Brahmamudi October 31st Episode: ప్రియురాలి ఇంట్లో దిగిన రాహుల్.. బామ్మ తాతయ్యగా మారిన రాజ్ - కావ్య
Photo Courtesy: JioHotstar
రాహుల్ మారిపోయినట్లు నటించి మనందరినీ మోసం చేశాడనీ... ఎవరినో తగులుకుని మా అక్కకి అన్యాయం చేయాలని చూస్తున్నాడని రాజ్‌తో చెబుతుంది. దాంతో రాహుల్‌తో నేను మాట్లాడతానని అంటాడు రాజ్. తన జీవితం గురించి స్వప్న ఆలోచిస్తూ ఉండగా రాహుల్ వచ్చి విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టమని బలవంతం చేస్తాడు. దాంతో స్వప్న పరిగెత్తుకుంటూ వచ్చి రాహుల్ విడాకుల విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబుతుంది. స్వప్న మాటలు విన్న దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాహుల్ మీద మండిపడతారు.
రాహుల్‌తో నేను మాట్లాడతానని రుద్రాణి వెళ్తుంది. స్వప్నతో ఉంటే మనకేం రాదని, నీ ప్లాన్స్ కూడా వర్కవుట్ కావడం లేదని అందుకే నేను బాగా డబ్బున్న అమ్మాయిని పట్టానని చెబుతాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే నిన్ను అంగరంగ వైభవంగా నాతో పాటు తీసుకెళ్తానని అంటాడు. రాహుల్ మాటలు తేడాగా ఉండటంతో రుద్రాణి టెన్షన్ పడుతుంది. రాహుల్‌ని ట్రాప్ చేసిన అమ్మాయి ఎవరు? ఆమె పుట్టు పూర్వోత్తరాలు ఏంటో తెలుసుకోవాలని రాజ్‌తో చెబుతుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 31వ తేదీ ఎపిసోడ్ 866లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఈరోజు రాహుల్.. స్వప్నతో విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టిస్తానని చెప్పాడని, అదే గనుక జరిగితే మనం అనుకున్న దానిలో 90 శాతం గెలిచినట్లేనని భర్తతో అంటుంది కోయిలీ. వాడు విడాకులు ఇచ్చినంత మాత్రాన సరిపోదు, నిన్ను పెళ్లి చేసుకోవాలి.. నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టాలి, వాడి ఆస్తి మొత్తం మన సొంతం అవ్వాలని అంటాడు భర్త. స్వప్నని వదిలించుకోవడమే పెద్ద పని అని, ఆ తర్వాత అన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయని అంటుంది. ఇంతలో రాహుల్ బ్యాగ్ తీసుకుని ఇంటికి రావడంతో కోయిలీ, ఆమె భర్త షాక్ అవుతారు. నీకోసం నా భార్యని, ఆ ఇంటిలోని వాళ్లని వదిలేసి వచ్చానని రాహుల్ చెప్పడంతో కుయిలీ ఉలిక్కిపడుతుంది.
స్వప్నతో కలిసి కాపురం చేయలేను, తనంటే నాకు ఇష్టం లేదని అందరి ముందు కరాకండీగా చెప్పేశాను.. ఆ ఇంట్లో నన్ను కానీ, నా మనసును కానీ ఎవరూ అర్ధం చేసుకోవడం లేదని అందుకే తెగదెంపులు చేసుకుని వచ్చేశానని అంటాడు రాహుల్. వీడెంటీ ఇలా చేశాడు.. ఆ ఇంట్లో ఉంటేనే కదా కోట్ల ఆస్తి నా సొంతం అయ్యేది, అవన్నీ లేకపోతే ఈ అడుక్కుతినేవాడు నాకెందుకు అని కోయిలీ అనుకుంటుంది. మన ప్రేమను వాళ్లెవరూ అర్ధం చేసుకోలేరని, అందుకే నీ కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదని నిరూపించడానికి వాళ్లందరినీ వదిలేశానని చెబుతాడు రాహుల్. స్వప్నకి విడాకులిచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నావంటే పెద్దవాళ్లు ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారని, దానికే బంధాల్ని తెంచుకుంటావా అని అడుగుతుంది కోయిలీ. నాకు కోట్ల ఆస్తి ఉన్నా.. అమ్మానాన్న లేరని, నాకున్నది మా మావయ్య మాత్రమే. నిన్ను పెళ్లి చేసుకున్నాకా, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అవుతుందని ఎంతో ఆశపడ్డానని అంటుంది.
ఇది ఇలా మాట్లాడుతుందేంటీ? ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటీ? అని రాహుల్ అనుకుంటాడు. నిన్ను ప్రేమించి కూడా నీ ఫ్యామిలీని చూసే అని అంటుంది కోయిలీ. ఫ్యామిలీతో కలిసుంటే చూడటానికి బాగుంటుంది కానీ, ఎవ్వరూ మన మనసుల్ని అర్ధం చేసుకోరని చెబుతాడు రాహుల్. దాంతో కుయిలీ భర్త .. మనం రాహుల్‌కి సపోర్ట్ చేయాలని అంటాడు. తన వల్ల నువ్వు నీ ఫ్యామిలీకి దూరమయ్యావని తెలిసేసరికి కొంచెం కంగారు పడిందని అంటాడు. వాడు తిరిగి ఇంటికి వెళ్లేలా నువ్వే వాడిని మానిప్యులేట్ చేయాలని కోయిలీకి చెబుతాడు.
