For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Evaru Meelo Koteeswarulu Show: రాంచరణ్‌కు ఎన్టీఆర్ చెమటలు పట్టించిన ప్రశ్నలు ఇవే!

  |

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలియాస్ రామారావు సరికొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. RRR చిత్రం ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి సిద్దమవుతూనే.. ప్రేక్షకుల చేత మరింత ఆకట్టుకొనేందుకు ఎవరు మీలో కోటీశ్వరులు ద్వారా హోస్ట్‌గా ముందుకొచ్చారు. ఈ షోలో తన స్నేహితుడు, RRR మూవీలో సహ నటుడి రాంచరణ్‌ను గెస్ట్‌గా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిరంజీవిని, పవన్ కల్యాణ్, అలాగే ఆరెంజ్ సినిమాను తలచుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా చెర్రీని తికమక పెడుతూ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలు ఇవే..

  Evaru Meelo Koteeswarulu Show: RRR మూడేళ్లు తీస్తే పెరగదా రాజమౌళిపై రాంచరణ్, ఎన్టీఆర్ సెటైర్లు..

  చిరంజీవి ఇండస్ట్రీకి ఆచార్య

  చిరంజీవి ఇండస్ట్రీకి ఆచార్య

  ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోలో అడిగిన ప్రశ్నకు రాంచరణ్, ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఆచార్య సినిమాలో నాన్నతో నటించడం గొప్ప అనుభూతి. కొన్నేళ్ల తర్వాత చూసుకొంటే మరిచిపోలేని ఫీలింగ్ మాదిరిగా ఉంటుంది. సినిమాలోనే కాదు.. ఇంట్లో కూడా చిరంజీవి గారు ఆచార్యగానే ఉంటారు అని రాంచరణ్ చెప్పగానే.. ఎన్టీఆర్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరికి చిరంజీవి ఆచార్యనే. ఆయన స్పూర్తితోనే మనమంతా ఈ పొజిషన్‌లో ఉన్నాం. అందుకు మెగాస్టార్‌కు హ్యాట్పాఫ్ అంటూ ఎన్టీఆర్ అన్నారు.

  నాన్నతో నటించడం టెన్షన్ అంటూ

  నాన్నతో నటించడం టెన్షన్ అంటూ

  ఆచార్య సినిమాలో చిరంజీవితో నటించడంపై తన ఫీలింగ్‌ను రాంచరణ్ చెబుతూ.. నాకు షూటింగుకు వెళ్లడం టెన్షన్‌ ఉంటుంది. అలాంటిది నాకు నాన్నతో కలిసి నటించడం చాలా టెన్షన్ ఉండేది. ఓ ప్రిన్స్‌పాల్‌ను ఇన్విజిలెటర్‌‌గా పెట్టుకొని ఎగ్జామ్ రాసినట్టు ఉండేది అని రాంచరణ్ చెప్పారు. అలాగే ఈ షోలో గెలుచుకొనే మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు తాను గెలుచుకొనే మొత్తాన్నిఇస్తాను. నాన్నగారు ప్రారంభించిన రక్తదాన, నేత్రదాన సేవలను గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. మా రెమ్యునరేషన్లలో కొంత భాగం ట్రస్ట్‌కు అందజేస్తాం. ఇప్పటి వరకు ఎవరిని కూడా ఫండ్స్ అడగలేదు. కానీ మొదటిసారి ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ద్వారా సీసీటీకు అందించబోతున్నాం. కరోనా సమయంలో కూడా జిల్లాలో ఆక్సిజన్ సరఫరా, ఇతర సేవలను ఘనంగా నిర్వహించాం. అలాంటి సంస్థ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం అని రాంచరణ్ తెలిపారు. దాంతో మీ సేవలు ఇంకా చాలా ఏళ్లు కొనసాగాలని రాంచరణ్‌ను ప్రశంసిస్తూ ఎన్టీఆర్ ఆకాంక్షించారు.

  ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలు, జవాబులు

  ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలు, జవాబులు

  ఎవరు మీలో కోటీశ్వరులు షోలో రాంచరణ్ ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంచిన ప్రశ్నలు ఇవే..

