Brahmamudi September 3rd Episode: యామినికి రాజ్ వార్నింగ్.. బావ కాళ్లు పట్టుకున్న యామిని
Photo Courtesy: JioHotstar
తమ భార్యలను మాటి మాటికి పై అంతస్తు వరకు మోసుకుంటూ వెళ్లలేమని భావించిన రాజ్, కళ్యాణ్‌లు తమ తల్లిదండ్రులను పై అంతస్తుకు మార్చేస్తారు. దీంతో న్యాయం చెప్పమని ఇందిరను అడగ్గా.. మధ్యలో ఇరుక్కుపోతానని భయపడి ఆమె వెళ్లిపోతుంది. ఉదయాన్నే ధాన్యం, అపర్ణలు తమకు నిద్రపట్టలేదని ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ ఉండగా ఇందిర వచ్చి వాళ్లతో జోకులు వేస్తుంది. కావ్యను కాలు కింద పెట్టకుండా చూసుకుంటానని చెబుతాడు రాజ్. దీంతో తనకు కాఫీ కావాలని మీరే తీసుకురావాలని కళావతి చెప్పడంతో భార్య కోసం కిచెన్‌లోకి వెళ్తాడు రాజ్.
అయితే ఎవ్వరూ తనను గుర్తు పట్టకుండా చీర కట్టుకుంటాడు. అదే సమయంలో కిచెన్‌లోకి వచ్చిన ప్రకాశం.. చీరలో ఉన్నది తన ప్రియురాలు శైలజ అనుకుని వెనుక నుంచి వాటేసుకుంటాడు. వీరిద్దరిని చూసిన ధాన్యలక్ష్మీ అసలు శైలజ ఎవరు? ఎన్నాళ్ల నుంచి ఈ బాగోతం నడుస్తోందని మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక సెప్టెంబర్ 3వ తేదీ ఎపిసోడ్ 816లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నాకు కాఫీ పెట్టినట్లు ఇంట్లో వాళ్లకి తెలియకుండా చేశారా? అని కావ్య ఫీల్ అవ్వడంతో రాజ్ అందరికి తెలిసేలా చేస్తానని అంటాడు. సరేనని వెళ్లబోతుండగా నేను ఏదో కలరింగ్ ఇద్దామని అనుకుంటే ఇలా అయ్యిందేంటీ అని అనుకుంటాడు రాజ్. మీరు వెళ్లరని నాకు అర్ధమైంది కానీ వెనక్కి రండి అని అంటుంది కావ్య. ఆ మాటలతో రాజ్ సంతోషంగా వెనక్కి వచ్చి కాఫీ ఇస్తాడు. కాఫీ చాలా బాగుందని కావ్య చెప్పడంతో నీలో అస్సలు రొమాంటిక్ యాంగిల్ లేదని మండిపడతాడు. మీరు నన్ను ఇలా కేరింగ్‌గా చూసుకోవడం చాలా బాగుందని, నా పక్కనే ఉంటూ నాకు సేవలు చేయడం చాలా నచ్చిందని అంటుంది కావ్య. ఆ యామిని కారణంగా మీరు నాకు ఎక్కడ దూరమవుతారోనని భయం వేసిందని, కానీ ఆ దేవుడి దయ వల్ల మీరు మళ్లీ నా దగ్గరికే వచ్చారని కావ్య సంతోషిస్తుంది.
అందరూ ఆస్తులు, అంతస్తులు కోరుకుంటారని కానీ ఒక భార్య మాత్రం తన భర్త ఎప్పుడూ తన పక్కనే ఉండాలని కోరుకుంటుందని చెబుతుంది కావ్య. ఐదోతనాన్ని మించిన ఐశ్వర్యం ఏముంటుంది? అని ప్రశ్నిస్తుంది. ఇంతకీ నేను ఆ యామిని దగ్గరికి ఎలా వెళ్లాను? అని అడుగుతాడు రాజ్. గతంలో మీరు తన ప్రేమ పావురం కదా, ఆ ఛాన్స్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకుని మీకు యాక్సిడెంట్ అవ్వగానే మీరు ఆ యామినికి మేనబావ అని, మీరు అమ్మానాన్నలు చిన్నప్పుడే చనిపోతే వాళ్లే చేరదీసి పెంచారని మిమ్మల్ని నమ్మించిందని చెబుతుంది కావ్య. మీరు నా దగ్గరకొచ్చి నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు? ఎవరు? అని నిందిస్తుంటే.. ఆ తండ్రి మీరేనని చెప్పలేక, మీకు గతం గుర్తుచేయలేక నాలో నేనే నరకం అనుభవించానని అంటుంది కావ్య. మీ బిడ్డకు మీరే తండ్రి ఎవరు? అని నిలదీస్తే ఏ భార్య అయినా ఎలా సమాధానం చెబుతుందని అడుగుతుంది కావ్య.
