Brahmamudi September 5th Episode: కావ్యకి కొండంత కష్టం.. కృష్ణ విగ్రహాన్ని తీసేయబోయిన అప్పూ
Photo Courtesy: JioHotstar
వినాయక చవితి సందర్భంగా కావ్య సహాయంతో తన అక్క రేవతిని, రాజ్ కలుసుకొన్నాడు. పండుగ సమయంలో అక్కను ఇంటికి తీసుకు రావడానికి రాజ్ ప్లాన్ చేశాడు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఊహించిన సంఘటన చోటు చేసుకొన్నది.
అప్పు ప్రెగ్నెన్సీ రిపోర్టుల చూసిన డాక్టర్ అంతా సవ్యంగా ఉందని చెప్పడంతో అనందపడిపోయారు. అంతలోనే కావ్య రిపోర్టులు నర్స్ తీసుకు రావడంతో.. మళ్లీ కావ్య రావడం ఎందుకు? మీరే తీసుకొని ఇవ్వండి. ఓసారి ఆ రిపోర్టుల చూసి ఇస్తాను అని వాటిని చూసి షాక్ అయింది. డాక్టర్ పరిస్థితిని చూసి.. ఏమైనా ప్రాబ్లెం ఉందా? అని అప్పు అడిగితే.. ప్రాబ్లెం ఉంది. ఆమె తన గర్బ సంచిని మోయలేదు అని డాక్టర్ చెప్పడంతో అప్పు దంపతులు షాక్ అయ్యారు.
ఇక భార్య గర్బవతి అనే విషయంతో రాజ్ సంబరపడిపోయాడు. పాల గ్లాసుతో వచ్చి.. చక్కటి చిక్కటి పాలు అంటూ కావ్యకు అందించాడు. కావ్య పాలు తాగి ఇలా ఉన్నాయని అడిగితే.. ఇందాక మీ అమ్మ కుంకుమ పువ్వు తెచ్చింది. కుంకుమ పూల పాలు తాగితే.. నాలా ఎర్రగా బుర్రగా పుడుతారు అంటూ పాలు కలిపి ఇచ్చింది అని రాజ్ చెప్పాడు. నేను కుంకుమ పువ్వును ఎక్కువగా కలిపాను అంటూ రాజ్ అన్నాడు.
ఇదిలా ఉండగా, ఈ ఇంటికి నీ కూతురే వారసురాలు అవుతుంది అని కొడుకుతో రుద్రాణి అంటే.. ఎలా అవుతుంది మమ్మీ అంటూ ప్రశ్నించాడు. వాళ్లకు కూడా పిల్లలు పుడుతారు కదా.. అని కొడుకు అంటే.. పుట్టుకుండా చేసే ఐడియా నా వద్ద ఉంది అని రుద్రాణి తన కుట్రలను బయటపెట్టింది. ఇంకా సెప్టెంబర్ 5వ తేదీ ఎపిసోడ్ 818 లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రిపోర్ట్స్‌లో ప్రాబ్లం ఏం లేదు కదా అని డాక్టర్‌ని అడుగుతుంది అప్పూ. మీ అక్క గర్భసంచి చాలా వీక్‌గా ఉందని, తను డెలివరి వరకు బిడ్డను మోయలేదని డాక్టర్ చెప్పడంతో అప్పూ, కళ్యాణ్‌లు షాక్ అవుతారు. ఇలాంటి కేసులలో బేబీని 9 నెలలు ఉంచలేకపోతే.. 7 నెలలకే డెలివరీ చేయాల్సి వస్తుందని డాక్టర్ అంటుంది. కానీ అలా చేస్తే బేబీ ప్రాణాలతో బయటపడే ఛాన్సులు చాలా తక్కువగా ఉన్నాయని, అలా కాదని 9 నెలల వరకు బేబీని ఉంచుకుంటే తల్లి ప్రాణానికే ప్రమాదమని కొన్నిసార్లు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతుంది డాక్టర్. ఆ మాటలతో అప్పూ, కళ్యాణ్‌లు షాక్ అవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకి అబార్షన్ చేయడం తప్పించి తనకి ఏం చేయలేమని తేల్చిచెబుతుంది డాక్టర్.
