Brahmamudi September 18th Episode: వదిన కడుపు తీసేయాల్సిందే.. కళ్యాణ్ మాటలతో కుప్పకూలిన రాజ్
Photo Courtesy: JioHotstar
కావ్యకు అబార్షన్ చేయించాల్సిందేనని లేదంటే తల్లికి, బిడ్డకు ఇద్దరి ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్ చెప్పడంతో ఈ నిజాన్ని ఎలా చెప్పాలో తెలియక కళ్యాణ్, అప్పూలు కుమిలిపోతారు. ఇంతలో డాక్టర్ ఫోన్ చేసి కావ్య గారికి ఈ విషయం చెప్పారా లేదా? అని అడుగుతుంది. ఆలస్యం చేస్తే కావ్య ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్పడంతో అప్పూ మరింత బాధపడుతుంది. రేవతి ఇంటికి తిరిగి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషంగా గడుపుతుంది. రుద్రాణి మాత్రం బాధపడుతూ ఉండటంతో స్వరాజ్ ఆమెను ఆటపట్టిస్తాడు.
ఇంతలో అప్పూ వచ్చి కావ్యకి తన గర్బసంచి గురించి డాక్టర్ చెప్పిన విషయం చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. తన కడుపులోని బిడ్డను చంపేయాల్సి వస్తుండటంతో కావ్య స్పృహ తప్పి పడిపోతుంది. దాంతో ఉలిక్కిపడిన అప్పూ.. ఇదంతా కల అనుకుని వెంటనే అక్కని హగ్ చేసుకుని ఏడుస్తుంది. అన్నయ్య వదినలకి అబార్షన్ విషయం వెంటనే చెప్పాలని అప్పూతో కళ్యాణ్ అంటాడు. తనకు పుట్టబోయే బిడ్డతో పాటు కళ్యాణ్‌కు పుట్టబోయే బిడ్డకు కూడా రాజ్ బట్టలు తీసుకొస్తాడు. అది చూసి కళ్యాణ్ మరింత ఎమోషనల్ అవుతాడు. నీతో ఒక విషయం చెప్పాలని రాజ్‌ని గార్డెన్‌కు తీసుకెళ్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 18వ తేదీ ఎపిసోడ్ 829లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్‌తో ఒక విషయం చెప్పాలని కళ్యాణ్ బయటికి తీసుకెళ్తుండగా ఇక్కడే మాట్లాడమని కావ్య చెబుతుంది. అది ఇంట్లో మాట్లాడేది కాదని కళ్యాణ్ చెప్పడంతో, అన్నదమ్ములిద్దరూ కలిసి ఏ గూడుపుఠానీ చేయడం లేదు కదా అని అంటుంది కావ్య. మళ్లీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? మనింట్లో మంచి రోజులు అంతగా అచ్చి రావు కదా? అందుకే అడిగానని చెబుతుంది. ఆ మాటలతో కళ్యాణ్ బాధపడతాడు. రెండ్రోజులు అయితే మీరిద్దరూ నాన్నలు కాబోతున్నారు? ఇక మాతో ఏం డిస్కస్ చేస్తారని అంటుంది కావ్య.
నా తమ్ముడిని ఎత్తి పొడిచేస్తున్నావ్.. మా పర్సనల్స్ మాకు ఉంటాయ్, అవన్నీ నీకు చెప్పాలా? అని అంటాడు రాజ్. మా కూతుళ్ల కోసం డ్రెస్‌లు తీసుకొచ్చానని, జాగ్రత్తగా దాయమని చెబుతాడు రాజ్. మీకు గనుక ఉంది కూతురు.. ఇంకా భూమ్మీదకే రాలేదు, అప్పుడే షాపింగ్‌లా అని అంటుంది కావ్య. రాజ్- కళ్యాణ్‌లు బయటికి వెళ్లగానే తన కడుపు పట్టుకుని మురిసిపోతుంది కావ్య. మా నాన్న నీ కోసం అప్పుడే షాపింగ్ మొదలు పెట్టేశాడని, నీ కోసం మేమీద్దరం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నామని అంటుంది.
