For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఘ‌నంగా డాక్టర్‌ బాబు మ‌ర‌ద‌లి సీమంతం.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

  |

  తెలుగు టెలివిజన్ చరిత్రలో ఎంతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ప్రతి రోజు ఏదో ఒక ట్విస్ట్ తో కొనసాగే ఈ కథ టీఆర్పీలో నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. ఇక ఈ సీరియ‌ల్‌లో న‌టిస్తోన్న కార్తీక్(ప‌రిటాల నిరుప‌మ్), దీప‌(ప్రేమి విశ్వ‌నాథ్), సౌంద‌ర్య‌(అర్చ‌నా అనంత్), మోనిత‌(శోభా శెట్టి) త‌దిత‌రులు త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తూ బ‌య‌ట కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా డాక్టర్ బాబు రియల్ లైఫ్ మరదలికి సీమంతం జరిగింది. దీంతో పెద్దఎత్తున సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారాయి.. ఆ వివరాల్లోకి వెళితే

  తండ్రి వారసుడిగా

  తండ్రి వారసుడిగా

  నటుడు రచయిత ఓంకార్ పరిటాల వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నిరుపమ్ పరిటాల ప్రస్తుతం కుంకుమపువ్వు, కార్తీకదీపం, ప్రేమ సీరియల్స్‌ ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నారు. ఇక చంద్రముఖి సీరియల్‌ ద్వారా 2007లో ఆయన పరిచయం అయ్యారు. తన తండ్రికి నిరుపమ్ ఈ ఫీల్డ్‌కి రావడం ఏ మాత్రం ఇష్టం లేదట కానీ ఆయనకు ఏమో సినిమాల్లోకి రావాలని ఉండేదట. అయితే ఓంకార్ మాత్రం ‘ముందు చదువుకో, తర్వాత ట్రై చేయవచ్చు' అనేవారట.

  అందరినీ దాటుకుని డాక్టర్ బాబుగా

  అందరినీ దాటుకుని డాక్టర్ బాబుగా

  అయితే నిరుపమ్ సెటిల్ అవ్వకుండానే ఓంకార్ చనిపోయారు. ఆ టైమ్‌లో ఓంకార్ స్నేహితుల ద్వారా సీరియల్‌ అవకాశం వచ్చిందని నిరుపమ్ చెబుతూ ఉంటారు. ఇక ‘కుంకుమపువ్వు' సీరియల్‌ చేస్తున్న సమయంలో ‘కార్తీక దీపం' సీరియల్‌ డిస్కషన్స్‌ జరిగాయని ఆ సీరియల్‌ ప్రొడ్యూసర్‌తో అప్పటికే ‘మూగమనసులు' సీరియల్‌ చేసున్న కారణంగా ఆ తర్వాత కూడా ఆ టీమ్‌తో టచ్‌లో ఉండేవాడినని అలా కార్తీక దీపం హీరో రోల్ ఎందరినో దాటుకుని తన దాకా వచ్చిందని నిరుపమ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

  మరదలి సీమంతం

  మరదలి సీమంతం

  ఇక నిరుపమ్ భార్య మంజుల కూడా నటి. మంజుల కూడా సీరియల్‌ నటి కావడంతో ఇండస్ట్రీలో వర్క్‌ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసని ఎప్పుడైనా చిన్న చిన్న వాదనలు వచ్చినా అర్థం చేసుకుంటామని నిరుపమ్ చెబుతూ ఉంటారు. మంజుల తాను చంద్రముఖి సీరియల్‌లో ఇద్దరం కలిసి చేశామని ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నామని నిరుపమ్ చెబుతుంటారు. ఇక ఆమె సోదరి, సోదరి భర్త కూడా సీరియల్ నటులే.

   ఆమె కూడా నటే

  ఆమె కూడా నటే

  న‌టి కీర్తి ఓ ప్ర‌ముఖ చాన‌ల్ లో ప్ర‌సారం అవుతున్న హిట్ల‌ర్ గారి పెళ్లాం సీరియ‌ల్ లో న‌టిస్తుంది. కీర్తి భర్త ధనుష్‌ కూడా సీరియల్ నటుడే. ఇక కీర్తి సీమంతం ఆమె నివాసంలో ఘనంగా జరిగింది. కరోనా కారణంగా అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కీర్తి-దనుష్‌ మొదటిసారి తల్లిదండ్రులు కానుండటంతో నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

   కన్నడలో ఫేమ్

  కన్నడలో ఫేమ్

  ఇక కీర్తి కన్నడ సీరియల్స్‌తో మంచి గుర్తింపు పొందింది. తెలుగులో సైతం ఆమె పలు సీరియల్స్‌లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం కీర్తి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కీర్తి త‌న బుల్లితెర‌పై త‌న‌ న‌ట‌న‌తో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. కీర్తి-ధ‌నుష్ లు సైతం ప్రేమ వివాహం చేసుకున్నారు.

  English summary
  Kathika Depam fame, actor Nirupam Paritala's sister in law Keerthi Dhanush Srimantham photos gone viral in social media. As we all know Nirupam and his wife manjula are actors. In the same way keerthi- dhanush are also actors. recently keerthy became pregnant, yesterday her srimantham function held at her house.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X