Brahmamudi September 6th Episode: కావ్యకు పుట్టబోయే బిడ్డ రుద్రమదేవి.. రుద్రాణి కడుపు మంట
Photo Courtesy: JioHotstar
మీ అక్క గర్భసంచిలో ప్రాబ్లం ఉందని, ఆమె 9 నెలలు పాటు బిడ్డను మోయలేదని డాక్టర్ చెప్పడంతో అప్పూ, కళ్యాణ్‌లు షాక్ అవుతారు. బిడ్డను ముందుగానే డెలివరీ చేయాలని, లేదంటే తల్లి, బిడ్డ కూడా దక్కరని హెచ్చరిస్తుంది. లేనిపక్షంలో కావ్యకి ముందే అబార్షన్ చేయాలని చెప్పడంతో అప్పూ, కళ్యాణ్‌లు బాధపడతారు. ఏదైనా పరిష్కారం ఉంటే చూడమని అప్పూ రిక్వెస్ట్ చేయడంతో మా సీనియర్ డాక్టర్లని అడిగి కనుక్కుంటానిన చెబుతుంది డాక్టర్.
కావ్యని రాజ్ కేరింగ్‌గా చూసుకుంటూ ఉండటంతో అపర్ణ, ఇందిరలు సంతోషిస్తారు. ఇంతలో కృష్ణమూర్తి, కనకంలు వచ్చి వినాయకుడి బొమ్మ చేయడానికి కావాల్సిన మట్టి, రంగులు తీసుకొస్తారు. రాజ్ నేనే బొమ్మను తయారు చేస్తానని బిల్డప్ ఇచ్చి తర్వాత చేతులెత్తేస్తాడు. దాంతో అల్లుడికి కృష్ణమూర్తి సాయం చేస్తాడు. అప్పూ, కళ్యాణ్‌లు ఇంటికి వచ్చేసరికి కావ్య, రాజ్‌లు సంతోషంగా ఉండటంతో వారిద్దరూ బాధపడతారు. వెంటనే అప్పూ వెళ్లి కృష్ణుడి విగ్రహం ముందు తన గోడు వెళ్లబోసుకుని.. దేవుడు లేడంటూ విగ్రహం తీసేయబోతుండగా కళ్యాణ్ అడ్డుపడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 6వ తేదీ ఎపిసోడ్ 819లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కావ్య ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుండగా రాజ్ వచ్చి శ్రీమతి గారికి చక్కని చిక్కని పాలు అని అంటాడు. పాలు తేడాగా ఉన్నాయని కావ్య అడగటంతో, ఇందాక మీ అమ్మ కుంకుమ పువ్వు తీసుకొస్తే నా కూతురు నీలాగా ఎర్రగా, బుర్రగా పుట్టాలని కొంచెం కుంకుమ పువ్వు ఎక్కువ వేశానని చెబుతాడు. పాలు బాలేదా? అని అడుగుతాడు.. బాగానే ఉన్నాయి కానీ అన్నదమ్ములిద్దరూ కలిసి ఇద్దరూ ఆడపిల్లలు పుట్టాలని కోరుకుంటున్నారని అడుగుతుంది కావ్య. ఆడపిల్లలు అనుకుంటే పుట్టరని, అదృష్టం ఉంటేనే పుడతారని అంటాడు రాజ్.
అంటే మీరు అదృష్టవంతులన్న మాట అని కావ్య ఆటపట్టిస్తుంది, కడుపులో పెరుగుతున్న బిడ్డ రావడానికి టైం పడుతుందని, నా బంగారు కొండ అని కావ్య కడుపుని ముద్దు పెట్టుకుంటాడు రాజ్. ఎంత పెద్దవాళ్లయినా సరే పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్లు చిన్నపిల్లల్లా ఎలా మారిపోతారా అని చూస్తున్నానని అంటుంది. మీకు ఆడపిల్లలంటే ఎందుకు అంత ఇష్టమని అడుగుతుంది కావ్య. అబ్బాయిలు ఆస్తుల్ని అమ్మానాన్నలుగా అనుకుంటారని, కానీ ఆడపిల్లలు అమ్మానాన్నలే ఆస్తులు అనుకుంటారు.. అందుకే నాకు ఆడపిల్లలు కావాలని చెబుతాడు రాజ్.
