Brahmamudi weekly roundup: రేవతి ముసుగు తీయడానికి రుద్రాణి పాట్లు.. కావ్య కోసం అప్పూ కంటతడి

Photo Courtesy: JioHotstar

రేవతిని, అపర్ణని కలపడానికి వినాయక చవితి పర్వదినాన్ని ఓ ఆయుధంగా చేసుకుంటారు రాజ్, కావ్యలు. ఇదే విషయాన్ని రేవతికి చెప్పి ఆమెకు ముసుగు వేసి ఇంటికి తీసుకొస్తారు. అందరూ ఈమె ఎవరు? అని అడగ్గా.. స్వరాజ్ తల్లి అని, వాళ్ల ఆచారం ప్రకారం బయటి వాళ్లకి ముఖం చూపించకూడదని చెబుతాడు రాజ్. కావ్య, అప్పూల ప్రెగ్నెన్సీ పొగొట్టాలని తీర్ధంలో విషం కలుపుతుంది రుద్రాణి. దీనిని కనకం, స్వరాజ్‌లు చూస్తారు.. పంతులుగారు అందరికీ తీర్ధం ఇస్తుండగా స్వరాజ్ తీర్ధం చెంబుకు తగలడంతో అది కిందపడిపోతుంది. తన ప్లాన్ ఫెయిల్ కావడంతో రుద్రాణి మరో ప్లాన్ చేస్తుంది.

తమ ఇంటికి ముసుగులో వచ్చింది రేవతి అని తెలుసుకున్న రుద్రాణి.. ఆమె ముసుగును తొలగించి అందరి ముందు బుక్ చేయాలన్ పథకం వేస్తుంది. కావ్యకి అపర్ణ ఇచ్చిన నెక్లెస్‌ని రేవతి బ్యాగ్‌లో వేస్తుంది. నెక్లెస్ కోసం కావ్య వెతగ్గా ఎంతకీ దొరకదు.. మన ఇంటికి వచ్చిన ఈ రాధే నెక్లెస్ దొంగిలించిందని బ్యాగ్ చెక్ చేయగా అందులో నెక్లెస్ ఉండకపోవడంతో ఫ్యామిలీ చీవాట్లు పెడుతుంది. ఆ నెక్లెస్‌ని స్వరాజ్ రుద్రాణి రూమ్‌లో ఉందని చెప్పడంతో అందరూ మండిపడతారు. కావ్య కడుపు నిలబడటం కష్టమని, ఆమెకు అబార్షన్ చేయాలని డాక్టర్ చెప్పడంతో అప్పూ కుమిలిపోతుంది. ఎన్ని ప్లాన్లు వేసినా రేవతి తప్పించుకోవడంతో రుద్రాణి ఈసారి గట్టి పన్నాగం పన్నుతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup September 8th to September 13th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు .. 820వ ఎపిసోడ్ నుంచి 825 వరకు ఏం జరిగిందంటే?

సెప్టెంబర్ 8వ తేదీ 820వ ఎపిసోడ్‌లో..
వినాయక చవితి సందర్భంగా రేవతిని ముసుగు వేసి ఇంట్లోకి తీసుకొస్తారు రాజ్, కావ్య. ఈమె స్వరాజ్ వాళ్ల అమ్మగారు రాధ అని అందరికీ పరిచయం చేస్తారు. వాళ్ల ఆచారం ప్రకారం భర్తకు, పిల్లలకు తప్పించి బయటివాళ్లకు ముఖం చూపించకూడదని స్టోరీ చెబుతాడు రాజ్. కానీ రుద్రాణికి మాత్రం ఎక్కడో తేడా కొడుతుందని అనుమానం వస్తుంది. రాధను అడిగే ప్రశ్నలకు రాజ్ సమాధానం చెబుతుండటంతో అది ఇంకా డబుల్ అవుతుంది. రాధ వయసు ఎక్కడో విన్నట్లుగా ఉందని కొడుకుతో అంటుంది రుద్రాణి. అటు రేవతిని ముసుగు వేసి తీసుకువచ్చిన విషయం తెలుసుకున్న ఇందిర.. కావ్య, రాజ్‌లపై రగిలిపోతుంది. మీ అమ్మకి కనుక ఈ విషయం తెలిస్తే ఈసారి ఇంకెంత గొడవ అవుతుందోనని భయపడుతుంది. ఏం కాకుండా నేను చూసుకుంటానని మీరు భయపడొద్దని చెబుతాడు రాజ్.

