Brahmamudi weekly roundup: కావ్య ప్రాణాలకు ముప్పు.. షాక్‌లో అప్పూ, ఆస్తి కోసం రుద్రాణి దారుణం
Photo Courtesy: JioHotstar
రాజ్, కావ్యలు కలిసిపోయి అన్యోన్యంగా ఉంటారు. అయితే యామిని కారణంగా తాను పడ్డ బాధలను భర్తకు చెప్పడంతో రాజ్ ఆవేశంగా యామిని ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇస్తాడు. దాంతో నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కనివ్వనని తల్లితో అంటుది యామిని. కావ్య, అప్పూలు ప్రెగ్నెంట్స్ కావడంతో తల్లిదండ్రులను పై అంతస్తుకి షిఫ్ట్ చేస్తారు రాజ్, కళ్యాణ్. రేవతి గురించి రాజ్‌కి చెప్పి ఆమెను ఎలాగైనా ఇంటికి తిరిగి తీసుకురావాలని అంటుంది కావ్య. అప్పూ, కావ్యల రిపోర్ట్స్ రావడంతో మీది అంతా బాగానే ఉందని, కానీ మీ అక్క గర్భసంచిలో ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్పడంతో అప్పూ, కళ్యాణ్‌లు షాక్ అవుతారు. ఇలాగే ఉంటే మీ అక్క ప్రాణాలకే ప్రమాదమని చెప్పడంతో అప్పూ కుమిలిపోతుంది. వినాయక చవితి కావడంతో రాజ్.. దేవుడి విగ్రహాన్ని స్వయంగా తయారు చేస్తాడు. కావ్య, అప్పూలకి బిడ్డలు పుడితే మన పరిస్ధితి ఏంటని రుద్రాణిని రాహుల్ అడుగుతాడు. నీ బిడ్డే ఈ ఇంటికి వారసురాలు అవుతుందని, వాళ్ల బిడ్డలను పుట్టకుండా చేస్తానని అంటుంది రుద్రాణి

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు .. 814వ ఎపిసోడ్ నుంచి 819 వరకు ఏం జరిగిందంటే?
సెప్టెంబర్ 1వ తేదీ 814వ ఎపిసోడ్‌లో..
నువ్వు నా కోసం ఎంతో చేశావని, కానీ నేను నీ కోసం ఏం చేయలేకపోయానని కావ్యతో చెబుతూ రాజ్ కుమిలిపోతాడు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు హత్తుకుని భావోద్వేగానికి గురవుతారు. ఈ జన్మలో నా చేయి వదలొద్దని కావ్య అడుగుతుంది. రాజ్‌కి గతం గుర్తు రావడం, కావ్యతో కలిసిపోవడంతో రుద్రాణి కడుపు మంటతో రగిలిపోతుంది. ఇంతలో రాహుల్ వచ్చి అడుక్కునేవాడిలా నటిస్తాడు. ఇక మనిద్దరికీ బొచ్చె కరెక్ట్ అని రాహుల్ అనగా.. నువ్వు ఈ దుగ్గిరాల వారింటికి వారసుడివని అంటుంది. అలాంటి డైలాగులు చాలా చూశానని కానీ నేను వారసుడిని ఎప్పటికి అవుతానని తల్లిని నిలదీస్తాడు రాహుల్. మెట్లు ఎక్కబోతున్న కావ్యని రాజ్ అడ్డుకుని కడుపు ఉన్న భార్యని తన చేతులతో మోసుకుంటూ పైకి తీసుకెళ్తాడు. అది చూసిన అప్పూ.. తనని కూడా అలాగే తీసుకెళ్లాలని అడగటంతో కళ్యాణ్ అలాగే చేస్తాడు.
సెప్టెంబర్ 2వ తేదీ 815వ ఎపిసోడ్‌లో..
