Brahmamudi September 12th Episode: రుద్రాణి ప్లాన్ తిప్పికొట్టిన స్వరాజ్.. రేవతిని కాపాడిన బుడ్డోడు
Photo Courtesy: JioHotstar
కావ్య ఫోన్‌లో పిల్లల వీడియోలు చూస్తూ నవ్వుకుంటుంది. ఇది చూసిన ఇందిర సంతోషిస్తుంది. ఇంతలో కావ్య ఫోన్ రింగ్ కావడంతో అప్పూ లిఫ్ట్ చేయగా అటు పక్క డాక్టర్ మాట్లాడుతుంది. మీ అక్క ఈ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయకూడదని ఖచ్చితంగా అబార్షన్ చేయాల్సిందేనని చెప్పడంతో అప్పూ షాక్ అవుతుంది. జగదీష్‌తో రేవతి ఫోన్‌లో మాట్లాడుతుండగా రుద్రాణి చూస్తుంది. నిన్ను ఎలాగైనా ఇంట్లో వాళ్ల ముందు బుక్ చేయాలని అనుకుంటుంది. వెంటనే కావ్య రూమ్‌లోకి వెళ్లి అపర్ణ ఇచ్చిన నెక్లెస్‌ని రేవతి హ్యాండ్ బ్యాగ్‌లో వేస్తుంది.
ఇంతలో ఆ గదిలోకి రేవతి, కనకం, స్వరాజ్ వస్తారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని కనకం ప్రశ్నిస్తుంది. ఈ ఆంటీ నా చాక్లెట్లు దొంగతనం చేయడానికే వచ్చారని స్వరాజ్ అనడంతో రుద్రాణి మండిపడుతుంది. పిల్లల్ని ఇలాగేనా పెంచేది, పెద్దవాళ్లకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నేర్పించాలని క్లాస్ తీసుకుంటుంది. భోజనాల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ రెడీ అవుతుండగా కావ్య మెడలో నెక్లెస్ కనిపించకపోవడంతో ఏమైందని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 12వ తేదీ ఎపిసోడ్ 824లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
అత్తగారు ఇచ్చిన నెక్లెస్ కనిపించకపోవడంతో కావ్య షాక్ అవుతుంది. ఇళ్లంతా వెతికినా అది ఎక్కడా కనిపించదు. నెక్లెస్ బాక్స్‌తో సహా రావడంతో నెక్లెస్ ఏది అని ఆమెను అందరూ అడుగుతారు. నెక్లెస్ కనిపించడం లేదని కావ్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు. దాంతో 10 లక్షల రూపాయల నెక్లెస్ పోయిందా? అని రుద్రాణి నటిస్తుంది. ఈ ఇంట్లో తీసేవాళ్లు ఎవరూ లేరని నువ్వే ఎక్కడో పెట్టి మరిచిపోయి ఉంటావని ఇందిర అంటుంది. ఇంట్లో వాళ్లకి ఆ నెక్లెస్ దొంగిలించే అవసరం లేదని, మన పనిమనిషి రత్తాల్ని నిలదీయాల్సిందేనని చెబుతుంది రుద్రాణి. పనిమనిషిని పిలిచి మా నెక్లెస్ ఏమైనా తీశావా? అని నిలదీస్తుంది.
రుద్రాణి మాటలతో మండిపడ్డ రత్తాలు.. నన్ను అనుమానిస్తే బాగోదని వార్నింగ్ ఇస్తుంది. ధాన్యలక్ష్మీ అమ్మగారు ఎన్నోసార్లు నగలు పడేసుకుంటే నేనే తీసుకొచ్చి ఇచ్చానని అంటుంది. నీ మీద మాకు ఎలాంటి అనుమానం లేదని ఊరికే పిలిచామని చెబుతుంది రుద్రాణి. ఇంట్లో ఉన్నవాళ్లంతా మనవాళ్లే కాబట్టి ఈ నెక్లెస్ ఎవరు తీస్తారని రాజ్ అడుగుతాడు. ఇంట్లో మనుషులు తీసే అవకాశం లేనప్పుడు ఇంటికొచ్చిన కొత్త వాళ్లే తీస్తారని రేవతిని ఉద్దేశించి అంటుంది రుద్రాణి. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు.