మీ అక్క గురించి ఏం ఆలోచించారని అడుగుతుంది కావ్య. రేపు వెళ్లి తీసుకొచ్చేస్తానని అంటాడు రాజ్. అత్తయ్య గారిని ఒప్పించడం అంత ఈజీ కాదని కావ్య అనగా.. నువ్వు ఇలాంటి విషయాలు ఆలోచించొద్దని అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దని హాయిగా పడుకోమని చెబుతాడు రాజ్. మరోవైపు.. రాహుల్ తలకి టవల్ చుట్టుకుని ఏదేదో ఆలోచిస్తాడు. ఇంతలో రుద్రాణి ఏం జరిగిందని అడుగుతుంది. ఇప్పుడు నేను చూస్తున్న పనులన్ని ప్రొఫెషనల్‌గా చేస్తే ఎలా ఉంటుంది? ఎంత వస్తుందా? అని ఆలోచిస్తున్నానని చెబుతాడు. ఎవడైనా ఆకాశానికి నిచ్చెనలు వేయాలని చూస్తారు.. కానీ నువ్వేంట్రా పనివాడిలా అంట్లు తోముతానని అంటున్నావని మండిపడుతుంది రుద్రాణి.
నువ్వు అది చేస్తా.. ఇది చేస్తానని అనడం తప్పించి చేసిందేం లేదని, రాజ్‌కి గతం గుర్తొచ్చి ఇంటికి వచ్చేశాడని, ఆ కళ్యాణ్ గాడు అప్పూని ప్రెగ్నెంట్ చేసేశాడని అందరూ హ్యాపీగా ఉంటున్నారని.. ఆ స్వప్న నన్ను పనివాడిని చేసి నాతో పనులు చేయిస్తోందని మండిపడుతుంది. త్వరలోనే వాళ్లందరికి పిల్లలు పుట్టేస్తారు.. రాజ్‌కు పుట్టినవాడు వారసుడు అవుతాడని, నేను ఈ ఇంటికి పనివాడిగా మారిపోతానని రగిలిపోతాడు రాహుల్. ఈ అమ్మ ఉన్నంత వరకు నీకు అలాంటి పరిస్ధితి రానివ్వనని, నీ కూతురే ఈ ఇంటికి వారసురాలు అవుతుందని అంటుంది రుద్రాణి. కావ్య, అప్పూలకు పిల్లలు పుట్టకుండా చేస్తానని క్రూరమైన ప్లాన్ వేస్తుంది.
వినాయక చవితి కావడంతో సీతారామయ్య టిప్ టాప్‌గా రెడీ అవుతాడు. అన్ని సమస్యలు తీరిపోయి అందరూ ఆనందంగా ఉన్నారని ఇక నేను ప్రశాంతంగా కన్నుమూస్తానని సీతారామయ్య అనడంతో ఇందిర షాక్ అవుతుంది. పండగపూట అలాంటి మాటలు మాట్లాడొద్దని అంటుంది. సప్త చిరంజీవులు మాదిరిగా నేను నీ మనసులో చిరంజీవినేనని అంటాడు సీతారామయ్య. సుభాష్, ప్రకాశంలు ఇల్లంతా డెకరేషన్ చేసి అలిసిపోతారు. ఇంతలో అపర్ణ వచ్చి ఇంకా చాలా పనులు ఉన్నాయని, అన్ని పనులు మేమే చేస్తున్నామని మాకు నిద్ర వస్తుందని చెబుతాడు సుభాష్. ఎప్పుడో తెల్లవారుజామున 4 గంటలకి లేచామని ఇంకా పనులు చేస్తూనే ఉన్నామని, ఇక మా వల్ల కాదని అంటాడు ప్రకాశం.
ఇంట్లో పూజ పెట్టుకుని చిన్నపిల్లాడిలా నిద్రపోతానని అంటున్నారు.. మరి ఈ పనులన్నీ ఎవరు చేస్తారని నిలదీస్తుంది ధాన్యం. అన్ని పనులు మాతో చేయించకపోతే ఇంట్లో ఇంకా ఉన్నారు కదా అని మండిపడతాడు ప్రకాశం. ఇది పెద్దవాళ్లుగా మనం చేయిస్తున్న పూజ అని.. పనులు కూడా మనమే చేసుకోవాలని అంటుంది అపర్ణ. అయినా ఇంట్లో పనులు చేయడానికి ఖాళీగా ఎవరున్నారు? మీరు తప్ప అని సెటైర్లు వేస్తుంది. కావ్య, అప్పూలు ప్రెగ్నెంట్ అయ్యారు కదా.. కళ్యాణ్, రాజ్‌లు వాళ్లిద్దరినీ చూసుకుంటున్నారని మరి పనులు ఎవరు చూసుకుంటారని అడుగుతుంది అపర్ణ. ఇంతలో రాహుల్ రావడంతో ఆ పనులేవో వీడితో చేయించుకోమని అంటాడు ప్రకాశం. నాకు చాలా పనులు ఉన్నాయని, ఆ పనులేవో మీరే చేసుకోండి నన్ను వదిలేయండి అని అంటాడు రాహుల్.