రోజూ అప్పూ, కావ్యలను ఇలా పైకి మోసుకుంటూ వెళ్లడం కష్టమని భావించిన రాజ్, కళ్యాణ్‌లు తమ తల్లిదండ్రులనే పై అంతుస్తుకు మార్చేస్తారు. ఉదయాన్నే ధాన్యం, అపర్ణలు తమకు నిద్రపట్టలేదని ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ ఉండగా ఇందిర వచ్చి నేను హాయిగా పడుకున్నానని, యాపిల్ పండులా ఉన్నానని వాళ్లతో జోకులు వేస్తుంది. కావ్య తనకు కాఫీ కావాలని చెప్పడంతో కిచెన్‌లోకి వెళ్తాడు రాజ్. అయితే ఇంట్లో వాళ్లు ఎవరైనా చూస్తే తన పరువు పోతుందని భయపడ్డ రాజ్ తనను ఎవ్వరూ గుర్తు పట్టకుండా చీర కట్టుకుంటాడు. అదే సమయంలో ధాన్యం, అపర్ణలు కూడా కాఫీ అడగటంతో కిచెన్‌లోకి వచ్చిన ప్రకాశం.. చీరలో ఉన్నది తన ప్రియురాలు శైలజ అనుకుని వెనుక నుంచి వాటేసుకుంటాడు. వీరిద్దరిని చూసిన ధాన్యలక్ష్మీ భర్తకు క్లాస్ పీకుతుంది.

Photo Courtesy: JioHotstar
సెప్టెంబర్ 3వ తేదీ 816వ ఎపిసోడ్‌లో..
యామిని కారణంగా మీరు ఎక్కడ నాకు దూరమైపోతారోనని భయపడ్డానని రాజ్‌తో చెప్పుకుని బాధపడుతుంది కావ్య. ఆ యామిని చేసిన పనులన్నీ కావ్య చెప్పడంతో రాజ్ ఆవేశంతో ఊగిపోతాడు. ఈ రోజు ఆ యామినిని చంపేస్తానని ఆవేశంగా ఆమె ఇంటికి బయల్దేరతాడు. కావ్య భర్తని ఆపాలని అతని వెనుకాలే వెళ్తుంది. రాజ్ ఆవేశంగా వస్తుండటాన్ని వైదేహి, యామినిలు చూసి టెన్షన్ పడతారు. నా జీవితంలోకి నువ్వు రావొద్దని చెప్పాను.. అయినప్పటికీ వచ్చావ్ అంటుండగా రాజ్ పాదాలపై పడిన యామిని క్షమించమని అడుగుతుంది యామిని. కాళ్లపై పడ్డావని నిన్ను క్షమిస్తున్నానని, కానీ శ్రీశైలం వెళ్లేటప్పుడు జరిగిన యాక్సిడెంట్ నీ కుట్ర ఏమైనా ఉందని తెలిస్తే మాత్రం నిన్ను, నీ ఫ్యామిలీని వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఇకనైనా రాజ్‌ని మరిచిపోమ్మని వైదేహి చెబుతున్నా వినిపించుకోకుండా నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కనివ్వనని అంటుంది యామిని.
సెప్టెంబర్ 4వ తేదీ 817వ ఎపిసోడ్‌లో..
రేవతిని, రాజ్‌ని ఒక్కటి చేయాలని భావించిన కావ్య.. జరిగినదంతా రాజ్‌కి చెబుతుంది. వినాయక చవితి నాడు అక్కను తీసుకుని రావాలని అనుకుంటాడు. ఇక అప్పు ప్రెగ్నెన్సీ రిపోర్టు చూసిన డాక్టర్..కడుపులో బేబీ ఆరోగ్యంగా ఉందని చెప్పడంతో అనందపడిపోతారు. అంతలోనే కావ్య రిపోర్టులు నర్స్ తీసుకు రావడంతో.. వాటిని చూసి చూసి షాక్ అవుతుంది డాక్టర్. ఏమైనా ప్రాబ్లెం ఉందా? అని అప్పు అడిగితే.. ఆమె తన గర్బంలో బిడ్డను ఎక్కువ రోజులు మోయలేదు అని డాక్టర్ చెప్పడంతో అప్పు, కళ్యాణ్‌లు షాక్ అవుతారు.

