Don't Miss!
- Finance
UPI: రికార్డు స్థాయిలో UPI వినియోగం.. మొత్తం లావాదేవీల్లో UPI వాటా ఎంతంటే..
- Sports
Team India : టీమిండియా పేసర్లు టార్గెట్‌గా ట్రోలింగ్.. వీడియో వైరల్!
- News
టీడీపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్; ఆ సవాల్ తో నంద్యాలలో టెన్షన్!!
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Chiranjeevi: సురేఖ అంటే భయం.. ఈరోజు వస్తుందనుకోలేదంటూ చిరంజీవి షాకింగ్ కామెంట్స్!
చిరంజీవి అంటేనే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక మెగాస్టార్ గా ఎదిగిన హీరో. నేటితరం యువ హీరోలెందరికో ఒక స్ఫూర్తి. స్వయంకృషితో మెగాస్టార్ గా మారిన చిరంజీవి అనేక చిత్రాలతో తన వైవిధ్యమైన నటన చూపిస్తూ తెలుగు సినీ ప్రేక్షకులందరికీ బాస్ గా మారి అందరివాడు అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్యగా మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టార్ యాంకర్ సుమతో కలిసి బుల్లితెరపై సందడి చేశారు.
Pic Courtesy: Mallemala TV YouTube

బాబీ దర్శకత్వంలో తొలిసారిగా..
బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో వాల్తేరు వీరయ్యగా మాస్ అవతారంతో చిరంజీవి కనిపించగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజా రవితేజ అలరించనున్నాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో వాల్తేరు వీరయ్యపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

సంక్రాంతి కానుకగా..
అభిమానుల అంచనాలకు తగినట్లుగానే వాల్తేరు వీరయ్యను పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా కోసం చిరంజీవి పడిన కష్టమంతా ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ లో కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి - మాస్ హీరో రవితేజ కలయికలో తెరకెక్కిన 'వాల్తేరు వీరయ్య' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి.

ప్రమోషన్స్ వేగవంతం..
ఇటీవల ఫైనల్ కాపీని కూడా వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ చూసేసింది. ఇక, ఈ మూవీ 2 గంటల 40 నిమిషాల నిడివితో రిలీజ్ కాబోతుంది. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకల లేటెస్ట్ షో సుమ అడ్డాకు వాల్తేరు వీరయ్య చిత్రబృందం హాజరైంది.

సుమ అడ్డాలో చిరంజీవి సందడి..
సుమ అడ్డా షోకి డైరెక్టర్ బాబీ, కమెడియన్ వెన్నెల కిశోర్ తో పాటు చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత లేడీ కమెడియన్ ఒకరు చిరంజీవి చేతి రేఖలను చూస్తూ రేఖలో మీకు ఏ రేఖ భయం అని ఆమె అడగ్గా.. సురేఖ అని చెప్పబోయి ఆగిపోయారు చిరు. దీంతో బామ్మ ఆయన లక్ష్మణ రేఖను అయిన దాటుతారేమో కానీ సురేఖను దాటరే అని సుమ అంది. తర్వాత ఏదో స్కిట్ లో భాగంగా చిరంజీవి డాక్టర్ గా చేశారు. ఆడియెన్స్ లో ఒకరు వచ్చి.. డాక్టర్ గారు తిని తిని బాగా పొట్ట వస్తుందండి.. ఏం చేయమంటారు అని అడిగితే.. 9 నెలల తర్వాత రండి తీసేస్తాను అని నవ్వించారు చిరంజీవి.

ఇలాంటి ఒకరోజు వస్తుందని..
చూడాలని ఉంది సినిమాలో అంజలి జవేరిని చిరంజీవి చూసే సీన్ ను రీక్రియేట్ చేద్దామని సుమ అంటుంది. అందులో అంజలి జవెరీగా నేను అని సుమ అనగానే.. ఇలాంటి ఒక రోజు వస్తుందని జీవితంలో కూడా ఊహించలేదు అని కౌంటర్ వేశారు చిరంజీవి. దీంతో సుమతో పాటు అందరూ తెగ నవ్వేశారు. కాసేపు సుమ పేరు మారుద్దామని చెప్పి సురేఖగా మార్చారు చిరంజీవి. తర్వాత నా కళ్లద్దాలు ఇవ్వవా కనపడటం లేదు అని మరోసారి నవ్వించారు చిరు.

సుమ అడ్డా లోడింగ్..
ఏ.. రే.. అంటూ సుమను చిరంజీవి పిలుస్తారు. అప్పుడు సుమ చిరంజీవివైపు తిరుగుతుంది. చిరును చూసిన సుమ ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. దీంతో వెంటనే లేచిన చిరంజీవి అంధుడిగా నటిస్తాడు. ఇలా ఆద్యంతం షోలో చిరంజీవి నవ్వించినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో చివరిగా డోంట్ స్టాప్ లాఫింగ్.. సుమ అడ్డా లోడింగ్.. అని చిరంజీవి వాల్తేరు వీరయ్య డైలాగ్ చెప్పారు. ఈ పూర్తి ఎపిసోడ్ ను జనవరి 14న ప్రసారం చేయనున్నారు.