Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9లోకి కొరియోగ్రాఫర్ గ్రాండ్ ఎంట్రీ.. ఆ ఒక్క రీజన్‌తోనే హౌజ్‌లోకి వచ్చా
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఎట్టకేళకు ప్రారంభం అయ్యింది. బిగ్ బాస్ అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 5న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచింగ్ ఘనంగా జరిగింది. హౌజ్ లోకి ఇప్పటికే ఎంపిక చేసిన సెలబ్రెటీ కంటెస్టెంట్స్, అలాగే కామనర్స్ కూడా ఉండటం విశేషం. వీరిలో (నెంబర్) ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ శ్రేష్టి వర్మ కూడా ఉండటం విశేషం.
ఇండియన్ డాన్స్ మాస్టర్, ట్రెడిషనల్ డాన్సర్, నటి శ్రేష్టి వర్మ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక శ్రేష్టి వర్మ ఢీ వంటి షోల నుంచే ప్రేక్షకులను తన డాన్స్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో డాన్సర్ గా, ఫిమేల్ కొరియోగ్రాఫర్ గా కొన్నాళ్లుగా పనిచేస్తున్నారు. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర ఆమె చాలా కాలం పని చేశారు. రంగస్థలం, పుష్ప, గేమ్ చేంజర్ వంటి భారీ చిత్రాలకు జానీ మాస్టర్ తో కలిసి కొరియోగ్రఫీ అందించింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవ మొదలై, అది కాస్త కేసుల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత నుంచి శ్రేష్టి వర్మ తన సొంతంగానే కొరియోగ్రఫీ అందిస్తూ వస్తుంది. ఈ క్రమంలో పలు ఇంట్రెస్టింగ్ సినిమాలకు శ్రేష్టి వర్మ పనిచేశారు. 2024లో మనవి, 2025 లో కన్నడ చిత్రం సీతా పయనం వంటి సినిమాలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించి ప్రశంసలు అందుకుంది. తెలుగులో విష్ణుప్రియ నటించిన కంగులు అనే ప్రైవేట్ ఆల్బమ్ కు కూడా శ్రేష్టి వర్మనే కొరియోగ్రఫీ అందించడం విశేషం. ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
శ్రేష్టి వర్మ తెలుగు చిత్ర పరిశ్రమలో మొన్నటి వరకు సంచలనంగా మారింది. జానీ మాస్టర్ తో వివాదం తర్వాత ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది. ఇక ఈ బ్యూటీఫుల్ కొరియోగ్రఫర్ బిగ్ బాస్ హౌజ్ లోకి 9వ సీజన్ లో సెలెబ్రెటీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక తన డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో దుమ్ములేపింది. ఆ తర్వాత హోస్ట్ నాగార్జునను వద్దకు వెళ్లింది. ఈ సందర్భంగా నాగార్జున శ్రేష్టి వర్మకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక నువ్వు అసలు ఎందుకు బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లాలని అనుకుంటున్నావని అడిగాడు. అందుకు ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.
తన జీవితంలో ఏదైనా సాధించాలని పట్టుదలతో ఉంటానని చెప్పింది. ఇక రీసెంట్ టైమ్స్ లో తనపై పడిన ఒక ముద్రను తొలిగించుకునేందుకు షోకు వచ్చానని, తన గురించి పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు కూడా తెలియాల్సి ఉందని చెప్పింది. అయితే తనకు ముసుకులో ఉండటం అస్సలు నచ్చదని చెప్పింది. హౌజ్ లోకి వెళ్లిన తర్వాత తన రియాలిటీని చూపించాలని అనుకుంటున్నానని అన్నారు. అక్కడైతే ఎన్ని రోజులని నటించలేం కదా సార్ అని చెప్పింది. ఆ తర్వాత నాగార్జున ఐకానిక్ స్టెప్స్ లు వేసింది. దాంతో నాగార్జున తను హౌజ్ నుంచి బయటికి వచ్చాక మనం ఒక సాంగ్ చేద్దామని ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











