For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దసరా రోజు : ఏ ఛానెల్ లో ఏ స్టార్ హీరో సినిమా?

  By Srikanya
  |

  హైదరాబాద్‌: పండుగ అంటే ఇటు సిని మావాళ్ళు లాగే అటు టీవి మీడియావారు కూడా తమదైన ప్యాకేజీలతో రెడీ అయ్యిపోతారు. ఎప్పటిలాగే ఈ విజయదశమి తెలుగు సినీ ప్రేక్షకులకు కనుల విందు చేయడానికి తెలుగు టీవీ ఛానెల్స్ సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఈ సారి మరో పోటీ ఎక్కువగా ఉంది.

  దసరా రోజున బాహుబలి,శ్రీమంతుడు చిత్రాలు తెలుగు టీవీలను ఆక్రమిస్తున్నాయి. ఈ సినిమాలతో టీవి ప్రేక్షకులను కట్టిపారేయటానికి రంగం సిద్దమైంది.మరో ప్రక్క బయిట ఓ మూడు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇలా తెలుగు వారికి ఈ దసరా సినిమా పండుగ కానుంది. ఇంతకీ తెలుగు ఛానెల్స్ రాబోయే సినిమాలు ఏంటి అనేది ఈ క్రింద స్లైడ్ షోలో ఇస్తున్నాం చూడండి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈ చిత్రాల నిర్మాతలు తమ చిత్రాలు తప్పకుండా కొత్త ఆశలతో సరికొత్త చిత్రాలు ఈ సారి ప్రేక్షక దేవుళ్లకు మృష్టాన్న భోజనం పెట్టనున్నాయి అని చెప్తున్నారు. దసరా పండుగ సందర్భంగా వచ్చే సెలవులను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో దర్శక, నిర్మాతలు సైతం తమ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

  మరో ప్రక్క ఈ సారి ఒకే రోజున మూడు చిత్రాలు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మూడు ..మూడు రకాల విభిన్నమైన సబ్జెక్టులతో ఈ సినిమాలు రూపొంది మన ముందుకు వస్తున్నాయి. ఇంతకీ ఏం సినిమాలు అవి..అంటే స్లైడ్ షో చూడాల్సిందే.

  దాంతో ఇప్పటికే ధియోటర్స్ లో ఉన్న బ్రూస్ లీ, రుద్రమదేవి, శ్రీమంతుడు చిత్రాలు ఏ మేరకు దారి ఇస్తాయో చూడాలి. ఈ మూడింటిలో ఏది హిట్ అయినా లేక మూడు హిట్టయినా పండుగ స్పెషల్ గా చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించినట్లే.

  ఆ సినిమాలు ఇక్కడ...

  గోపాల గోపాల

  గోపాల గోపాల

  ఈ సారి జెమినీ ఛానెల్ లో గోపాల గోపాల చిత్రం టెలీ కాస్ట్ కానుంది. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ఇది. పవన్ అభిమానులకు నచ్చిన చిత్రం ఇది.

  బాహుబలి

  బాహుబలి

  పెద్ద తెరపై బాహుబలి చూడని వారికి, మరోసారి చూద్దామనుకునే వారికి మాటీవి వారు దసరా రోజు ఈ చిత్రం అందిస్తున్నారు.

  శ్రీమంతుడు

  శ్రీమంతుడు

  మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చి హిట్టైన శ్రీమంతుడు చిత్రం ఈ దసరా కు జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం కానుంది.

  వరుణ్‌ తేజ్‌ 'కంచె'

  వరుణ్‌ తేజ్‌ 'కంచె'

  మెగా ఫ్యామిలీ నుంచి 'ముకుంద' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్‌ తేజ్‌. తాజాగా ఈ యువ కథానాయకుడు నటించిన చిత్రం 'కంచె'. క్రిష్‌ దర్శకత్వం వహించాడు. ప్రగ్యా జైస్వాల్‌ నాయిక. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా అందమైన ప్రేమ కథను మిళితం చేస్తూ క్రిష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విజయదశమి సందర్భంగా 'కంచె'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించనున్నామని దర్శకుడు క్రిష్‌ చెబుతున్నాడు. విభిన్నంగా చిత్రాలను తెరకెక్కించడంలో క్రిష్‌ సిద్ధహస్తుడు. మరి వరుణ్‌తేజ్‌తో కలిసి 'కంచె' దూకి విజయం వైపు పయనిస్తాడో లేదో చూడాలి.

  తెరుచుకోనున్న 'రాజుగారి గది' తలుపులు

  తెరుచుకోనున్న 'రాజుగారి గది' తలుపులు

  బుల్లితెర వ్యాఖ్యాత ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్‌ చిత్రం 'రాజుగారి గది'. వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అశ్విన్‌ బాబు, చేతన్‌, ధన్యా బాలకృష్ణన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. ఇంతకు ముందు ఓంకార్‌ 'జీనియస్‌' అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసందే.

  ప్రేమ 'కొలంబస్‌

  ప్రేమ 'కొలంబస్‌

  సుమంత్‌ అశ్విన్‌ కథానాయకుడిగా ఆర్‌.సామల తెరకెక్కిస్తున్న చిత్రం 'కొలంబస్‌'. ఈ చిత్రాన్ని విజయదశమి రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సీరత్‌ కపూర్‌, మిస్త్రీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'కేరింత' చిత్రంతో విజయోత్సాహంలో ఉన్న అశ్విన్‌, కొలంబస్‌తో మరో విజయం అందుకోవాలని ఆశిస్తున్నాడు.

  రుద్రమదేవి

  రుద్రమదేవి

  చాలా థియోటర్స్ లో రుద్రమదేవి చిత్రం ఇప్పటికీ స్టడీగా ఉంది. దాంతో ఈ చిత్రం థియోటర్స్ ని ఏ మేరకు త్యాగం చేయాల్సి వస్తుందో చూడాలి.

  బ్రూస్ లీ

  బ్రూస్ లీ

  ఈ సినిమాకు ఇప్పటికే నెగిటివ్ టాక్ రావటంతో చాలా చోట్ల సెకండ్ వీక్ కు థియోటర్స్ తొలిగించే అవకాసం ఉంది. వాటిలో ఈ కొత్త సినిమాలు వస్తాయి.

  English summary
  TV Media is giving triple treat on Dasara festival much to the delight of movie lovers. . On the eve of “Dussehra”, the channels take a plan for Baahubali: the Beginning premiere and expected the highest amount of TRP rating.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X