Photo Courtesy: JioHotstar
సెప్టెంబర్ 5వ తేదీ 818వ ఎపిసోడ్‌లో..
కావ్య ఆరోగ్య పరిస్ధితి విన్న అప్పూ, కళ్యాణ్‌లు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పమని అడగుతారు. మీ అక్క డబిడ్డను ముందుగానే డెలివరీ చేయాలని, లేదంటే తల్లి, బిడ్డ కూడా దక్కరని హెచ్చరిస్తుంది. లేనిపక్షంలో కావ్యకి ముందే అబార్షన్ చేయాలని చెప్పడంతో అప్పూ, కళ్యాణ్‌లు బాధపడతారు. కావ్యని రాజ్ కేరింగ్‌గా చూసుకుంటూ ఉండటంతో అపర్ణ, ఇందిరలు సంతోషిస్తారు. ఇంతలో కృష్ణమూర్తి, కనకంలు వచ్చి వినాయకుడి బొమ్మ చేయడానికి కావాల్సిన మట్టి, రంగులు తీసుకొస్తారు. కావ్య.. వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తానని చెప్పపడంతో రాజ్ నేనే బొమ్మను తయారు చేస్తానని అంటాడు. దాంతో అల్లుడికి కృష్ణమూర్తి సాయం చేస్తాడు. అప్పూ, కళ్యాణ్‌లు ఇంటికి వచ్చేసరికి కావ్య, రాజ్‌లు సంతోషంగా ఉండటంతో డాక్టర్ చెప్పినది గుర్తొచ్చి వారిద్దరూ బాధపడతారు.
సెప్టెంబర్ 6వ తేదీ 819వ ఎపిసోడ్‌లో..
ఇక భార్య గర్బవతి అనే విషయంతో రాజ్ సంబరపడిపోయాడు. పాల గ్లాసుతో వచ్చి.. శ్రీమతి గారికి చక్కటి చిక్కటి పాలు అంటూ కావ్యకు అందించాడు. కావ్య పాలు తాగి ఇలా ఉన్నాయని అడిగితే.. ఇందాక మీ అమ్మ కుంకుమ పువ్వు తెచ్చింది. కుంకుమ పూల పాలు తాగితే.. నాలా ఎర్రగా బుర్రగా పుడుతారు అంటూ పాలు కలిపి ఇచ్చింది అని రాజ్ చెప్పాడు. నేను కుంకుమ పువ్వును ఎక్కువగా కలిపానని రాజ్ అన్నాడు. వినాయక చవితి కావడంతో ప్రకాశం, సుభాష్‌లు ఇళ్లంతా డెకరేట్ చేసి అలిసిపోతారు. ఇంకా చాలా పనులు ఉన్నాయని అపర్ణ, ధాన్యలక్ష్మీలు చెప్పడంతో అన్నదమ్ములిద్దరూ చేతులెత్తేస్తారు. ఇదిలా ఉండగా.. నేను పనివాడిలాగే మిగిలిపోతానని రుద్రాణితో రాహుల్ అంటాడు. దాంతో ఈ ఇంటికి నీ కూతురే వారసురాలు అవుతుంది అని కొడుకుతో అంటుంది. అప్పూ, కావ్యలకు డెలివరీ అయితే వాళ్లకు కూడా పిల్లలు పుడుతారు కదా.. అప్పుడు రాజ్ కొడుకే ఈ ఇంటికి వారసుడు అవుతాడు కదా అని రాహుల్ అంటాడు. అలా పుట్టుకుండా చేసే ఐడియా నా వద్ద ఉంది అని రుద్రాణి తన కుట్ర చెబుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