రాహుల్ ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతూ, ఏం చేయాలా? అని ఆలోచిస్తుంది. అసలు రాహుల్ లైఫ్‌లోకి వచ్చిందెవరు? అతను ఎందుకిలా దిగజారిపోయాడు? అని అప్పూని కనుక్కోమన్నాను అని చెబుతుంది కావ్య. ఇంతలో అప్పూ, కళ్యాణ్‌లు వచ్చి దాని పేరు కోయిలీ అని అంటుంది. చాలారోజుల నుంచి వాళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, నీతో పెళ్లయ్యిందని, నీకో పాప ఉందని తెలిసే రాహుల్‌ని ట్రాప్ చేసిందని చెబుతుంది అప్పూ. తన వాలకం చూస్తుంటే బాగా రిచ్ లాగే ఉందని, కానీ రాహుల్‌నే ఎందుకు ట్రాప్ చేసిందో అర్ధం కావడం లేదని అంటుంది. దానిని చీపురు కట్ట తిరగేసి పీకితే అన్ని నిజాలు అదే చెబుతుందని అంటుంది స్వప్న.
ఆమె ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ? అంత రిచ్ పర్సన్ అయితే రాహుల్‌ని ఎందుకు ట్రాప్ చేసింది? అనేది మనం కనుక్కోవాలని అంటుంది కావ్య. ఆ విషయం పూర్తిగా తెలుసుకోవాలంటే మనమే వాళ్ల దగ్గరికి వెళ్లాలని చెబుతుంది. నాటకం అంటే నాకు ప్రాణం లేచి వస్తోంది.. పరిషత్‌లలో నటనని నమిలి మింగేశా, అవసరమైతే నా కోసం కూడా ఓ క్యారెక్టర్ క్రియేట్ చేయమని అంటాడు ప్రకాశం. మీకు చీపురు కట్ట నేను తిరగేస్తానని ధాన్యలక్ష్మీ వార్నింగ్ ఇస్తుంది. అక్కడికి ఎలా వెళ్లాలో? ఏం చేయాలో అన్నీ నాకు బాగా తెలుసు అని చెబుతుంది కావ్య. నీకు అందరి జీవితాలు కావాలి కానీ నా జీవితం గురించి పట్టించుకోవా? అని మండిపడతాడు రాజ్. ఇది కూడా నీ ఎగ్జిట్ ప్లాన్‌లో భాగమేనా? అని అడుగుతాడు ... నేను వెళ్లేలోపు మా అక్క కూడా సంతోషంగా ఉండాలి కదా అని అంటుంది కావ్య.
నువ్వు ఆవేశంలో వచ్చేశావు.. నీతో మాట్లాడానికి ఎవరో ఒకరు వస్తారని రాహుల్‌తో అంటుంది కోయిలీ. ఇంతలో రాజ్- కావ్యలు ముసలివాళ్ల వేషంలో అక్కడికి వస్తారు. ఎవరు మీరు అని రాహుల్ అడుగుతాడు. నువ్వు అదే మాట అంటావని అనుకున్నామని కావ్య అంటుంది. నీ మనవడు ఎంత మాట అనేశాడని అంటుంది. దాంతో వచ్చింది రాజ్ - కావ్యేనని గ్రహించిన రాహుల్ అలర్ట్ అవుతాడు. వీడు ఇల్లు, ఇల్లాలిని వదిలేసి వచ్చేశాడు.. మేం ఒంటరి వాళ్లం అయిపోయామని చెబుతుంది కావ్య. కోట్ల ఆస్తిని ఎలా కాపాడుకోవాలి? అని అనడంతో కోయిలీ టెంప్ట్ అవుతుంది. నచ్చిన దాని దగ్గరికి వచ్చాడు, మేం కూడా వాడి దగ్గరకే వచ్చి మా ఆస్తి మొత్తం నీకు నచ్చిన గాడిద చేతుల్లో పెడదామని అనుకున్నానని అది ఎవరో తెలియడం లేదని అంటుంది కావ్య. ఇంతలో ఆ గాడిదను నేనే అంటుంది కోయిలీ.
ఈ అమ్మాయి మనవాడికి ఈడూ జోడు బాగుందని రాజ్ - కావ్య అంటారు. చేసిన రచ్చ చాలు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండని అంటాడు రాహుల్. మేం వెళ్లిపోవాలా? నీ మీ పెట్టుకున్న ఆశలు, ప్రేమ అన్నింటిని వదిలేసి పోవాలా అని అడుగుతారు. నీతోనే ఉండి, మీ ఇద్దరినీ ఒక్కటి చేసి నాలుగు రోజులు మిమ్మల్ని మనసారా చూసుకుని మా ఆస్తి మొత్తం అప్పజెప్పి కృష్ణా, రామా అంటూ ఏ కాశీకో, రామేశ్వరానికో వెళ్లిపోదామని చూస్తే మమ్మల్ని వెళ్లిపోమంటావా అని అడుగుతుంది కావ్య. మీరు వెంటనే వెళ్లిపోవాల్సిందేనని అంటాడు రాహుల్. ఇంతలో కోయిలీ జోక్యం చేసుకుని వాళ్లకు నువ్వు తప్పించి ఎవరు లేరని అంటుంది కోయిలీ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