మీ వదిన యక్ష ప్రశ్నలతో చంపేసిందని, ఎలాగోలా తప్పించుకుని వచ్చేశానని కళ్యాణ్‌తో అంటాడు రాజ్. ఆడవాళ్లకి ఎక్కువగా లిబర్టీ ఇవ్వకూడదని, లేదంటే అతి ప్రేమతో మనల్ని ఎక్కడికి వెళ్లనివ్వకుండా రిస్ట్రిక్ట్ చేస్తారని అంటాడు రాజ్. అందుకే మీ వదినకి నేను ఆ ఛాన్స్ ఇవ్వలేదని చెబుతాడు. ఏదో చెబుతానని తీసుకొచ్చావ్? చెప్పు అని అడుగుతాడు రాజ్. ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదని, ధైర్యం సరిపోవడం లేదని అంటాడు కళ్యాణ్. ఏదో పెద్ద ప్రాబ్లమమే వచ్చినట్లుగా ఉందని, మరి మందు కొడుతూ మాట్లాడదాం అనుకుంటే మనకి అలవాటు లేదు.. మరి ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్.
ఇంట్లో మాట్లాడొద్దని ఇలా అర్ధరాత్రి పూట బయటికి తీసుకొచ్చాంటే 100 శాతం ఇది ఫ్యామిలీ ప్రాబ్లమ్ కాదని అంటాడు రాజ్. ఖచ్చితంగా ఇది పర్సనల్ ప్రాబ్లమే అయ్యుంటుందని చెప్పడంతో దానికి ఔను అని ఆన్సర్ ఇస్తాడు కళ్యాణ్. చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావంటే మీ వదిన అన్నట్లు అప్పూకి తెలియకుండా ఏదైనా సెకండ్ సెటప్ పెట్టావా? అని అడుగుతాడు రాజ్. అయినా నీకంత సీన్ లేదు.. ఇలాంటి వేషాలు వేస్తే అప్పూ నిన్ను పప్పు పప్పు చేస్తుందని అంటాడు. గతంలో మాదిరిగా ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ నీతో అగ్రిమెంట్ రాయించుకుని వేధిస్తున్నాడా? అని అడుగుతాడు రాజ్. కారు ఆపితే అసలు విషయం చెబుతానని కళ్యాణ్ అనడంతో కారు ఆపుతాడు రాజ్.
ఏంటీ నీ ప్రాబ్లమ్? ఎందుకిలా ఉంటున్నావని రాజ్ నిలదీస్తాడు. ఎలా మొదలుపెట్టాలో? నీతో ఎలా చెప్పాలో? నాకు అర్ధం కావడం లేదని, చెబితే నువ్వు ఎలా తీసుకుంటావోనని భయంగా ఉందని కళ్యాణ్ బాధపడతాడు. రెండ్రోజుల క్రితం నేను అప్పూ హాస్పిటల్‌కి వెళ్లామని, అక్కడ డాక్టర్లు రిపోర్ట్స్ చూసి ఒక విషయం చెప్పారని అంటాడు కళ్యాణ్. అప్పూకి ఒక ప్రాబ్లం ఉందని, తన బిడ్డను మోసేంత శక్తి తనకి లేదని, వెంటనే అబార్షన్ చేయాలని చెప్పారని అంటాడు కళ్యాణ్. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. అప్పూ కనుక అలాగే తొమ్మిది నెలలు బిడ్డను మోస్తే తల్లి ప్రాణానికే ప్రమాదమని చెప్పారని అంటాడు కళ్యాణ్. తనని కాపాడే అవకాశం లేదని, నిర్ణయం లేట్ చేస్తే తర్వాత అబార్షన్ చేసే అవకాశం కూడా ఉండదని చెప్పారని అంటాడు.
మరి ఈ విషయం అప్పూకి చెప్పావా? అని రాజ్ అడగ్గా.. ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదని అంటాడు కళ్యాణ్. ముందు నేను ఏ నిర్ణయం తీసుకోవాలో? నాకే తెలియడం లేదని.. ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకోని బిడ్డ ఓ వైపు, తన మీదే ఆశలు పెంచుకున్న తల్లి మరొక వైపు .. మరి నన్ను ఇప్పుడేం చేయమంటావ్ అని నిలదీస్తాడు కళ్యాణ్. నా స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావని అడుగుతాడు రాజ్. నువ్వు చెప్పిన దానిని బట్టి డాక్టర్ చెప్పిన మాట వినడం మంచిదని అనిపిస్తుందని, వెంటనే ఈ విషయం అప్పూకి చెప్పి తనని ఎలాగైనా ఒప్పించాలని అంటాడు రాజ్.