సెప్టెంబర్ 9వ తేదీ 821వ ఎపిసోడ్‌లో..
రేవతిని ఇంటికి తీసుకొచ్చిన రాజ్ నువ్వు ఎవ్వరికీ దొరక్కుండా నేను చూసుకుంటానని చెబుతాడు. ముసుగు వేసుకొచ్చిన రేవతిని రాధా అని పిలుస్తుంది కావ్య. దాంతో తనని కాదేమోనని రేవతి దిక్కులు చూస్తుంది. ఆ వెంటనే ఆమె కాలు తొక్కిన కావ్య సైగలు చేసి మాట్లాడమని అంటుంది. స్వరాజ్‌ని చూడాలని అపర్ణ తహతహలాడిపోతుంది. ఇంటికి గెస్టులు వస్తే చూసుకోవా? అని అమ్మమ్మ మీద అలుగుతాడు పిల్లాడు. నేను నీ ఫ్రెండ్‌ని కాదు, ఈ ఇంటికి వారసుడినని స్వరాజ్ చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది. వీడు ఎవరో కనిపెట్టాల్సిందేనని, ఎప్పుడూ లేనిది వీడు ఇలా మాట్లాడుతున్నాడేంటీ అని అనుకుంటుంది. అందరినీ పిలిచి ఈ స్వరాజ్.. మన ఇంటికి వారసుడు అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. వీడు వారసుడేంటీ అంటూ రుద్రాణి మండిపడుతుంది. రాజ్, రాహుల్, కళ్యాణ్‌, రేవతి పిల్లలకే ఈ ఇంటికి వారసులయ్యే హక్కు ఉందని అంటుంది అపర్ణ. రేవతి ముసుగులో వచ్చిందని ఆమె ముసుగును రుద్రాణి తీయబోతుండగా అందరూ మండిపడతారు. నాకు జ్యూస్ తీసుకురమ్మని రుద్రాణికి ఆర్డర్స్ వేస్తాడు స్వరాజ్. ఇంతలో ఇంటికి వచ్చింది రేవతి అని కనకం తెలుసుకుంటుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup September 8th to September 13th episode Story

Photo Courtesy: JioHotstar

సెప్టెంబర్ 10వ తేదీ 822వ ఎపిసోడ్‌లో..
కావ్య, అప్పూల ప్రెగ్నెన్సీ పొగొట్టడానికి తీర్ధంలో విషం కలుపుతుంది రుద్రాణి. ఈ ఇంటికి నా మనవరాలే వారసురాలు అవుతుందని మనసులో అనుకుంటుంది. రాజ్ తన సోదరులతో కలిసి గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్టిస్తాడు. దూరంగా నిలబడిన రేవతిని చూసి దగ్గరికి రమ్మని పిలుస్తాడు రాజ్. దేవుడి దగ్గర స్వరాజ్ చాలాసేపు దండం పెట్టుకోవడంతో ఏం కోరుకున్నావని అడుగుతుంది అపర్ణ. నేను జీవితాంతం ఈ ఇంట్లోనే ఉండేలా చేయమని కోరుకున్నానని చెబుతాడు పిల్లాడు. ఆ మాటలతో అపర్ణ, రేవతిలు ఎమోషనల్ అవుతారు. ఈ ఇంట్లో ఏదో జరుగుతోందని.. అదేంటో కనిపెడతానని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. ఇంతకీ విషయం కలిపావా? లేదా? రాహుల్ అడగ్గా.. ఎప్పుడో కలిపేశానని అది వాళ్ల కడుపులో వెళ్లగానే మనం అనుకున్నది జరుగుతుందని చెబుతుంది రుద్రాణి. కావ్య తీర్ధం తీసుకునే సమయానికి స్వరాజ్ వచ్చి తీర్ధం చెంబును కింద పడేయటంతో రుద్రాణి కోపంతో ఊగిపోతుంది. పూజారితో పాటు ఏ విఘ్నాన్ని ఆపడానికి స్వరాజ్‌తో ఆ దేవుడు ఈ పనిచేయించాడోనని కనకం అంటుంది.