పండగపూట కావ్యని పిలిచి గిఫ్ట్ ఇస్తామని అంటుంది అపర్ణ. వినాయక చవితి కావడంతో దుబాయ్ నుంచి మా ఫ్రెండ్‌తో ఈ నెక్లెస్ చేయించి తెప్పించానని అని అంటుంది. అది చూసి కావ్య చాలా సంతోషిస్తుంది. ఇంతకీ నచ్చిందా? నచ్చలేదా? అని అపర్ణ అడగ్గా.. అంత ప్రేమగా ఇస్తుంటే నచ్చకుండా ఎలా ఉంటుందని రుద్రాణి పంచ్‌లు వేస్తుంది. డిజైన్ బాగుందని, దీని కాస్ట్ ఎంత అని రుద్రాణి అడగ్గా.. 10 లక్షలని అపర్ణ అనడంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఇంత అర్జెంట్‌గా అంత ఖర్చు చేసి గిఫ్ట్ ఇవ్వడానికి అదేమన్నా కొత్త కోడలా ఏంటీ? అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. కావ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా అందుకే ఇస్తున్నావా? అని ప్రశ్నిస్తుంది.
అలాంటి స్వార్ధపు బుద్ధులు ఉండేది నీకేనని, నా కోడలికి ఏదైనా బహుమతి ఇవ్వాలని నా మనసుకు అనిపించింది? ఇచ్చానని అంటుంది అపర్ణ. నీకు అలాగే అనిపిస్తే స్వప్నకు కూడా ఇవ్వమని చెబుతుంది. నువ్వంటే ఈ ఇంటికి కోడలిగా వచ్చావు? మా అన్నయ్యని అడిగితే ఎంతైనా ఇస్తాడు, కానీ నేను అలా కాదుగా అని అంటుంది రుద్రాణి. మా అమ్మని లక్ష అడిగితే 2 లక్షల కారణాలు అడుగుతుందని, మేం మీ అంత అదృష్టవంతులం కాదని పంచ్‌లు వేస్తుంది. అత్తయ్య గారు ఏదో ప్రేమతో నెక్లెస్ ఇచ్చారని, దాంట్లోనూ దెబ్బిపొడుపులు వద్దని అంటుది కావ్య. పూజలో ఈ నెక్లెస్ పెట్టుకోమని కావ్యకు చెబుతుంది అపర్ణ.
వినాయక చవితి సందర్భంగా పూజారి గారు ఇంటికి రావడంతో అప్పూ జాతకం చూసి తనకు పుట్టబోయే బిడ్డ జాతకం ఎలా ఉందో చెప్పమని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. దాంతో పంతులుగారు అప్పూ చేయి చూసి పుట్టబోయే బిడ్డ జీవితం చాలా దివ్యంగా ఉందని, రాజునైనా దిక్కరించి నిలబడగలిగే మనస్తత్వమని చెప్పడంతో అంతా సంతోషిస్తారు. ముక్కుమీద కోపం ఉంటుందని, తను అనుకున్నది సాధించే వరకు ఎవ్వరినీ లెక్కచేయదని అంటారు పంతులుగారు. మీరు మాకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పమంటే మీరు మా అప్పూ గురించి చెబుతున్నారని అంటాడు కళ్యాణ్. అంటే నాకు మొండితనం, కోపం ఉన్నాయా అని అప్పూ అలుగుతుంది.
కావ్యని కూడా జాతకం చెప్పించుకోమని చెబుతుంది అపర్ణ. మీ జాతకంలో ఇద్దరు సంతానమని ఉందని, ఒకరు ఆడపిల్ల, మరొకరు మగపిల్లాడని చెబుతారు పంతులుగారు. ముందు ఎవరు పుడతారని రాజ్ అడగ్గా.. అది చెప్పడం నా వల్ల కాదని అంటారు పూజారిగారు. కావ్య గారి బిడ్డ మీ తలరాతనే మార్చేస్తుందని, ఆదిశక్తి అంశంతో పుట్టబోతున్న ఈ శిశువు.. తన శక్తిని తాను గుర్తించే వరకు అణుకువగా ఉంటుందని, తర్వాత శక్తిగా మారుతుందని చెబుతారు పంతులుగారు. పుట్టబోయే బిడ్డ తన నవ్వులతో ఇంటిని వెలిగిస్తుందని, తన మనసుతో అందరి హృదయాలను గెలుచుకుంటుందని చెబుతారు. ఆమె మరో రుద్రమదేవిలా ఉంటుందని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. నా మనవరాలి జాతకం గురించి కూడా చెప్పాలని రుద్రాణి అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