ఇంటికి కొత్తగా వచ్చింది? ఈ రాధే కదా? తనే తీసిందేమోనని రుద్రాణి చెప్పడంతో ఇందిర ఫైర్ అవుతుంది. తను ఎలాంటి మనిషో నువ్వు ఎలా చెప్పగలవని ప్రశ్నిస్తుంది రుద్రాణి. తను వచ్చింది ఈరోజేనని, అంత కాస్ట్‌లీ నెక్లెస్ చూడగానే కాస్త కక్కుర్తి పడిందని నానా మాటలు అంటుంది. నేను కావ్య రూమ్‌లోకే వెళ్లలేదని రేవతి చెబుతుంది. ఇంతలో రాజ్ వచ్చి తను అక్కతో సమానమని, తన గురించి అలా మాట్లాడితే నాకు నచ్చదని మండిపడతాడు. అక్క లాంటిదే కానీ అక్క కాదని, నాలుగు మంచి మాటలు మాట్లాడితే కరిగిపోయే మంచి మనసు నీది.. అందరినీ అలా నమ్మొద్దని అంటుంది రుద్రాణి.
మరి మిమ్మల్ని మీ కొడుకుని నమ్మాలా? అని స్వప్న ప్రశ్నిస్తుంది. మమ్మల్ని నమ్మినా, నమ్మకపోయినా ఆమెను మాత్రం నమ్మొద్దని తనే దొంగతనం చేసిందని చెబుతుంది రుద్రాణి. నాకు తెలిసి ఆ నెక్లెస్ కూడా తన బ్యాగ్‌లో పెట్టుకుని ఉంటుందని, నీ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయాలని అంటుంది. ఇంటికొచ్చిన మనిషిని అవమానించొద్దని, ఆ నెక్లెస్ పోతే పోయిందని దీనిని ఇంతటితో వదిలేయాలని రాజ్ చెబుతాడు. అలా వదిలేసే ప్రసక్తే లేదని, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని అంటుంది రుద్రాణి.
ఆ మాటలతో బాధపడ్డ రేవతి... నేను ఏ తప్పూ చేయనప్పుడు భయపడనని నా బ్యాగ్ చెక్ చేసుకోండి అంటుంది. దాంతో రుద్రాణి వెళ్లి బ్యాగ్ చెక్ చేస్తుంది. అందులో ఏ నెక్లెస్ లేకపోవడంతో తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు రుద్రాణి నిరుత్సాహ పడుతుంది. తనే నెక్లెస్ తీసిందని నానా మాటలు అన్నావు కదా.. మరి అదెక్కడ అని ఇందిర ప్రశ్నిస్తుంది. ఇంతలో స్వరాజ్ వచ్చి ఆ నెక్లెస్ ఎక్కడుందో నాకు తెలుసు అంటాడు. ఆ నెక్లెస్ ఎక్కడుందో చూపిస్తానని అపర్ణని తీసుకెళ్తాడు. అది రుద్రాణి గదిలో దొరకడంతో అపర్ణ రగిలిపోతుంది.
ఆ నెక్లెస్ నీ గదిలోనే దొరికిందని అపర్ణ చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఈ ఇంట్లో ఉంటూ, ఈ ఇంటి నగలు దొంగిలించాలని నేనెందుకు అనుకున్నానని అంటుంది రుద్రాణి. గతంలో మీ అబ్బాయి కూడా ఆ నగల్ని ఇలాగే కొట్టేయాలని చూశాడని, ఆ బుద్ధులన్నీ ఎక్కడికి పోతాయని సెటైర్లు వేస్తుంది స్వప్న. చేసిందంతా చేసి ఇంటికి అతిథిగా వచ్చిన మంచి మనిషిని అవమానిస్తావా? అని ఇందిర మండిపడుతుంది. ఆ నెక్లెస్ నేను దొంగతనం చేయలేదని రుద్రాణి చెప్పగా.. మరి అది మీ గదిలోకి ఎగురుకుంటూ వెళ్లిందా అని కావ్య ప్రశ్నిస్తుంది.
