రంగమ్మత్త ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా.. స్టార్ హీరోయిన్ కు ఆఫర్ ఇచ్చిన సుకుమార్.. ఎందుకు చేయలేదంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - టాలీవుడ్ సెన్సేషనల్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ రంగస్థలం విడుదలైన సంగతి తెలిసిందే. 2018 మార్చి 30న ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతటి రెస్పాన్స్ ను దక్కించుకుందో తెలిసిందే. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్, సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించి పెర్ఫామెన్స్ విషయంలో ఇరగదీశారు. ఇప్పటికీ ఫ్యాన్స్ చరణ్ యాక్టింగ్ గురించే మాట్లాడుకుంటారు. ఇక మిగిలిన పాత్రల్లోనూ స్టార్ కాస్ట్ అదరగొట్టింది.
జగపతి బాబు, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలతో ఆకట్టుకున్నారు. ఇక రంగస్థలం గురించి మాట్లాడితే సంచలనం క్రియేట్ చేసిన పాత్ర రంగమ్మత్త. ఈ డేరింగ్ క్యారెక్టర్ లో టెలివిజన్ సెన్సేషన్, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ నటించిన సంగతి తెలిసిందే. ఆ పాత్రకు అనసూయ తప్ప మరెవ్వరూ సరిపోరు అనేంతలా పెర్ఫామెన్స్ ఇరగదీసింది. ఈ సినిమాతో అనసూయ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అనసూయను ఏకంగా ఆడియెన్స్ రంగమ్మత్త అంటూ ముద్దుగా పిలవడం ప్రారంభించారంటే ఆ పాత్ర ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఈ రంగమ్మత్త పాత్రలో అనసూయ కంటే ముందు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒకరు నటించాల్సి ఉంది. సుకుమార్ ఈ పాత్రకు ఫస్ట్ ఆమెనే ఎంపిక చేశారంట. కానీ ఆ పాత్రలోని కొన్ని సీన్ల కారణం నేను చేయనని చెప్పడంతో ఆ అవకాశం కాస్తా అనసూయ భరద్వాజ్ కు వచ్చింది. అయితే మొదట ఎంపికైన స్టార్ హీరోయిన్ మరెవరో కాదు. 20లో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఆడియెన్స్ లో విశేషమైన ఆదరణ పొందిన హీరోయిన్ రాశీ. కుటుంబ నేపథ్య సినిమాల్లో నటించి రాశీ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
ఒక దశలో నటి సౌందర్య అంతంటి పేరును కూడా సంపాదించుకున్నారు రాశీ. కానీ కొన్నాళ్లకు తను ఇండస్ట్రీలో సినిమాల జోరును తగ్గిస్తూ వచ్చారు. ఇక ఇటీవల జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్స్ షోకు గెస్ట్ గా హాజరైంది. ఈ సందర్భంగా రాశీ తన సినిమాల గురించి మాట్లాడింది. 'డైరెక్టర్ సుకుమార్ నన్నే మొదటగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రకు ఎంపిక చేశారు. సుకుమార్ గారు పిలవడంతో ఆఫీస్ కు వెళ్లి కలిశాను. అప్పుడు స్లిమ్ గా కాకుండా కాస్తా బొద్దుగానే ఉన్నాను.
అయితే సుకుమార్ నన్ను చూడగానే ఈ పాత్రకు సెట్ అవ్వుద్దా లేదా అని ఆలోచనలో పడిపోయారు. ఇక నా ఫేస్ కట్ కూడా సింపథిగా ఉంటుంది. నేను ఏదైనా సన్నివేశంలో ఏడిస్తే నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఏడ్చేస్తారు. ఇక రంగమ్మత్త రగ్డ్ క్యారెక్టర్. ఆ పాత్ర తాలుక దుస్తులు, చరణ్ తో మాట్లాడుతూ బాటిల్ తో తాగేసే సన్నివేశం నాకు సూట్ అవ్వదని అనిపించింది. నాకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఉంటారు. అందుకే చేయలేదు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక కూడా నాకేమీ బాధ అనిపించలేదు' అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











