For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: బిగ్ బాస్‌లో కలకలం.. ఆ కంటెస్టెంట్ నిరాహార దీక్ష.. ఏం అవుతుందో అని టెన్షన్

  |

  తెలుగు బుల్లితెరపై వినూత్నమైన కాస్పెప్టుతో పరిచయమైనా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకోవడంలో విజయం సాధించి నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ షో ఇప్పటికే తెలుగులో ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నిర్వహకులు ఆరో సీజన్‌ను కూడా మొదలెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను చూపిస్తూ ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఇక, ఇందులోకి వచ్చిన ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిసింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  మరింత కొత్తగా.. రేటింగ్ రావట్లేదు

  మరింత కొత్తగా.. రేటింగ్ రావట్లేదు

  తెలుగులో బిగ్ బాస్ షోకు ఆదరణ క్రమంగా పెరుగుతూనే ఉంది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను మొదలు పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో దాన్ని తీసుకొచ్చారు. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను చూపించినా.. దీనికి ఆశించిన రీతిలో రేటింగ్ రావట్లేదనే చెప్పాలి.

  విడిపోయినా సమంతతోనే నాగ చైతన్య: పక్కన లేకున్నా ఆ పని మాత్రం ఆపట్లేదట

  టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా చంటి

  టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా చంటి

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో ఎనలేని క్రేజ్‌ను దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. వారిలో జబర్ధస్త్ కమెడియన్ కమ్ యాక్టర్ చలాకీ చంటి ఒకడు. కమెడియన్‌గా ఫుల్ ఫేమస్ అయిన అతడికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండడమే దీనికి కారణం.

  మంచి పేరు.. అలాగే కంటిన్యూగా

  మంచి పేరు.. అలాగే కంటిన్యూగా


  బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే చలాకీ చంటి తన మార్కు చూపించే ప్రయత్నాలు మాత్రం చేయలేకపోతోన్నాడు. ముఖ్యంగా షోలో ఇచ్చే టాస్కుల్లో అంత యాక్టివ్‌గా కూడా పాల్గొనడం లేదు. అలాగే, పెద్దగా ఎవరితోనూ గొడవలు పడడం లేదు. దీంతో చంటికి సౌమ్యుడిగా పేరు వచ్చింది. అదే కంటిన్యూ చేస్తూ వివాదరహితుడిగా కనిపిస్తున్నాడు.

  కాజల్ అగర్వాల్ ఎద అందాల ప్రదర్శన: తల్లైన తర్వాత ఫస్ట్ టైం ఇంత ఘాటుగా!

  టాస్క్‌లో ఫ్లాప్.. కెప్టెన్సీకి దూరం

  టాస్క్‌లో ఫ్లాప్.. కెప్టెన్సీకి దూరం


  బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో ఏదో ఒక కంటెస్టెంట్‌కు సీక్రెట్ టాస్కును ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. దీన్ని చాలా మంది మంచిగా వాడుకుని తమ సత్తాను నిరూపించుకుంటూ ఉంటారు. అయితే, ఈ సీజన్‌లో మాత్రం చలాకీ చంటికి నాలుగో వారంలోనే ఈ అవకాశం వచ్చినా అతడు విఫలం అయ్యాడు. దీంతో ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ అయ్యే అర్హతను కోల్పోవాల్సి వచ్చింది.

  గీతూతో గొడవ.. త్యాగం చేసేశాడు

  గీతూతో గొడవ.. త్యాగం చేసేశాడు


  గత నామినేషన్స్ టాస్క్ సమయంలో గీతూ రాయల్‌కు, చలాకీ చంటికి గొడవ జరిగింది. దీంతో ఆమె అతడిపై కొన్ని కామెంట్లు చేసింది. అంతేకాదు, కీర్తిని కామెంట్ చేశాడని కూడా చెప్పింది. దీంతో చాలా గొడవలు జరిగాయి. ఇందులో గీతూదే తప్పు అని నాగార్జున తేల్చేశాడు. అయితే, గత నామినేషన్స్‌లో చంటీ.. ఆమె కోసం త్యాగం చేశాడు. ఫలితంగా ఈ వారం నామినేట్ అయ్యాడు.

  లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!

  మూడు రోజులుగా తినని చంటి

  మూడు రోజులుగా తినని చంటి


  బిగ్ బాస్ హౌస్‌లో సాధారణంగా కంటెస్టెంట్లకు ఫుడ్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది దొంగతనంగా కూడా లాగించేస్తూ ఉంటారు. అయితే, చలాకీ చంటి మాత్రం దాదాపు మూడు రోజులుగా హౌస్‌లో ఏమీ తినడం లేదట. ఈ విషయాన్ని కొందరు కంటెస్టెంట్లు మాట్లాడుకోవడంతో ఇది బయటకు వచ్చింది. ఆ తర్వాత కొందరు బ్రతిమాలినా అతడు తినలేదు.

  ఆ బెంగతోనే అన్నం మానేశాడు

  ఆ బెంగతోనే అన్నం మానేశాడు


  తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో చలాకి చంటి అన్నం తినకుండా ఉన్న విషయం తెలుసుకుని బాలాదిత్య అతడి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో తినాలని అనిపించడం లేదన్న అతడు.. ఈ వారం తానే ఎలిమినేట్ అవుతానని అన్నాడు. అందుకే తినాలనిపించడం లేదని చెప్పాడు. అయితే, అతడికి ఏమవుతుందో అని హౌస్‌లోని కంటెంస్టెంట్లు అందరూ టెన్షన్ పడుతున్నారు.

  English summary
  Bigg Boss Telugu Telugu 6th Season Running Successfully. Chalaki Chanti Doing Hunger Strike in The House.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X