మీరు అలా అడుగుతుంటే నాకు చచ్చిపోవాలని అనిపించిందని, కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపుకోలేక ఆగిపోయానని అంటుంది. మనం ఇలా కష్టపడటానికి, మీ కారణం నేను కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఆ యామినియేనని చెబుతుంది. అది అంత చేస్తూనే ఏం తెలియనట్లు మీ దగ్గర నాటకమాడి, మిమ్మల్ని సొంతం చేసుకోవాలని.. నాకు దూరం చేయాలని ప్లాన్ చేసిందని చెబుతుంది కావ్య. కానీ మనది ఒకరు విడదీస్తే విడిపోయే బంధం కాదు కదా? అందుకే ఆ దేవుడు మిమ్మల్ని నా దగ్గరికి చేర్చాడని అంటుంది. కావ్య మాటలతో ఊగిపోయిన రాజ్.. ఆ యామిని ఇంత చేస్తుంటే ఎందుకు సహించావు? దానిని చంపేయాల్సింది అని అంటాడు. నిన్ను అంతలా బాధపెట్టిన ఆ యామినిని నా చేతులతో నేనే చంపేస్తానని ఆవేశంగా వెళ్తాడు.
యామిని ఇంటికి కోపంగా వస్తున్న రాజ్‌ను ఆపుతుంది కావ్య. జరిగిందేదో జరిగిపోపయింది, మీరు ఏదైనా చేస్తే మళ్లీ అందరం బాధపడాల్సి వస్తుందని అంటుంది. అంటే నిన్ను అంతలా బాధపెట్టిన యామినిని వదిలేయాలా? అని ప్రశ్నిస్తుంది. రాజ్ కోపాన్ని చూసిన వైదేహి.. కూతురిని లోపల దాక్కోమని చెబుతుంది. ఏం జరిగినా నేనే ఫేసే చేస్తానని రాజ్‌కి ఎదురెళ్తుంది యామిని. నా జీవితంలోకి రావొద్దని నీకు చెప్పినా వినిపించుకోలేదని రాజ్ మండిపడుతుండగా.. రాజ్ పాదాలపై పడుతుంది యామిని. నన్ను క్షమించమని అంటుంది. నీ మొసలి కన్నీళ్లకి కరిగిపోవడానికి నేను రామ్‌ని కాదు, రాజ్‌ని అంటాడు. నువ్వు కావ్యకి చేసిన అన్యాయానికి అస్సలు క్షమించకూడదని మండిపడతాడు. నేను అన్యాయం చేశాను.. తనకు లైఫే లేకుండా చేయాలని అనుకున్నానని ఒప్పుకుంటుంది యామిని.
నీ మీద ఉన్న పిచ్చి ప్రేమే నన్ను అలా చేసేలా చేసిందని, నువ్వు దాక్కలేదన్న కోపంతో చెడు వ్యసనాలకు బానిసనైపోయానని, చచ్చిపోతానని డాక్టర్స్ చెప్పడంతో ఫారిన్ పంపించారని చెబుతుంది యామిని. నేను ఎందుకు బతికున్నానో తెలియలేదని, ఆ సమయంలో నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిసిందని వెతుక్కుంటూ వచ్చానని అంటుంది. అనుకోకుండా నీకు యాక్సిడెంట్ అయ్యింది, నువ్వు గతం మరిచిపోయావని డాక్టర్లు చెప్పారని.. దానిని నేను వాడుకోవాలని అనుకున్నానని అంటుంది. గతంతో పాటు నువ్వు కావ్యని కూడా మరిచిపోవడం ఆ దేవుడు నాకిచ్చిన రెండో అవకాశం అనుకున్నానని చెబుతుంది. నా ప్రేమను గెలిపించుకోవాలని, నిన్ను బావ అని నమ్మించి నా దగ్గరికి తెచ్చుకున్నానని అంటుంది యామిని.
