Just In
- 16 min ago
విజయ్ దేవరకొండకు బీర్లతో అభిషేకాలు.. అభిమానుల పిచ్చి మామూలుగా లేదు
- 1 hr ago
మాస్ రాజాను తక్కువ అంచనా వేశారు.. క్రాక్‌తో బడా ప్రొడ్యూసర్స్ మైండ్ బ్లాక్
- 2 hrs ago
సలార్ సినిమా కోసం రెండు నెలలు కష్టపడితే చాలట
- 2 hrs ago
Alludu adhurs Box office: 4వ రోజు కలెక్షన్స్.. బెల్లంకొండ శ్రీనివాస్ లెక్క ఎంతవరకు వచ్చిందంటే..
Don't Miss!
- Finance
మాల్యా అప్పగింత అప్పుడే కుదరదు, కేంద్రం ఏం చెప్పిందంటే
- News
ప.గో జిల్లాలో మళ్లీ వింత వ్యాధి.. 10 మందికి అనారోగ్యం, గతనెలలో వందలాది మంది..
- Sports
కేటీఆర్‌ను కలిసిన హనుమ విహారి!
- Automobiles
హోండా గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సోహెల్‌కు చిరంజీవి భార్య ఊహించని గిఫ్ట్: సురేఖ నీకోసం పంపిందని వీడియో చూపించడంతో!
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన గ్రాండ్ ఫినాలే పూర్తయిపోయింది. 105 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆదివారంతో ముగిసింది. ఫినాలేకు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలి పంచులు, ప్రాసలతో ఆకట్టుకున్నారు. ప్రత్యేకమైన మేనరిజంతో అందరి హృదయాలను కొల్లగొట్టారు. అంతేకాదు, ఈ ఎపిసోడ్‌లో సయ్యద్ సోహెల్ రియాన్‌పై ఆయన బాగా ఫోకస్ చేసినట్లు అనిపించింది. అంతేకాదు తన భార్య సురేఖ.. అతడి కోసం గిఫ్ట్ పంపారని చెప్పి షాకిచ్చారు చిరంజీవి. దీనికి అతడు భావోద్వేగానికి లోనయ్యాడు ఆ వివరాలు మీకోసం!

అంగరంగ వైభవంగా సాగిన గ్రాండ్ ఫినాలే
బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఎపిసోడ్‌ను కూడా అక్కినేని నాగార్జున తనదైన శైలిలో హోస్ట్ చేశారు. మాజీ కంటెస్టెంట్లు అందరూ దీనికి హాజరవడంతో పాటు డ్యాన్స్ కూడా చేశారు. ఆ తర్వాత హీరోయిన్లు లక్ష్మీ రాయ్, మెహ్రీన్, ప్రణీత డ్యాన్స్, థమన్ మ్యూజిక్ కాన్సర్ట్, అనిల్ రావిపూడి కామెడీతో ఎపిసోడ్ సందడిగా సాగింది.

అందరూ అనుకున్నట్లుగా.. అభిజీత్ విన్
బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్ విషయంలో మొదటి నుంచీ అనుకున్నట్లుగానే ఫలితం వచ్చింది. అందరూ అనుకున్నట్లుగానే ఈ సీజన్‌ను వివాదరహితుడిగా పేరొందిన యంగ్ హీరో, మిస్టర్ కామ్ అండ్ కూల్ అభిజీత్ గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫినాలే ఎపిసోడ్‌లో నాగార్జున విన్నర్‌ను ప్రకటించగా... ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి అతడికి ట్రోఫీని అందజేశారు.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మెగాస్టార్ చిరు
గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. వన్ మ్యాన్ షోతో అలరించారు. ఇండస్ట్రీకి బిగ్ బాస్ అంటూ వచ్చిన ఆయన.. ఓ గ్రేస్ మూమెంట్ వేసి జోష్‌గా కనిపించారు. ఆ తర్వాత కంటెస్టెంట్లు అందరిపై తన అభిప్రాయం చెప్పి ఆకట్టుకున్నారు. అంతేకాదు, అద్భుతమైన టైమింగ్‌తో పంచులు వేస్తూ ఔరా అనిపించారు. మొత్తానికి ఆయన హైలైట్ అయ్యారు.

సోహెల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడుగా
ఈ సీజన్‌లో సెకెండ్ రన్నరప్‌గా నిలిచాడు సయ్యద్ సోహెల్ రియాన్. బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు ఒప్పుకున్న అతడు టాప్ -3 నుంచి తప్పుకున్నాడు. అంతేకాదు, తనకొచ్చిన డబ్బుల్లో రూ. 10 లక్షలు అనాథలకు ఇస్తానని ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని నాగ్... చిరుకు వివరించాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు మెగాస్టార్.

సోహెల్‌కు చిరంజీవి భార్య ఊహించని గిఫ్ట్
సయ్యద్ సోహెల్ రియాన్ గురించి తనకు చాలా విషయాలు తెలుసని చెప్పి షాకిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ నేపథ్యంలోనే తన ఫ్యామిలీ మెంబర్లు కూడా తరచూ అతడి గురించే మాట్లాడుకుంటారని వెల్లడించారు. సోహెల్ ఫినాలేకు చేరినందుకు సంతోషించామని చెప్పారు. అదే సమయంలో తన భార్య అతడి కోసం ఓ గిఫ్ట్ పంపిందని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

సురేఖ పంపిందని వీడియో చూపించడంతో
బిగ్ బాస్ హౌస్‌లో సోహెల్ తరచూ మటన్ కావాలని అంటుండే వాడు. దీన్ని గమనించిన చిరంజీవి భార్య సురేఖ.. అతడి కోసం మటన్ బిర్యానీ చేసి పంపించారు. దీన్ని మెగాస్టారే స్వయంగా అతడి కోసం తీసుకొచ్చారు. అంతేకాదు, దీనికి సంబంధించిన వీడియోను సైతం ప్లే చేయించారు. దీంతో ఆనందం పట్టలేకపోయిన సోహెల్.. గట్టిగా అరుస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.