For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్

  |

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై యాంకరింగ్‌లో గ్లామర్ క్వీన్ల హవానే ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులోకి ఎంతో మంది సుందరాంగులు ఎంట్రీ ఇస్తోన్న తరుణంలో క్రమంగా పోటీ పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతూ.. ఎన్నో ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు టాలెంటెడ్ గాయ్ ప్రదీప్ మాచిరాజు. లేడీ యాంకర్ల హవా ఉన్నా.. తన ప్రభావాన్ని చూపిస్తూ వరుస షోలతో సత్తా చాటుతున్నాడు. తద్వారా బుల్లితెరపై రారాజుగా ఏలుతున్నాడు. అలాగే, సినిమాల్లోనూ తన మార్కును చూపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఢీ షోకు చెందిన ప్రముఖ డ్యాన్సర్ ప్రదీప్ అసలు క్యారెక్టర్ బయట పెట్టాడు. అసలేం జరిగింది? ఆ సంగతులు మీకోసం!

  అలా ఎంట్రీ.. ఫుల్‌గా పాపులరిటీ

  అలా ఎంట్రీ.. ఫుల్‌గా పాపులరిటీ

  రేడియో జాకీగా ప్రదీప్ కెరీర్‌ను ఆరంభించాడు. ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలోనే తన అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ గాయ్.. వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటాడు. అదే సమయంలో 'గడసరి అత్త సొగసరి కోడలు' షోతో పాపులర్ అయ్యాడు. ఏకంగా దీనితో నంది అవార్డును కూడా అందుకున్నాడు.

  ఉల్లిపొర లాంటి బట్టల్లో దిశా పటానీ రచ్చ: అవి కూడా కనిపించేలా.. ఆమెనిలా చూస్తే!

  అద్భుతమైన టైమింగ్‌తో రచ్చ

  అద్భుతమైన టైమింగ్‌తో రచ్చ

  ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న టాప్ యాంకర్లలో ఒకడు. అతడు ఈ రేంజ్‌కు ఎదగడానికి ప్రధాన కారణం టైమింగే అని చెప్పుకోవచ్చు. తనదైన వాక్చాతుర్యంతో సందడి చేసే ఈ కుర్రాడు.. అప్పటికప్పుడు పంచులు వేస్తూ తెగ సందడి చేస్తుంటాడు. అందుకే ప్రదీప్ ఎక్కడుంటే అక్కడ నవ్వులకు కొదవ ఉండదు అంటారు. అంతలా మనోడు రచ్చ రచ్చ చేస్తుంటాడు.

  సినిమాల్లో సత్తా.. హీరోగా సక్సెస్

  సినిమాల్లో సత్తా.. హీరోగా సక్సెస్

  సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై టాప్ యాంకర్‌గా సత్తా చాటుతోన్న ప్రదీప్ మాచిరాజు.. కొన్నేళ్ల క్రితమే వెండితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గతంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా మారాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ భారీ కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది.

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ వారసుడు.. అందుకోసమే ఒప్పుకున్న యంగ్ హీరో

  బుల్లితెరపై హవా.. వరుస షోలు

  బుల్లితెరపై హవా.. వరుస షోలు

  యాంకర్‌గా మారిన తర్వాత నుంచి ప్రదీప్ ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. ఇందులో చాలా వరకూ సూపర్ హిట్ అయినవే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని కార్యక్రమాలను ఒప్పుకుంటూ దూసుకుపోతూనే ఉన్నాడు. ప్రస్తుతం అతడు 'ఢీ 14', 'సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్' సహా పలు షోలు, ఈవెంట్లకు హోస్టింగ్ చేస్తున్నాడు. అలాగే, సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

  ‘ఢీ’ షోలోకి ప్రసాద్ రీఎంట్రీ

  ‘ఢీ’ షోలోకి ప్రసాద్ రీఎంట్రీ

  సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న 'ఢీ' ప్రస్తుతం 14వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో నాలుగు టీమ్‌లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో ప్రసాద్ అనే కంటెస్టెంట్ కాలు విరిగిపోవడం వల్ల షోకు దూరం అయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత కోలుకున్న అతడు.. తాజా ఎపిసోడ్‌లో అదిరిపోయే డ్యాన్స్‌తో రీఎంట్రీ ఇచ్చాడు.

  డ్రెస్ కిందకు జరిపి షాకిచ్చిన రాశీ ఖన్నా: టాప్ అందాలు కనిపించేలా ఘోరంగా!

  ప్రదీప్ క్యారెక్టర్ బయటపెట్టాడు

  ప్రదీప్ క్యారెక్టర్ బయటపెట్టాడు

  ప్రసాద్ కాలు విరగడం అప్పట్లో సంచలనం అయింది. వైద్యానికి డబ్బులు లేని ధీన స్థితిని అనుభవించిన తర్వాత అతడు ఇప్పుడు కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో 'ఢీ' స్టేజ్‌పైకి మరోసారి వచ్చిన ఈ కుర్రాడు.. తనకు చాలా మంది సహాయం చేశారని చెప్పాడు. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ గొప్పదనాన్ని వివరించి అతడి అసలు క్యారెక్టర్‌ను అందరికీ తెలియజేశాడు.

  ఫోన్ చేయగానే అలా అన్నాడు

  ఫోన్ చేయగానే అలా అన్నాడు

  యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రసాద్ మాట్లాడుతూ.. 'నాకు ట్రీట్‌మెంట్ జరుగుతున్నప్పుడు స్కిన్ పాడైందని అన్నారు. ఆ సమయంలో సర్జరీ కోసం ప్రదీప్ అన్నకు ఫోన్ చేశాను. అప్పుడు నువ్వు కాల్ కట్ చెయ్ అన్నారు. అలా ఫోన్ పెట్టేసిన వెంటనే అకౌంట్‌లో డబ్బులు వేశాడు. థ్యాంక్స్ అన్న' అంటూ చెప్పాడు. దీంతో అందరూ ప్రదీప్‌ను అభినందించారు.

  English summary
  Anchor Pradeep Machiraju Now Doing Dhee Show 14 Season. Recently Dhee Prasad Shares Pradeep Machiraju Character in An Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X