గతం గుర్తులేకపోయినా నువ్వు కావ్యని వెతుక్కుంటూ వెళ్లి తననే ప్రేమించావని, పెళ్లి చేసుకోవాలని అనుకున్నావని.. అప్పుడే మీ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరని అర్ధమైందని అంటుంది యామిని. నేను ఎంత ప్రేమను పంచినప్పటికీ, కావ్య కడుపుతో ఉందని తెలిసినా తననే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యావని చెబుతుంది. ఇక నీ జీవితంలో నుంచి తప్పుకోవాలని అనుకున్నానని అంటుంది. నువ్వు నటించడం ఇంకా ఆపలేదని, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? అని మండిపడుతుంది కావ్య. నేను తప్పు చేశాను? మీ జీవితంలో నుంచి తప్పుకోవాలని అనుకున్నానని చెబుతుంది యామిని. తప్పు చేసినవాళ్లు ఇలా మాట్లాడరని, ఇంకా నాది ప్రేమ అని చెప్పుకుని తిరుగుతున్నావని, అప్పుడే నీ బుద్ధి ఏంటో అర్ధమవుతుందని అంటుంది కావ్య. నీది ప్రేమ కాదు, శాడిజం అని మండిపడుతుంది. మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలు.. నాకు ఇంకేం వద్దు అని అంటుంది యామిని.
నువ్వు ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంటే నేను నమ్మేస్తానని అనుకోవద్దని అంటాడు రాజ్. మీరు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు అల్లుడుగారు అని వైదేహి చెప్పగా.. రాజ్ మండిపడతాడు. తల్లిగా మీరు సరిగా పెంచుంటే, ఈరోజు ఇలా నా కాళ్లు పట్టుకునే అవసరం వచ్చేది కాదని చెబుతాడు. మేం శ్రీశైలంకి వెళ్తుంటే మాకు అనుకోకుండానే యాక్సిడెంట్ అయ్యిందని, ఇప్పటి వరకు నమ్ముతున్నామని.. కానీ దానికి కారణం నువ్వని తెలిస్తే మాత్రం నిన్ను, నీ ఫ్యామిలీని వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తాడు రాజ్. కావ్యే నా జీవితం.. ఇంకోసారి తన కన్నీటికి కారణమైతే మాత్రం చంపేస్తానని హెచ్చరిస్తాడు.
ఇక రాజ్‌ని మర్చిపోమ్మని యామినికి వైదేహి చెబుతుంది. నాకు దక్కని ఆనందాన్ని ఎవరికీ దక్కనివ్వనని యామిని మండిపడుతుంది. మీరు వెళ్లిన స్పీడుకి ఆ యామినిని ఏం చేస్తారో అనుకుంటే కనీసం చెంపదెబ్బ కూడా కొట్టలేదని అంటుంది కావ్య. ప్రేమంటే అడిగినదల్లా ఇచ్చేది కాదు.. అవసరమైతేనే ఇచ్చేది అని అంటాడు రాజ్. ఆ యామినిని చంపేయాలనే వెళ్లాను.. కానీ ఒక్క క్షణం నువ్వు గుర్తొచ్చి ఆగిపోయానని చెబుతాడు. పెళ్లయిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు నేను నిన్ను ఇబ్బంది పెట్టడమే తప్ప నీ గురించి ఆలోచించింది లేదని అంటాడు. నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేసేసరికి మనకి యాక్సిడెంట్ జరిగి, నేను గతం మరిచిపోయానని చెబుతాడు. నీ ప్రెగ్నెన్నీకి కారణం నేనే అని తెలిసినా, ఏం చేసినా అన్నీ భరించావని కావ్యని మెచ్చుకుంటాడు రాజ్. నువ్వు ఇన్నాళ్లు నా వల్ల కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నానని అంటాడు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కలిసి వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని ప్లాన్ చేస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