మా అక్కకి పెళ్లయని రెండేళ్ల తర్వాత పుట్టబోయే మొదటి బిడ్డ అని .. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మా అక్క ఎన్నో అవమానాలు పొందిందని బాధపడుతుంది అప్పూ. ఇప్పుడు తను అమ్మ అవలేదని తెలిస్తే తట్టుకోలేదని ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతోందని, ఇప్పుడు ప్రాణాలకి ప్రమాదముందని తెలిస్తే మా అక్క చచ్చిపోతుందని.. వాళ్లిద్దరికి ఏం కాకుండా చూడమని బ్రతిమలాడుతుంది అప్పూ. ప్రాణం విలువ డాక్టర్ కన్నా ఎక్కువ ఎవరికీ తెలియదని, కానీ అన్ని మన చేతుల్లో ఉండవని.. అయితే కంగారు పడాల్సిన పనిలేదని వేరే దారి ఏమైనా ఉందేమో కనుక్కుంటానని అంటుంది డాక్టర్.
అపర్ణ, ఇందిరలు మాట్లాడుకుంటూ ఉండగా కావ్య వచ్చి మీరు జ్యూస్ తాగే టైం కదా మరి తాగారా? అని అడుగుతుంది. ఆ పనిమినిషి ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు తాగుతానని బాధపడుతుంది ఇందిర. నాకు మీలాగా ఎదురుచూడాల్సిన పనిలేదని చిటికెస్తే అలా వచ్చేస్తుందని చెబుతుంది కావ్య. అయితే నాకు ఆరెంజ్ జ్యూస్, నాకు పైనాపిల్ జ్యూస్ కావాలని కావ్యతో అంటారు. ఇంతలో రాజ్ ఆ రెండు తీసుకుని ప్రత్యక్షమవుతాడు. ఆ రెండు జ్యూస్‌లని పెద్దవాళ్లకి ఇవ్వడంతో రాజ్ మండిపడతాడు. నా పనులే కాదు ఇంట్లో పనులన్ని నేనే చేసిపెడతానని అంటాడు రాజ్. మీరు నాకోసం ఏం చేయడం లేదని నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసం చేస్తున్నారని అంటుంది కావ్య. మా కోసం ఏ రోజైనా ఏమైనా చేశావా అని ఇందిర, అపర్ణలు రాజ్‌ని నిలదీస్తారు.
ఇంతలో కృష్ణమూర్తి, కనకంలు వచ్చి నువ్వు అడిగినవన్నీ బయట పెట్టేశామని కావ్యతో చెబుతారు. ఏంటవి? అని రాజ్ అడగ్గా.. బంకమన్ను, కలర్స్ అని వినాయకుడి విగ్రహం చేయబోతున్నానని అంటుంది కావ్య. నువ్వు ఏ పనిచేయడానికి నేను ఒప్పుకోనని రాజ్ చెప్పగా.. నువ్వు పూజ మాత్రమే చేయి, విగ్రహం పనులు నేను చూసుకుంటానని అంటాడు రాజ్. ఈసారి విగ్రహం నేనే చేస్తానని మొక్కుకున్నానని అంటుంది కావ్య. అయితే విగ్రహం నేనే తయారు చేస్తానని చెబుతాడు రాజ్. దాంతో నేను మీకు హెల్ప్ చేస్తామని రాజ్‌తో కృష్ణమూర్తి, కనకంలు చెబుతారు.
రాజ్ మట్టి దగ్గరికి వచ్చి కాళ్లతో పిసకబోతుండగా కృష్ణమూర్తి వచ్చి చేతులతోనే పిసకాలని చెబుతాడు. రాజ్ మట్టి పిసుకుతూ ఉండగా కావ్య, ఇందిర, అపర్ణలు నవ్వుకుంటారు. విగ్రహం తయారుచేస్తూ కిందపడిపోతాడు రాజ్. విగ్రహం తయారు చేయడం అంత ఈజీ కాదని ఇప్పటికైనా ఒప్పుకోవాలని కావ్య సెటైర్లు వేస్తుండగా రాజ్ మండిపడతాడు. ఈపని అయినాసరే మధ్యలో వదిలిపెట్టే అలవాటు ఈ స్వరాజ్‌కి లేదని మండిపడతాడు. అందరినీ లోపలికి పంపించేసిన కృష్ణమూర్తి.. విగ్రహం ఎలా తయారు చేయాలో చెబుతాడు. మామగారి సూచనల మేరకు రాజ్ విగ్రహాన్ని పూర్తి చేస్తాడు.