సెప్టెంబర్ 11వ తేదీ 823వ ఎపిసోడ్‌లో..
వినాయకచవితి పూజ ముగిసిన తర్వాత భార్యతో సరసాలు ఆడుతూ ఇందిరకు దొరికిపోతాడు రాజ్. ఇంకో 9 నెలలు పూర్తయితే నీ కడుపులో పిల్లాడు బయటికొచ్చి అల్లరి చేస్తాడని ఇందిర చెప్పడంతో ఆ మాటలు విన్న అప్పూ బాధపడుతుంది. మీ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకేసారి తల్లి కాబోతున్నారని అంటుంది ఇందిర. ఇంతలో కావ్యకి వచ్చిన ఫోన్‌ని అప్పూ లిఫ్ట్ చేయగా.. మీ అక్క తన కడుపులో బిడ్డను మోయలేదని అబార్షన్ చేయక తప్పదని చెబుతుంది. ఆ మాటలతో అప్పూ కుమిలిపోతుంది. రేవతి తన భర్త జగదీష్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా రుద్రాణి విని షాక్ అవుతుంది. రేవతి ముసుగు తీసేస్తానని ప్లాన్ చేస్తుంది. ఆ వెంటనే కావ్య గదిలోకి వెళ్లి ఆమె నెక్లెస్‌ను తీసుకెళ్లి రేవతి బ్యాగ్‌లో వేస్తుంది. ఆమె వెనకాలే స్వరాజ్, కనకంలు కూడా వెళ్తారు.

Brahmamudi Telugu Serial Weekly roundup September 8th to September 13th episode Story

Photo Courtesy: JioHotstar

సెప్టెంబర్ 12వ తేదీ 824వ ఎపిసోడ్‌లో..
అత్తగారు నెక్లెస్ వేసుకుని పూజ గదిలోకి రమ్మని చెప్పడంతో కావ్య తన గదిలోకి వెళ్లి చూడగా అక్కడ నెక్లెస్ కనిపించదు. నెక్లెస్ పోయిన విషయాన్ని కావ్య చెప్పగా అందరూ షాక్ అవుతారు. ఇంట్లో వాళ్లు ఎవ్వరూ తీయనప్పుడు బయటివాళ్లే దొంగతనం చేసుంటారని పని మనిషి రత్తాల్ని నిలదీస్తుంది రుద్రాణి. ఆమె ఎదురు సమాధానం చెప్పడంతో నోరు మూసుకుంటుంది. అయితే ఈ ఇంటికొచ్చిన రాధగారే నెక్లెస్ తీసుంటారని చెప్పడంతో రాజ్, కావ్య, ఇందిరలు రుద్రాణిపై మండిపడతారు. నెక్లెస్ పోయినా పర్లేదని కానీ అక్కని అవమానిస్తే ఊరుకోనని రాజ్ వార్నింగ్ ఇస్తాడు. అయినా వినిపించుకోకుండా రాధ బ్యాగ్ చెక్ చేస్తుంది రుద్రాణి. అందులో నెక్లెస్ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో అక్కడికి స్వరాజ్ వచ్చి.. నెక్లెస్ ఎక్కడుందో నేను చూపిస్తానని అపర్ణని రుద్రాణి గదిలోకి తీసుకెళ్తాడు. రుద్రాణి రూమ్‌లో నెక్లెస్ కనిపించడంతో అపర్ణ షాకై.. రుద్రాణికి క్లాస్ పీకుతుంది. తన ప్లాన్ ఫెయిల్ కావడంతో కొడుకుతో కలిసి మరో కుట్ర చేస్తుంది రుద్రాణి

సెప్టెంబర్ 13వ తేదీ 825వ ఎపిసోడ్‌లో..
స్వరాజ్‌ను ఇంట్లో వాళ్లంతా గారాభంగా చూసుకుంటూ ఉండటంతో రేవతి కంటతడి పెడుతుంది. ఆమెను ఓదార్చి తిరిగి ఇంట్లోకి తీసుకొస్తారు రాజ్, కావ్య. రేవతి ముసుగు తీయాలనుకున్న రుద్రాణి.. ఆమె ముఖంపై నీళ్లతో కొడుతుంది. ముసుగు తడిచిపోయిందని తీసేసి తినమని బలవంతం చేస్తుంది రుద్రాణి. దాంతో అందరూ ఆమెకు చీవాట్లు పెడతాడు. భోజనాలు ముగిశాక రుద్రాణి మరో ప్లాన్ వేసి అందరితో డ్యాన్స్‌లు చేయించాలని అనుకుంటుంది. చిట్టీలు వేసి ఎవరికి ఏం వస్తే అది చేయాలని చెబుతుంది. ముందు సీతారామయ్యకు చిట్టీ రావడంతో ఆయన భారీ డైలాగ్‌తో అందరినీ ఆకట్టుకుంటాడు. ఆ తర్వాత స్వప్న, రాహుల్‌లు ఓ పాటకు డ్యాన్స్ చేస్తారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X