»   » డబ్బులిస్తేనే ‘జబర్దస్త్’లో అవకాశాలా? తెర వెనక ఆ శక్తులు ఎవరు?

డబ్బులిస్తేనే ‘జబర్దస్త్’లో అవకాశాలా? తెర వెనక ఆ శక్తులు ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
‘జబర్దస్త్’లో డబ్బులిస్తేనే..!

తెలుగు టీవీ రంగంలో 'జబర్దస్త్' కామెడీ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటు, ఈ షోలో పాల్గొన్న ఆర్టిస్టులకు సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చిపెడుతోంది ఈ కామెడీ షో. ఈ షో ద్వారా పాపులర్ అయిన పలువురు కమెడియన్స్ ఆ తర్వాత వరుస సినిమాల్లో బిజీ అయిపోయారు. దీంతో సినిమా రంగంలోకి కమెడియన్‌గా అడుగు పెట్టాలనుకునే కళకారులు జబర్దస్త్ వైపు చూస్తున్నారు.

 డబ్బులు గుంజుతున్న మోసగాళ్లు

డబ్బులు గుంజుతున్న మోసగాళ్లు

అయితే చాలా మంది ‘జబర్దస్త్'లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండటంతో ఇండస్ట్రీకి చెందిన కొందరు.... తమకు డబ్బులిస్తే జబర్దస్త్ లో అవకాశాలు ఇప్పిస్తామని అమాయకులను మోసం చేస్తున్నారట. ఇప్పటికే చాలా మంది ఇలా మోస పోయినట్లు సమాచారం.

 ఎవరికీ చెప్పుకోలేక

ఎవరికీ చెప్పుకోలేక

అవకాశాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పే కేడీగాళ్ల వలలో పడిన వారు ఎవరికీ చెప్పుకోలేక అకాశాల కోసం వారి చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.

 కొన్ని శక్తులున్న మాట నిజమే: జబర్దస్త్ నవీన్

కొన్ని శక్తులున్న మాట నిజమే: జబర్దస్త్ నవీన్

జబర్దస్త్ షోలో అవకాశాల కోసం డబ్బులు తీసుకుంటున్నారనే వార్తలపై.... జబర్దస్త్ నవీన్ స్పందించారు. జబర్దస్త్ గోడ అవతల కొన్ని శక్తులున్న మాట నిజమే అని, డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారనే వార్తలు తాను కూడా విన్నానని, అయితే జబర్దస్త్ కార్యక్రమాన్ని నిర్మిస్తున్న మల్లెమాల సంస్థకు, వారికి ఎలాంటి సంబంధం లేదని... వారి వలలో పడి మోసపోవద్దని సూచించారు.

 టాలెంటుతోనే అవకాశాలు

టాలెంటుతోనే అవకాశాలు

‘జబర్దస్త్'లో అవకాశాలు కేవలం టాలెంటుతో మాత్రమే వస్తాయని, నిజంగా మీలో ప్రేక్షకులను మెప్పించే టాలెంట్ ఉంటే... మల్లెమాల సంస్థకు చెందిన వెబ్ సైటుకు మీ వీడియోలు పంపిస్తే వారే మీకు అవకాశాలు ఇస్తారని జబర్దస్త్ నవీన్ తెలిపారు.

మల్లెమాలకు మంచి పేరుంది

మల్లెమాలకు మంచి పేరుంది

మల్లెమాల సంస్థకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉందని, వీరు డబ్బులిచ్చేవారే కానీ, తీసుకునే వారు కాదని నవీన్ తెలిపారు. ఆర్టిస్టులకు డబ్బులు ఎప్పటికప్పుడు పే చేస్తారని, డబ్బులు తీసుకుని జబర్దస్త్ షోలో అవకాశాలు ఇచ్చే దుస్థితి లేదని కమెడియన్ నవీన్ వెల్లడించారు.

 టీమ్ లీడర్స్, డైరెక్టర్లను కలవండి

టీమ్ లీడర్స్, డైరెక్టర్లను కలవండి

మీకు జబర్దస్త్‌లో నటించాలనే కోరిక ఉంటే, అందుకు తగిన టాలెంట్ మీలో ఉంటే టీమ్ లీడర్లను, డైరెక్టర్లను కలవాలని.... మీలో ఆ సత్తా ఉంటే మీకు తప్పకుండా అవకాశాలు దక్కుతాయని నవీన్ వెల్లడించారు.

English summary
In an exclusive interview with a media channel, Jabardasth comedian Naveen has ruled out the rumours that people get the chance by paying money. Naveen said the person who has acting skills can apply for the same through the proper means.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X