Brahmamudi September 15th Episode: రుద్రాణి ప్లాన్ అట్టర్ ఫ్లాప్.. తాను తీసుకొన్న గోతిలో తానే పడి..

Photo Courtesy: JioHotstar

భోజనాల దగ్గర స్వరాజ్‌ను అపర్ణ తన ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపిస్తుంది. తన పుట్టింటి వాళ్లంతా తన కొడుకుని గారాభంగా చూసుకుంటూ ఉండటంతో రేవతి భోజనం మధ్యలో నుంచే లేచి వెళ్లిపోతుంది. దాంతో అందరూ షాక్ అవ్వగా.. రాజ్, కావ్యలు ఆమెను ఓదార్చి తిరిగి ఇంట్లోకి తీసుకొస్తారు. రేవతి ముసుగు ఎలాగైనా తీయాలనుకున్న రుద్రాణి.. ఆమె ముఖంపై నీళ్లతో కొడుతుంది. ముసుగు తడిచిపోయిందని తీసేసి తినమని బలవంతంగా లాగాలని చూస్తుంది రుద్రాణి. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆమెకు చీవాట్లు పెడతాడు. ఎవరి ఆచారాలు, పద్ధతులు వాళ్లవని ఇబ్బంది పెట్టొద్దని అపర్ణ మండిపడుతుంది.

భోజనాలు ముగిశాక రుద్రాణి మరో ప్లాన్ వేసి అందరితో డ్యాన్స్‌లు చేయించి ఈ సమయంలోనే రేవతి ముసుగు తీయాలని అనుకుంటుంది. చిట్టీలు వేసి ఎవరికి ఏం వస్తే అది చేయాలని చెబుతుంది. ముందు సీతారామయ్యకు చిట్టీ రావడంతో ఆయన భారీ డైలాగ్‌తో అందరినీ ఆకట్టుకుంటాడు. ఆ తర్వాత స్వప్న, రాహుల్‌లు ఓ పాటకు డ్యాన్స్ చేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 15వ తేదీ ఎపిసోడ్ 826లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial September 15th 2025 Episode 826 Here is Today s full story

రుద్రాణి చిట్టీలు తీస్తూ ఇంట్లో అందరితో డ్యాన్సులు చేయిస్తూ.. తన కొడుకు, కోడలు చేస్తుంటూ విసుక్కొన్నది. ఇక చాలూ అన్నట్టు ఫేస్ పెట్టి వాళ్లను బలవంతంగా పక్కకు నెట్టింది. అయితే మనం బాగా చేశాం కదా అని రుద్రాణి కొడుకు అంటే.. ఆయన భార్య అసంతృప్తితో తలాడించింది. ఆ తర్వా అన్నా, వదినలతో చేయించిన తర్వాత.. అపర్ణను ఎంపిక చేసి.. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయాలని చిట్టిలో ఉందని తెలిపింది. దాంతో కూతురు రేవతిపై తన ప్రేమను వ్యక్తం చేస్తుంటే.. ఆమె ఎమోషనల్ అయింది. ఆ తర్వాత తన అల్లుడు కవి, ఆయన భార్యతో కలిసి డ్యాన్స్ చేయించింది.

ఆ తర్వాత రాజ్‌ను ఎంపిక చేసి తన మొదటి ప్రేమను తెలియజేయాలి అంటూ టాస్క్ ఇచ్చింది. దాంతో నిజాయితీగా నీ మొదటి ప్రేమను చెప్పండి. నా కంటే ముందుగా పెళ్లి చేసుకోవాలనుకొన్నది మా అక్కను. కాబట్టి ఆ విషయం చెప్పండి అని కావ్య అంటే.. అలాగే ఆమెపై ప్రేమ గురించే చెబుతాను అని రాజ్ అన్నాడు. నిజాయితీగా నా ప్రేమను చెప్పాలని అంటున్నారు. దాని కంటే ముందు ప్రేమ గొప్పదా? పెళ్లి గొప్పదా? అనే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎవరూ ఏమీ మాట్లాడకపోవడంతో.. పెద్దలు చేసిన పెళ్లే గొప్పది అని అంటే.. ప్రేమ లేకపోతే పెళ్లే వేస్ట్ అంటారు. వీటిలో ఏది నిజమనే ప్రశ్నకు వెళ్లడం లేదు. వాటి జోలికి వెళ్లను. కానీ నేను నిజాయితీగా పెళ్లి గురించి చెబుతాను అంటూ రాజ్ అన్నాడు.

