బిగ్‌బాస్‌లోకి చిన్నారి పెళ్లికూతురు నటి.. నిర్వాహకుల బంఫర్ ఆఫర్.. షో ఎప్పుడంటే!
కరోనావైరస్ పరిస్థితులు ఎలా ఉన్నా టెలివిజన్‌పై బిగ్‌బాస్ షోలు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతున్నాయి. ఇటీవల మలయాళ బిగ్‌బాస్ కరోనావైరస్ కారణంగా అర్ధాంతరంగా ఆపేసినా.. హిందీ బిగ్‌బాస్ షోను ప్రసారం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షోకు సంబంధించి మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే..

బిగ్‌బాస్ 15కు ముమ్మర ఏర్పాట్లు
కొద్ది నెలల క్రితమే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్ హిందీ 14 ముగిసింది. అయితే అలా ముగిసిందో లేదో 15వ సీజన్‌కు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావొస్తున్నట్టు సమాచారం. పలువురు సెలబ్రిటీలను ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తున్నది.

ఇప్పటికే సెలబ్రిటీల ఆడిషన్స్ పూర్తి
బాలీవుడ్ మీడియా పేర్కొన్న ప్రకారం.. బిగ్‌బాస్‌లో పాల్గొనే సెలబ్రిటీలకు సంబంధించిన ఆడిషన్స్ పూర్తయ్యాయి. ఫిబ్రవరి 22 నుంచి మే 31, 2021 వరకు ఆడిషన్స్ ముగిసాయి. అయితే పరిస్థితులను బట్టి ఆడిషన్స్ సమయాన్ని పొడిగించడానికి అవకాశం ఉంది అంటూ నిర్వాహకులు తెలిపారు.

చిన్నారి పెళ్లికూతురు ఫేమ్‌కు ఆఫర్
బిగ్‌బాస్ సెలబ్రిటీల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ చిన్నారి పెళ్లికూతురు (హిందీలో బాలికా వధు) ఫేమ్ నేహా మర్దా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బిగ్‌బాస్‌లో పాల్గొనాలని మంచి ఆఫర్ ఇచ్చారు అని తెలిపారు. గత నాలుగేళ్లుగా నాతో నిర్వాహకులు సంప్రదిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల నేను వారి ఆఫర్ అంగీకరించలేదు అని నేహ మర్దా పేర్కొన్నారు.

బిగ్‌బాస్ ఫార్మాట్ నాకు పడదు
తాజాగా బిగ్‌బాస్ 15 కోసం కూడా నన్న సంప్రదించారు. కానీ ఒక గదిలో లాక్ చేసి జీవితాన్ని కొనసాగించడమనేది నాతో కాదు. ఇలాంటి షోలో నేను ఉండలేను. బిగ్‌బాస్ ఫార్మాట్ నాకు సరిపడదు. అయితే ప్రస్తుతం టీవీ షూటింగులు కూడా బిగ్‌బాస్ ఫార్మాట్‌లో కొనసాగుతున్నాయి అంటూ నేహా మర్దా తెలిపారు.
Recommended Video

బిగ్‌బాస్ విజేతను అవుతా
కరోనావైరస్ పరిస్థితుల్లో జరుగుతున్న టీవీ షూటింగులను బట్టి చూస్తే బిగ్‌బాస్‌లో ఉండటం అంత కష్టం ఏమీ కాదేమో. ఒకవేళ నేను బిగ్‌బాస్‌లోకి వెళితే విజేతను నేనే అవుతాననే నమ్మకం కలుగుతున్నది. బిగ్‌బాస్‌లో పాల్గొనే సెలబ్రిటీలకు గట్టిపోటీ ఇస్తాను అంటూ నేహా మర్దా అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