మన రుద్రాణి గురించి మనకి తెలిసిందే కదా? పండుగ పూట అందరి ఆనందం పాడు చేసుకోవడం ఎందుకు అంటాడు సీతారామయ్య. అసలే కావ్య చేతి వంట తిని చాలాకాలం అయ్యిందని, బాగా ఆకలి వేస్తోందని అందరూ రుద్రాణిని నానామాటలు అని వెళ్లిపోతారు. రేవతికి రాజ్ సారీ చెప్పి భోజనానికి తీసుకెళ్తాడు. రుద్రాణి కూడా వెళ్లిపోతుండగా స్వరాజ్ పిలిచి ఆ బ్యాగ్ ఎవరు తీస్తారని ప్రశ్నిస్తాడు. ఆ మాటలతో రుద్రాణి రగిలిపోతుంది. ఆ నెక్లెస్ నా గదిలోకి ఎలా వచ్చింది? అని రుద్రాణి ఆలోచిస్తుంటుంది. ఇంతలో స్వరాజ్, కనకం అక్కడికి వస్తారు.
మేం నీకు హెల్ప్ చేస్తామని చెబుతాడు స్వరాజ్. ఆ నెక్లెస్ మీ గదిలోకి ఎలా వచ్చిందా? అని ఆలోచిస్తున్నారా? అని అడుగుతాడు. దాని కోసం అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదని నా నెక్లెస్‌ని మీ గదిలోకి కాకి తీసుకొచ్చిందని చెబుతాడు. మీకు కాకి గొలుసు తెలుసా అని ఓ కథ చెబుతాడు స్వరాజ్. ఎదుటివారికి అన్యాయం చేయాలని చూస్తే.. ముందు మనమే అన్యాయమైపోతామని అంటాడు. ఈ కథలో పాము మీరైతే, ఆ కాకి నేనే అని చెబుతాడు. నువ్వు మా అమ్మని దొంగని చేయాలని ఆ నెక్లెస్ కొట్టేసి మా అమ్మ బ్యాగ్‌లో పెట్టావ్.. అది నేను చూసేసి అందులో నుంచి తీసేసి నీ గదిలో పెట్టేశానని అంటాడు.
నేను నిన్ను అందరి ముందు ఇరికించేశా.. నువ్వు తీసుకున్న గొతిలో నువ్వే పడ్డావ్, ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మా అమ్మకి ఈ స్వరాజ్ ఉన్నాడని గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలతో రుద్రాణి షాక్ అవుతుంది. భోజనాల దగ్గర అందరికీ వడ్డిస్తారు రుద్రాణి, రాహుల్. దాంతో అంతా షాక్ అవుతారు. నువ్వు కూడా వెళ్లి కూర్చో అని కావ్యని చెబుతాడు. మరి నేను ఎక్కడ కూర్చోను అని స్వరాజ్ అడగ్గా.. నా నెత్తి మీద కూర్చో అంటుంది రుద్రాణి. ఏదో ఒక రోజు కూర్చొంటానని స్వరాజ్ సెటైర్లు వేస్తాడు. నువ్వు నా దగ్గర కూర్చో అని అపర్ణ పిలిచి వాడికి అన్నం తినిపిస్తుంది. అది చూసి రాధ తట్టుకోలేక కంటతడి పెడుతూ వెళ్లిపోతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. నాకేం సంబంధం లేదని రుద్రాణి అనగా.. గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకోవద్దని అంటుంది ఇందిర. దాంతో కావ్య- రాజ్‌లు రేవతిని తీసుకురావడానికి వెళ్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











