Brahmamudi September 4th Episode: కావ్య ప్రెగ్నెన్సీకి ముప్పు.. మళ్లీ రుద్రాణి కుట్రలు.. షాక్‌లో అప్పు
Photo Courtesy: JioHotstar
నా పక్కనే ఉండి నన్ను కేరింగ్‌గా చూసుకోవడం ఎంతో నచ్చిందని, కానీ ఆ యామిని కారణంగా మీరు ఎక్కడ నాకు దూరమైపోతారోనని అనుకున్నానని రాజ్‌తో చెబుతుంది కావ్య. మీరు గతం మరిచిపోవడాన్ని అవకాశం తీసుకుని ఆ యామిని నా నుంచి మిమ్మల్ని లాగేసుకోవాలని చూసిందని కావ్య చెప్పడంతో రాజ్ పూనకంతో ఊగిపోతాడు. యామిని అంతు చూస్తానంటూ రాజ్ ఆవేశంగా బయల్దేరగా, కావ్య భర్తని ఆపాలని ట్రై చేస్తుంది. రాజ్ ఆవేశంగా వస్తుండటాన్ని వైదేహి, యామినిలు చూసి టెన్షన్ పడతారు.
నా జీవితంలోకి నువ్వు రావొద్దని చెప్పాను.. అయినప్పటికీ వచ్చావ్ అంటుండగా రాజ్ పాదాలపై పడిన యామిని క్షమించమని అడుగుతుంది. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ అని నిన్ను దక్కించుకోవడానికి ఇలా చేశానని చెబుతుంది యామిని. శ్రీశైలం వెళ్లేటప్పుడు జరిగిన యాక్సిడెంట్ నీవల్లే జరిగిందని తెలిస్తే నిన్ను, నీ ఫ్యామిలీని వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఇకనైనా రాజ్‌ని మరిచిపోమ్మని వైదేహి చెబుతున్నా వినిపించుకోకుండా నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కనివ్వనని అంటుంది యామిని. కారులో వెళ్తుండగా భార్యపై ప్రేమను చాటుకుంటాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక సెప్టెంబర్ 4వ తేదీ ఎపిసోడ్ 817లో ఏం జరిగిందంటే?

ఆ కుక్కల్ని, జంతువులను పుట్టించేది దేవుడే. కానీ వాటికి తెలుసా? అని కావ్య అంటే.. వాటికి ఆలోచించే శక్తి ఉందా? అంటూ రుద్రాణి ప్రశ్నించింది. అదే ఆలోచించే శక్తి మనకు మాత్రమే ఇచ్చాడు. దానికి కృతజ్గత కారణంగానే పూజలు, పండుగలు చేస్తారు అని కావ్య బదులిచ్చింది. దాంతో కావ్య బాగా చెప్పింది అని కొందరు కుటుంబ సభ్యులు అంటే.. నా చెల్లెలికి బాగా గడ్డి పెట్టింది అంటూ మరో ఫ్యామిలీ మెంబర్ కామెంట్ చేశాడు. దాంతో రుద్రాణి కూడా ఏం చేస్తుంది. అటు జంతువులా ఆలోచించకుండా, మనిషిలా ఆలోచించలేకపోతుంది. చివరకు జంతువులా బిహేవ్ చేస్తుందని బామ్మ ఎద్దేవా చేసింది. దాంతో రుద్రాణి సీరియస్ అయింది.
అంతలోనే కనకం ఇంటి గుమ్మం వరకు వచ్చి ఆగిపోతే.. పరాయి వాళ్ల లాగా అక్కడే ఆగిపోయావంటూ బామ్మ ప్రశ్నించింది. మా ఇంటికి ముగ్గురు కోడళ్లను ఇచ్చిన వియ్యంకురాలివి మీరు. లోపలికి రండి అంటే.. కనకం.. ఆమె భర్త వచ్చి కూర్చొన్నారు. దాంతో ఎప్పుడూ రాని మీరు ఇలా వచ్చారేంటి అని అడిగితే.. వినాయకచవితి వస్తుంది కదా.. ఇద్దరు కూతుళ్లూ గర్భంతో ఉన్నారు. కూతుళ్లను, అల్లుళ్లను ఇంటికి తీసుకెళ్లి పండుగ జరుపుకొందామని అనుకొని వచ్చాం అని కనకం సమాధానం ఇచ్చింది. అందుకే ఒకసారి మిమ్మల్ని అడిగి తీసుకెళ్దామని అంటూ ఆగిపోయింది. దాంతో మీ కూతుళ్లను మీరు తీసుకెళ్లడానికి మొహమాటం ఎందుకు? అని ఇందిరా దేవి అంటే.. ఏంటి అత్తమ్మ.. ఇప్పుడే మామయ్య అందరం కలిసి ఇక్కడే పండుగ చేసుకొందామని అన్నాడుగా. నా కొడుకులను పండుగ రోజు ఎక్కడికి పంపించను అంటూ తల్లి అపర్ణ చెప్పేసింది.