పెళ్లి అనేది రెండు అక్షరాలతో మొదలై.. మూడు మూళ్ళతో బంధం వేసి.. నలుగురు చేత అక్షింతలు వేసి.. పంచభూతాల సాక్షిగా నేనే ఆరో ప్రాణం అంటూ వారితో ఏడడుగులు వేయించి.. నాతో ఇష్టం లేని వ్యక్తితో ఏడడుగులు వేయించి జీవితాతం నీతోనే ఉంటాను అంటూ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇష్టం లేని వ్యక్తితో కాపురం చేయాలని దూరంగా వెళ్తే.. నేను ఎంత దూరం వెళ్తే అంత దూరం వెతుక్కొంటూ వచ్చింది. ఆమె నా కళావతి. ఇష్టం లేని పెళ్లి అని నేను అనుకొంటే.. తను మాత్రం దేవుడు చేసిన పెళ్లి అనుకొంది. మూడు మూళ్ల వేసినందుకే జన్మజన్మల ప్రేమను పంచింది. అలాంటి వ్యక్తికి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి. మళ్లీ జన్మ ఉంటే తిరిగి భర్తను కావాలనుకోవడమే తప్పా అని రాజ్ భావోద్వేగానికి గురయ్యాడు.

కళావతి.. పెళ్లితో నేను పెట్టిన బాధను.. నీవు పెట్టిన ఆ కన్నీళ్లను నేను మార్చలేను. కానీ భవిష్యత్‌లో నీకు కన్నీరంటే తెలియని ప్రపంచాన్ని ఇస్తాను. నీవు ఇచ్చిన ప్రేమను పదింతలు చేసి ఇస్తాను. ఇంత ప్రేమ దక్కింది కాబట్టి నేను పెళ్లే గొప్పది అంటాను. అందుకు కారణమైన నా కళావతి గొప్పది అంటాను అని రాజ్ అనగానే.. అందరూ చప్పట్లు కొట్టి ఆనందించారు.

తన మొదటి ప్రేమ గురించి చెబుతూ.. మన కంపెనీ వార్షికోత్సవంలో ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను. ఆ క్షణం నిజంగానే తెలియని అనుభూతి పొందాను. అదే ప్రేమ అనుకొన్నాను. కానీ నేను వెళ్లే సరికి ఆమె వెళ్లిపోయింది. ఆ తర్వాత అదే పాటకు స్వప్న డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దాంతో ఆ నీడలో కనిపించిన వ్యక్తి స్వప్న అని తెలిసింది. దాంతో స్వప్ప మాట్లాడుతూ.. అది నేను కాదు రాజ్.. అని అంటే.. వ్వాట్ అంటూ ఆశ్చర్యపోయాడు. ఆ డ్యాన్స్ వేసింది నేను కాదు.. నేను ఒకరి హెల్ప్ తీసుకొన్నాను. ఆమె ఎవరో కాదు.. మా కావ్యనే అని స్వప్ప చెప్పగానే.. కావ్య వైపు చూసి.. దగ్గరకు వెళ్లి.. నేను మొదటగా చూసి.. ఇష్టపడింది.. ఆ తర్వాత పెళ్లి చేసుకొన్నది నిన్నే అన్నమాట అంటూ కౌగిలిలోకి తీసుకొన్నాడు. దాంతో కావ్య అవునండి అనగానే ఇద్దరు ఆనందంలో మునిగిపోయారు. వారితోపాటు ఇంటి సభ్యులు కూడా సంతోషంలో మునిగిపోయారు.

రాజ్, కావ్యలను చూసి.. సీతారామయ్య మాట్లాడుతూ.. నీ ప్రేమ గొప్పది..మేము స్వప్నతో పెళ్లి చేయాలని అనుకొన్నా.. కావ్యతోనే పెళ్లి జరిగింది. ఇప్పడు అర్ధమైంది దాని వెనుక కారణం ఏమిటో అని అన్నారు. అప్పుడే దేవుడు బ్రహ్మముడి వేశాడు. కానీ నీకు ఆలస్యంగా తెలిసింది అని రాజ్ నాన్నమ్మ అంది. ఇప్పుడు రాజ్ తొలి ప్రేమ గురించి తెలిసిపోయింది. ఆ తర్వాత ముసుగులో ఉన్న రేవతిని చిట్టి తీయాలని పట్టుబట్టింది. దాంతో ఆమెతో బలవంతంగా చిట్టీ తీయించి.. సోలోగా డ్యాన్స్ చేయాలని చెప్పింది. దాంతో నాకు డ్యాన్స్ రాదని రేవతి చెబితే.. కావాలంటే.. నీతో కలిసి నేను డ్యాన్స్ చేస్తాను అని రుద్రాణి బలవంతంగా అందరి మధ్యలోకి లాక్కెల్లింది. దాంతో అందరూ టెన్షన్‌ ఉండిపోయారు.

