఆ క్రాకర్స్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఉండాల్సిందని, చెప్పినా వినిపించుకోలేదని అంటాడు కళ్యాణ్. అప్పూని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావని కళ్యాణ్‌పై మండిపడుతుంది రుద్రాణి. మనం ఒకటి అనుకుంటే మరొకటి జరిగిందని రుద్రాణితో అంటాడు రాహుల్. మనం చేసిన పనివల్ల ఇప్పుడు అప్పూ కడుపు పోతుందని, దానికి కారణం రాజ్ తీసుకొచ్చిన క్రాకర్స్ వల్లేనని నిరూపిస్తే కావ్య, రాజ్ విడిపోతారని అంటుంది రుద్రాణి. డాక్టర్ వచ్చి అప్పూ కడుపులో బిడ్డ చనిపోయింది అంటే చాలు.. దుగ్గిరాల ఫ్యామిలీని తగలబెట్టేస్తానని అంటుంది రుద్రాణి. ఇంతలో డాక్టర్ వచ్చి అప్పూకి కొద్దిలో ప్రమాదం తప్పిపోయిందని చెబుతుంది.
మీరు వాడిన క్రాకర్స్‌లో ఎన్ని టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయో తెలుసా? ఆ స్మోక్ పిల్చడం వల్లే తనకి ఇలా జరిగిందని... చివరికి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైందని అంటుంది డాక్టర్. తల్లికి ఆక్సిజన్ అందకపోతే బిడ్డ పరిస్ధితి ఏంటీ? ఇంకొంచెం సేపు ఆ స్మోక్ పిల్చి ఉంటే కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలతోనే ఉండేది కాదని డాక్టర్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. మంచి క్రాకర్స్ తీసుకొస్తే బాగుండేదని డాక్టర్ చెప్పడంతో... రుద్రాణి వచ్చి క్రాకర్స్ తీసుకొచ్చింది నువ్వే కదా? అలాంటి డేంజరస్ క్రాకర్స్ ఎందుకు తీసుకొచ్చావని రాజ్‌ని నిలదీస్తుంది. ఆ మాటలతో అందరూ షాక్ అవుతారు. అదృష్టం కొద్ది కావ్య అక్కడికి రాలేదు కాబట్టి సరిపోయిందని, లేదంటే అప్పూతో కలిసి కావ్య కూడా అదే స్థానంలో ఉండేదని అంటుంది రుద్రాణి. ఒకవేళ డాక్టర్ చెప్పినట్టు బిడ్డకు ఏమైనా జరిగితే ఏంటీ పరిస్ధితి అని మండిపడుతుంది.
ఆ మాటలతో రగిలిపోయిన ధాన్యలక్ష్మీ.. నువ్వు కావాలనే ఇదంతా చేశావని అంటుంది. నీ భార్య కడుపులోని బిడ్డను తనకు దూరం చేయాలనే ఇదంతా చేశావని ఆరోపిస్తుంది. నువ్వు ఈపని కావాలనే చేశావని ఇక్కడున్న అందరికీ అర్ధమైపోయిందని అపర్ణ కూడా మండిపడుతుంది. రోజురోజుకు ఎందుకు ఇలా దిగజారిపోతున్నావ్ అని నిలదీస్తుంది. నా బిడ్డను నాకు కాకుండా చేసి అత్తారింటికి తీసుకెళ్దామని అనుకుంటున్నారా? ఇదేనా మీ ప్లాన్ అని నిలదీస్తుంది కావ్య. నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అని రాజ్ బాదపడతాడు. మనింట్లో నేను ఉన్నంత కాలం మీరు ఇలాగే చేశారని .. దొంగచాటుగా అబార్షన్ చేయించాలని అనుకున్నారు, నేను ఒప్పుకోలేదని జ్యూస్‌లో టాబ్లెట్స్ కలిపారని గుర్తుచేస్తుంది కావ్య.
ఇక్కడ నిరాహార దీక్షలని నాటకాలు ఆడి ఇలా ప్లాన్ చేశారు, ఇందాక కిచెన్‌లో నుంచి కూడా నన్ను బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నించారని నానామాటలు అంటుంది కావ్య. అడవిలో మృగం కూడా కళ్ల ముందు కనిపిస్తేనే వేటాడుతుందని, మీరు అంతకంటే దారుణంగా తయారయ్యారని చెబుతుంది. అసలు నేను, నా బిడ్డ చేసిన అన్యాయం ఏంటీ? నా బిడ్డను ఎందుకు చంపాలని అనుకుంటున్నారని నిలదీస్తుంది కావ్య. ఇదంతా మీరెందుకు చేస్తున్నారు.. ఈరోజు మీరు నిజం చెప్పేవరకు వదిలిపెట్టనని రాజ్ షర్ట్ పట్టుకుంటుంది. అలా చేయకపోతే నువ్వు చచ్చిపోతావు కాబట్టి అని నిజం చెప్పేస్తాడు రాజ్. ఆ మాటలతో కావ్యతో పాటు అందరూ షాక్ అవుతారు. మళ్లీ ఇదొక కొత్త డ్రామానా? నేను చచ్చిపోతాను అనే మాట మీ నోటి నుంచి ఎలా వచ్చిందని బాధపడుతుంది కావ్య. ఇంతలో అప్పూ వచ్చి బావ చెప్పేది అబద్ధం కాదని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నువ్వు బిడ్డను కంటే చచ్చిపోతావని అప్పూ చెబుతుంది. నేను, అప్పూ మొదటిసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్లినప్పుడే నాకు నిజం తెలిసిందని అంటాడు కళ్యాణ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