ఇంతలో కావ్య రావడం చూసిన రాజ్.. చెప్పిన టైంకి విగ్రహాన్ని పూర్తి చేశానని ఎలా ఉందో చూసి చెప్పమని అడుగుతాడు. మా నాన్న గారి సాయంతో బొమ్మ బాగా చేశారని కావ్య చెబుతుంది. ఇంత కష్టపడి చేస్తే క్రెడిట్ మొత్తం మీ నాన్నకి ఇస్తావా అంటూ కావ్య వెంటపడతాడు రాజ్. హాస్పిటల్ నుంచి డాక్టర్ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఇంటికి వస్తారు కళ్యాణ్, అప్పూ. కావ్య- రాజ్‌లు సంతోషంగా ఉండటం చూసి బాధపడతారు. ఆ వెంటనే అప్పూ వెళ్లి కృష్ణుడి విగ్రహం ముందు బాధపడుతుంది. మా అక్క జీవితంలో ఎందుకిలా ఆడుకుంటున్నావ్? తను ఏం తప్పు చేసిందని ఇన్ని శిక్షలు విధిస్తున్నావని అడుగుతుంది. నిన్ను నమ్మడమే తను చేసిన తప్పా? నీకు పూజలు, వ్రతాలు చేసి నిన్ను ఆరాధించడమే మా అక్క చేసిన తప్పా. అని అడుగుతుంది.
ఇన్ని రోజులు మా బావ కారణంగా ఇబ్బంది పెట్టావని, తీరా తను మారి మా అక్క ప్రేమని అర్ధం చేసుకుని తనకి దగ్గరయ్యే సరికి యాక్సిడెంట్ చేసి మా బావ గతం మరిచిపోయేలా చేశావ్. అది చాలదన్నట్లు ఆ యామినిని మధ్యలోకి తీసుకొచ్చి ఇంకా బాధపెట్టావ్? ఆ యామిని ఎంత ప్రయత్నించినా? మా బావని సొంతం చేసుకోవాలని ఎన్ని ప్లాన్లు వేసినా? మా అక్క వెనుకే బావ తిరిగాడని అంటుంది అప్పూ. మా అక్క, బావల మధ్య అన్ని సమస్యలు సాల్వ్ అయిపోయాయని అంతా సంతోషంగా ఉంటున్నారని అనుకుంటున్న టైంలో ఇలా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కారణంగా మళ్లీ సమస్యలు సృష్టించావని మండిపడుతుంది. ఇన్నిరోజులు ఆ బిడ్డ కోసం మా బావనే వదులుకోవడానికి సిద్ధపడింది మా అక్క.. ఇప్పుడు ఆ బిడ్డనే మా అక్క పాలిట మృత్యు దేవతని చేశావా? అని ఫైర్ అవుతుంది.
ఈ క్షణం నుంచి మా ఇంట్లో నువ్వు ఉండటానికి వీల్లేదని కృష్ణుడి బొమ్మని తీసేయబోతుండగా.. కళ్యాణ్ అడ్డుకుంటాడు. దేవుడు లేడు అని ఈరోజే అర్ధమైందని, అందుకే ఈ దేవుడు అక్కర్లేదని తీసేస్తున్నానని అంటుంది. ఇక్కడ ఉన్నది నిజంగానే దేవుడు అయితే మా అక్కకి ఇంత కష్టాన్ని ఇచ్చేవాడే కాదని చెబుతుంది. అసలు దేవుడే లేదని ఏడుస్తుంది. నీ బాధను అర్ధం చేసుకుంటానని, కానీ ఇలా చేయడం తప్పని అంటాడు కళ్యాణ్. అక్క జీవితాన్ని చూస్తుంటే నాకు దేవుడిపై నమ్మకం పోయిందని అంటుంది. ఇన్నిరోజుల తర్వాత అక్కా, బావ సంతోషంగా ఉన్నారో చూశావు కదా? ఇప్పుడు నేను వెళ్లి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల నువ్వు చనిపోతావని ఎలా చెప్పనని ప్రశ్నిస్తుంది. ఇప్పుడే ఆ నిజం చెప్పాల్సిన అవసరం లేదని, ఏదైనా మార్గం ఉందేమోనని డాక్టర్ గారు కనుక్కుని చెబుతానని అన్నారు కదా అని అప్పూని ఓదారుస్తాడు కళ్యాణ్. అప్పటి వరకు నువ్వు ఎమోషనలై, తొందరపడి ఎవ్వరికీ ఈ విషయం చెప్పొద్దని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