అయితే ఒప్పించమని కళ్యాణ్ అనడంతో .. నేను ఒప్పించడం ఏంటీ? అని రాజ్ అడుగుతాడు. ఒక భర్తగా నీ భార్యకు ఈ విషయం నువ్వు చెప్పడమే కరెక్ట్ అని అంటాడు. అందుకే ఈ విషయం నీకు చెబుతున్నాను, వదినకి ఆ నిజాన్ని నువ్వే చెప్పు అంటాడు కళ్యాణ్. వదినకి చెప్పడం ఏంటీ? ఏం మాట్లాడుతున్నావని రాజ్ అడుగుతాడు. ప్రాబ్లమ్ వచ్చింది అప్పూకి కాదు.. వదినకి అని కళ్యాణ్ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నేను, అప్పూ హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు డాక్టర్ వదిన రిపోర్ట్స్ చూపించి తన కండీషన్ గురించి చెప్పారని అంటాడు కళ్యాణ్. నీకు నేరుగా ఈ విషయం చెప్పలేక అప్పూకి ప్రాబ్లమ్ అని అబద్ధం చెప్పానని, నీ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలని అలా అడిగానని చెబుతాడు కళ్యాణ్. అసలు ఈ విషయం నేరుగా వదినకే చెప్పాలని అనుకున్నామని, కానీ తను ఎదురుపడిన ప్రతిసారి మాలో మేమే నరకం అనుభవించామని అంటాడు.
ఫ్యామిలీ అంతా కలిసిపోవాలని తను కన్న కలలు నిజమై, అందరూ సంతోషంగా ఉండటం చూసిన వదినతో నిజం చెప్పలేక నేను, అప్పూ ఏడ్చామని బాధపడతాడు కళ్యాణ్. ఇలాగే పోతే అసలు ఆ నిజాన్ని వదినకి ఎప్పటికీ చెప్పలేమని అనిపించిందని, ఇప్పటికే మేం చాలా ఆలస్యం చేశామని ఆ తప్పు నువ్వు చేయొద్దని అంటాడు. డాక్టర్స్ నిర్ణయమే కరెక్ట్ అని చెప్పావు కదా? వదినను ఆసుపత్రికి తీసుకెళ్లి తన ప్రాణాల్ని కాపాడమని చెబుతాడు కళ్యాణ్. ఆ మాటలతో షాకైన రాజ్.. నిజం చెప్పాలని చెప్పి, ఇంత పెద్ద శిక్ష వేశావేంటీ? అని కుమిలిపోతాడు. నా నోటితో ఈ నిజాన్ని మీ వదినకి నేను చెప్పగలనా అని అడుగుతాడు. ఈ నిజం తెలిస్తే ఆ పిచ్చిది బతకలేదని, ఆ బిడ్డ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుందని అంటాడు రాజ్.
నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏ రోజూ తనకి సంతోషం లేదని, ఇప్పుడిప్పుడే తన కళ్లలో సంతోషం చూస్తున్నానని ఇప్పుడు ఆ సంతోషాన్ని కూడా దూరం చేయాలా? అని రాజ్ కంటతడి పెడతాడు. ఈ పండక్కి ఇంట్లో ఉన్న సమస్యలు తీరిపోయి, అందరం కలిసిపోయామని మనసులో ఏ దిగులు లేదని ఇందిరతో అంటుంది అపర్ణ. నేను నిన్ను అమ్మమ్మ అని పిలవాలా? ఫ్రెండ్ అని పిలవాలా? అని స్వరాజ్ అడుగుతాడు. నేను ఈ ఇంటికి కాబోయే వారసుడినని, మావయ్య తర్వాత నేనే ఈ ఇంటికి రాజునని అంటాడు. అలా కావాలంటే మీ అత్తయ్యని అడిగి ఒక ఆడపిల్లని కనివ్వమని చెప్పు.. పెద్దయ్యాక దానిని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నువ్వే రాజువి అంటుంది ఇందిర.
ఇంతలో రాజ్, కళ్యాణ్‌లు ఇంటికి డల్‌గా వస్తారు. ఆ రాహుల్‌లా నువ్వు కూడా కొత్త గర్ల్ ఫ్రెండ్‌ని పట్టావా అని ఇందిర ప్రశ్నిస్తుంది. అలాంటి పనులు చేస్తే అప్పూ తాట తీస్తుందని కావ్య నవ్వేస్తుంది. భార్య ఆనందంగా ఉండటం చూసి రాజ్ మరింత ఎమోషనలై దేవుడి దగ్గరకి వెళ్లి బాధపడతాడు. కావాలంటే నా ప్రాణం తీసుకో.. నా బిడ్డ, కళావతిల ప్రాణాలు కాపాడమని అడుగుతాడు రాజ్. బావగారికి విషయం చెప్పావా? అని కళ్యాణ్‌ని అడుగుతుంది అప్పూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











