‘బాహుబలి 2 ఇంటర్వెల్ చూసి వణికిపోయా.. ఉచ్చ పోసుకొనే సీన్..’

ఇండియాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించినవి కేవలం 2 చిత్రాలే అయినప్పటికీ వరల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ ఆడియెన్స్ ను ఆకట్టుకోగలిగారు. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో అగ్ర దర్శకులకే షాక్ ఇచ్చారు. ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా నిలిచారు. ఇండియాలో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నారు. దీంతో సందీప్ రెడ్డి వంగ స్టార్ హీరోలతో మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ తనకు సమయం ఉన్నప్పడల్లా మీడియా చిట్ చాట్, ఇంటర్వ్యూలకు సమయం కేటాయిస్తున్నారు.

ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో కలిసి టాక్ షోకు హాజరయ్యారు. టాలీవుడ్ హీరో, సీనియర్ నటుడు జగపతి బాబు తాజాగా బుల్లితెరపై జయమ్మురా నిశ్చయమ్మురా అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జీ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ ను విడుదల అవుతున్నాయి. ఇప్పటికే అక్కినేని నాగార్జున ఈ షోకు హాజరైన తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మతో కలిసి సందీప్ రెడ్డి వంగ జయమ్ము నిశ్చయమ్మురా షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాహుబలి చిత్రంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Director Sandeep Reddy Vanga about Baahubali 2 Interwel Scene

ఎస్ఎస్ రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో బాహుబలి 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 2017లో ఈ చిత్రం విడుదలైనప్పుడు సందీప్ రెడ్డి వంగ షాక్ అయ్యారంట. ఆ సినిమా చూసి వణికిపోయానని చెప్పుకొచ్చారు. జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. 'బాహుబలి 2 చిత్రం రిలీజ్ అయ్యిన తర్వాత నాకు ఇంటర్వెల్ సీన్ షాక్ ఇచ్చేలా అనిపించింది. బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ నా ఆలోచన ప్రకారం ఎప్పటికీ గ్రేటెస్ట్ ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్ చూసి వెంటనే నా ఆఫీస్ కు వచ్చాను. ఎడిటింగ్ సిస్టమ్ ఆన్ చేసి నా ఇంటర్వెల్ సీన్ ను చూసుకున్నాను.

నిజానికి బాహుబలి 2 ఇంటర్వెల్ చూసి నాకు భయమేసింది. ఆ సీన్ కు ఆడియెన్స్ కేరింతలు కొడుతుండటంతో ఆశ్చర్యపోయాను. ఇక నా అర్జున్ రెడ్డి మూవీ ఇంటర్వెల్ చూసి ఇంకా భయమేసింది. ఆ తర్వాత 2 రోజులు మళ్లీ సీన్ బై సీన్ చూసుకుంటూ వచ్చి మంచి ఇంటర్వెల్ పాయింట్ ను కనుగొన్నాను. ఆ విధంగా సినిమా మేకింగ్ లో తప్పులు ఉండకూడదని భయం, గిల్ట్ ఉండేది. ఇక టీజర్ విడుదలైన తర్వాత అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అయితే జనాలు ఎక్కిందని అర్థమైంది. దాంతో కాన్ఫిడెన్స్ వచ్చింది.' అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా ఎంపికైంది. ఇక డాన్ లీని విలన్ గా ఎంపిక చేసినట్టు సమాచారం. 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X