రేవతితో కలిసి రుద్రాణి డ్యాన్స్ చేస్తూ.. ఆమె ముసుగు తొలగించే ప్రయత్నం చేసింది. అది చూస్తూ రాజ్, కావ్య టెన్షన్‌లో పడ్డారు. అలా డ్యాన్స్ చేస్తూ.. ఒక్కసారిగా రేవతి ముఖంపై నుంచి ముసుగు లాగేసింది. దాంతో అందరూ టెన్షన్‌లో పడిపోయారు. రుద్రాణి ఏమీ తెలియనట్టు ముఖంపై చేతులు పెట్టుకొని.. రేవతి నువ్వా? అంటూ ఆశ్చర్యపోయింది. నువ్వేంటి? ఇక్కడ ఉండటం ఉండటం ఏంటి? ఉదయం నుంచి ముసుగు వేసుకొని రాధ పేరు చెప్పి.. ఇక్కడ ఉంది నువ్వేనా? నీవంటే అమ్మకు ఇష్టం లేదని తెలుసు కదా? మీ అమ్మ మాట అంటే లెక్కలేదా? మా వదినను ఇంకా కష్టపెట్టాలని చూస్తున్నావా? అని ప్రశ్నలు వేసింది. దాంతో అత్తమ్మ.. నీవు మాట్లాడుతున్నది మా అక్క గురించి.. జాగ్రత్తగా మాట్లాడు అంటే.. గతంలో ఏం జరిగిందో నీకు తెలియదు. అప్పుడు నీకు గతం మరిచిపోయావు అని రుద్రాణి ఘాటుగా కామెంట్ చేసింది.

అయితే రేవతి ఎందుకు వచ్చింది? ఎవర్ని మోసం చేయాలని చూసింది అని రుద్రాణి అంటే.. ఎవ్వరిని మోసం చేయడానికి కాదు.. తనను తీసుకొచ్చింది నేను అంటూ రాజ్ గట్టిగా అరిచాడు. నువ్వు తీసుకొచ్చావా? అని రుద్రాణి అంటే.. మేము సహాయం చేశాం అని కావ్య, ఇతర కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? మా వదిన నా మాటే శాసనం అనుకొంటుంది. తనకే వెన్నుపోటు పొడవాలని అనుకొంటున్నారా? ఈ రేవతి చేసిన పనికి మా వదిన ఇంకా బాధపడుతున్నది. అలాంటి ఆమెకు మీరు సపోర్టు చేస్తారా? అని రుద్రాణి అంటే.. వెంటనే ఆపవే.. నీ నాటకాలు. అంటూ రాజ్ నానమ్మ గట్టిగా అరిచింది. రేవతి తన ప్రేమను ఇంట్లో వాళ్లకు చెప్పాల్సింది. కానీ చెప్పలేదు. కానీ అది తప్పే.. పెళ్లి వరకు తీసుకెళ్లింది ఎవరు? పెళ్లి చేసింది నువ్వు కాదా? తప్పుడు సలహాలు ఇచ్చి.. తను ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం నువ్వు కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

తదుపరి ఎపిసోడ్‌లో రేవతి వెళ్లి తన తల్లి అపర్ణ కాళ్లపై పడి నన్ను క్షమించమని వేడుకొన్నది. దాంతో అపర్ణ నేను కాదు.. మమ్మల్నే నువ్వు క్షమించాలి అంటూ కంటతడి పెట్టుకొన్నది. అయితే కావ్య గర్బ సంచికి సమస్య ఉందనే విషయాన్ని ఆమెకు చెప్పారా? అని డాక్టర్ అడిగితే.. నేను చెప్పలేను అంటూ అప్పు అంది. దాంతో నేను చెబుతాను అంటూ అప్పు భర్త సిద్దమయ్యాడు. ఇలా మరో ట్విస్టు కథలోకి తీసుకొచ్చారు. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Photo Courtesy: JioHotstar

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X