నా కోడలు తొలిసారి తల్లి కాబోతున్నది. పండుగ రోజు ఇంట్లో అటు ఇటూ తిరిగితే మాకు మంచి జరుగుతుంది అంటూ కనకంతో అపర్ణ అంది. దాంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. అది నచ్చక.. మీరు.. మీ ప్రేమలు అంటూ రుద్రాణి మనసులో గొణుక్కొంది. వెంటనే కనకంతో మాట్లాడుతూ... వాళ్లను తీసుకెళ్లడం కంటే.. మీరు ఇద్దరే ఇక్కడికి రావొచ్చు కదా అంటూ అపర్ణ సలహా ఇచ్చింది. ఆ మాటలకు రాజ్, కావ్య ఇతర సభ్యులు ఆనందపడిపోయారు. దాంతో నీ నిర్ణయం మీరు తీసుకొంటే ఎలా అని అపర్ణను ప్రశ్నిస్తే.. లేదు మామయ్య.. ఈ ఇంటికి వచ్చినప్పుడే.. ఈ కుటుంబంలో సభ్యులమని కావ్య చెప్పింది. మాకు ఇక్కడే ఉండి పండుగ జరుపుకోవాలని ఉంది. ఆ రోజే డిసైడ్ అయ్యాం. ఏది జరిగిన ఇక్కడే అంటూ కావ్య చెల్లెలు అంది. కావ్య కూడా ఇక్కడే పండుగ జరుపుకొందామని అని అనడంతో.. మనమంత ఇక్కడే వినాయక చవితిని జరుపుకొందాం అని ఇంటి పెద్ద సీతారామయ్య అన్నాడు.
అందరూ సంతోషంగా ఉన్నారు. అత్తయ్య క్షమించి ఉంటే.. వదిన కూడా ఇక్కడే సంతోషంగా ఉండేది అని కావ్య మనసులో బాధపడింది. ఇంత హ్యాపీ సమయంలో ఇలా ఉన్నావేంటి? రాజ్ ప్రశ్నించాడు. రేపు మనింట్లో వినాయకచవితి పూజ జరుగుతుంది. మీ అమ్మానాన్న ఇక్కడే ఉన్నారు. ఇంకా బాధేమిటి అని రాజ్ అంటే.. అందరూ ఇక్కడే ఉన్నాం. కానీ ఓ సంఘటన గుర్తుకు వచ్చింది అంటే.. ఏమిటా సంఘటన అని కావ్యను రాజ్ అడిగితే.. తన ఊరిలో ఒకామే ఉండేది అంటూ ఓ కథను చెప్పడం మొదలుపెట్టింది. కానీ తమ కుటుంబ సభ్యులను బాధపెట్టింది. ఆ అమ్మాయి అందరి ప్రాణాలు పోయేలా చేసింది. ఒకరోజు మెడలో దండలతో ఇంటికి వచ్చింది. అప్పటి అనుకొన్న ప్రాణం అనుకొన్న ఆమె తల్లిదండ్రులు ఆదరిస్తారని అనుకొన్నది. కానీ పేరెంట్స్ శత్రువులుగా మారిపోతారని అనుకోలేదు. 15 ఏళ్లుగా పుట్టింటికి దూరమైంది. తల్లికి దగ్గర కావాలని, కుటుంబంతో పండుగ జరుపుకోవాలని అనుకొంటున్నది. కానీ ఆశ తీరడం లేదు. అది గుర్తుకు వచ్చింది అని కావ్య అంటే.. ఇంతకు ఆమె ఎవరు అని రాజ్ అడిగాడు.. తల్లి పేరు అపర్ణ. కలపాలని ప్రయత్నిస్తున్నది కావ్య. కలుపలేకపోతున్నది మీ అక్క రేవతి అని బాంబు పేల్చింది.
అయితే మా అక్క రేవతి గురించి ఎలా తెలుసు? ఆమె పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని రాజ్ అంటే.. అవును.. ఆమె హైదరాబాద్‌లోనే ఉంది. మీరు గతం మరిచిపోయినప్పుడు మీరు రెండు రోజు ఆమె ఇంట్లోనే ఉన్నారు. మీకు తెలియకపోయినా ఆమెను అక్కా అంటూ పిలిచారు అంటూ కావ్య చెప్పింది. తనకు మీరు తమ్ముడని తెలిసినా.. నిజం చెబితే.. ఎక్కడ దూరం అవుతారేమో అని చెప్పలేదు. మీరంటే ఇష్టం. తన కొడుకుకు స్వరాజ్ అని మీ పేరే పెట్టుకొంది. ఆమె ఎన్నో కష్టాలు పడుతున్నది అంటూ కావ్య కథంతా చెప్పింది. మీ అక్క రహమత్ నగర్ బస్తీలో ఉంది అని రాజ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది. బస్తీలో ఉందా? వెళ్లి తీసుకొద్దాం పద.. అంటే అంత ఈజీ కాదు. గతంలో ఓసారి తీసుకొస్తే.. మీ అమ్మ బయటకు పంపించింది. నీ కోడుకు మా కుటుంబానికి సంబంధం లేకుండా ఉంటాడు అంటూ రేవతిని మీ అమ్మ తిట్టి పంపించింది అని కావ్య చెప్పింది. దాంతో రాజ్ బాధపడి.. అక్కను ఇంటికి తీసుకొద్దాం అని అన్నాడు.
రాజ్ మాటలకు అడ్డుపడుతూ.. రేవతి అక్కను ఎలా తీసుకొస్తారు అని కావ్య అడిగింది. ఎలాగైనా తీసుకొద్దాం పద అని రాజ్ బయలుదేరాడు. రాజ్ వెళ్లే సరికి అల్లుడు స్వరాజ్.. ఈ సారి వినాయకచవితి మన ఇంట్లో కాకుండా ఫ్రెండ్ ఇంట్లో జరుపుకొందాం. అక్కడైతే అందరూ ఉంటారు అని అంటే.. అది కుదరదు. అక్కడ నేను ఉండలేను అని రేవతి అంటే..ఆ మాటలు రాజ్ విన్న రాజ్.. వాడికి అమ్మగా ఉండలేరు. కానీ ఆ ఇంటి ఆడపడుచుగా ఉంటావు అని రాజ్ అన్నాడు. ఆ మాటలకు రామ్ అని రేవతి అంటే.. రామ్ కాదు.. రాజ్.. ఇప్పుడు మామూలు మనిషి అయ్యాడు. మిమ్మల్ని వెతుక్కొంటూ వచ్చాడు అనగానే.. రేవతి వెళ్లి కౌగిలించుకొన్నది. నీవు నన్ను వెతుక్కొంటూ వచ్చావు. అమ్మ వల్ల నాకు దూరం అవుతావని అనుకొన్నాను అని రేవతి అంటే.. నీ కోసం వెతకని ప్రాంతం లేదు అంటూ రాజ్ అన్నాడు. ఇక ఇంటి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాను. రేపు గణేష్ పండుగకు తీసుకెళ్దామని వచ్చాను. మా ఫ్రెండ్ వాళ్ల ఇంటికా? అని స్వరాజ్ అంటే.. ఫ్రెండ్ ఇల్లు కాదు.. మీ అమ్మమ్మ ఇల్లు అంటూ రాజ్ చెప్పాడు. గతమంతా పీడకల అనుకొని అన్నీ మరిచిపోండి బావ అని అంటే.. నేను రాలేను. అమ్మకు దగ్గరయ్యే ప్రయత్నించాను. కానీ మమ్మల్ని దూరం చేసింది. మళ్లీ ఆ దూరాన్ని పెంచుకోలేను అంటే.. ఆ దూరాన్ని తగ్గించి దగ్గరయ్యేలా చేస్తాను అని రాజ్ అంటే.. సరే వస్తాను అంటూ రేవతి హామీ ఇచ్చింది. రాజ్, కావ్య వెళ్లిన తర్వా త.. ఇక నీవు కార్చాల్సింది కన్నీళ్లు కాదు.. ఆనంద బాష్పాలు అని అన్నాడు.
ఇదిలా ఉండగా, అప్పు గర్బవతి అని డాక్టర్‌తో భర్త చెప్పించాడు. డాక్టర్ రిపోర్టులు చూసి వారికి ఇచ్చేశారు. అంతలోనే కావ్య రిపోర్టులు అంటూ డాక్టర్ వద్దకు నర్స్ వచ్చింది. అయితే కావ్య రావడం ఎందుకు.. మీకు ఇచ్చేస్తా అంటూ వాటిని చూసి డాక్టర్ షాక్ అయ్యింది. ఏదైనా ప్రాబ్లెం ఉందా? అని అప్పు అడిగితే.. వాటిలో ప్రాబ్లెం ఉంది. గర్బ సంచిలో సమస్య ఉంది. ఆమె గర్బ సంచిని ప్రసవం వరకు మోయలేదు అంటూ అప్పుకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అయితే ప్రోమోలో రుద్రాణి తన కుట్రలను బయటపెట్టడం ట్విస్టుగా మారింది.
Photo Courtesy: JioHotstar


Click it and Unblock the Notifications