  1. వీటిలో గురువు అనే అర్ధం కలిగిన పదం ఏది?
  a) ఆరోగ్య
  b) ఆచార్య
  c) ఐశ్వర్య
  d) ఆశ్చర్య

  Answer: ఆచార్య

  రెండో ప్రశ్న ఇదే

  రెండో ప్రశ్న ఇదే

  2. హిందూ పురాణాల్లో వీటిలో ఏది తాగడం వల్ల అమరత్వం వస్తుంది?
  a) కాలకూటము
  b) హలాహలం
  c) అమృతం
  d) నాలికము

  Answer: అమృతం

  ఎన్టీఆర్ అడిగిన మూడో ప్రశ్న

  ఎన్టీఆర్ అడిగిన మూడో ప్రశ్న

  3. వీటిలో ఎస్ఎల్ఆర్, డీఎస్ఎల్ఆర్, ఇన్స్‌టాంట్ అనేవి దేనిలో రకాలు?
  a) కెమెరాలు
  b) పుస్తకాలు
  c) విమానాలు
  d) వజ్రాలు

  Answer: కెమెరాలు

  పవన్ కల్యాణ్ పాటపై రాంచరణ్

  పవన్ కల్యాణ్ పాటపై రాంచరణ్

  4. ఈ ఆడియో క్లిప్‌లోని గాయకుడు ఎవరు? (నీవు సారా తాగితే.. జానీ చిత్రంలోని పాట వినిపిస్తే)
  a) రమణ గోగుల
  b) పవన్ కల్యాణ్
  c) దేవీశ్రీ ప్రసాద్
  d) మణిశర్మ

  Answer: పవన్ కల్యాణ్

  క్రికెట్ గురించిన ప్రశ్న

  క్రికెట్ గురించిన ప్రశ్న

  5. వీటిలో క్రికెట్‌లో ఒక ఫీల్డింగ్ పొజిషన్ కానిది ఏది?
  a) కవర్ పాయింట్
  b) స్లిప్
  c) గల్లీ
  d) వింగ్ బ్యాక్

  Answer: వింగ్ బ్యాక్

  ఆరెంజ్ ప్రశ్న అడగడంతో ఎమోషనల్

  ఆరెంజ్ ప్రశ్న అడగడంతో ఎమోషనల్

  6. ఈ చిత్రంలో కనిపిస్తున్న భవనం ఏ నగరంలో ఉంది? (ఓపెరా హౌస్‌ బొమ్మను చూపిస్తూ)
  a) న్యూయార్క్
  b) సిడ్నీ
  c) అమ్‌స్టర్ డ్యామ్
  d) లండన్

  Answer: సిడ్నీ

  నాకు అత్యంత ఇష్టమైన చిత్రం ఆరెంజ్. ఒపెరా హౌస్‌కు సమీపంలో నాలుగు రోజులు షూట్ చేయడం నాకు మరిచిపోలేని విషయం అని రాంచరణ్ అన్నారు.

  ఉపాసన గురించి రాంచరణ్

  ఉపాసన గురించి రాంచరణ్

  7. PETA సంస్థ వీటిలో దేనికి సంబంధించినది?
  a) మహిళల భద్రత
  b) మానవ హక్కులు
  c) జంతువుల హక్కులు
  d) శరణార్థుల హక్కులు

  Answer: జంతువుల హక్కులు

  తనకు జంతువులు అంటే నాకు చాలా ఇష్టం. నేను జంతువుల ప్రేమికుడిని. అలాగే ఉపాసన కూడా జంతువులను ప్రేమిస్తుంది. జంతువుల పరిరక్షణ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు.

  Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
  కొమురం భీమ్ పాత్ర గురించి

  కొమురం భీమ్ పాత్ర గురించి

  8. జూన్ 2021 నాటికి వీరిలో ఎవరి పేరుతో తెలంగాణలో ఒక జిల్లాకు పేరు పెట్టబడి ఉంది?
  a) ఏపీజే అబ్దుల్ కలాం
  b) ఎస్ రాధాకృష్ణన్
  c) పీవీ నర్సింహారావు
  d) కొమురం భీమ్

  Answer: కొమురం భీమ్

  RRR సినిమాలో కొమురం భీమ్ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. కొమురం భీమ్‌గా నటించడం ఓ సవాల్. నేను పోషించిన రోల్స్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ అని ఎన్టీఆర్ అంటే.. ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. కానీ నేను ఏమీ చెప్పను. మూతికి టేప్ వేసుకొంటాను అని రాంచరణ్ అన్నారు. రాజమౌళి తీసిన సన్నివేశాలు విజ్‌వల్ ట్రీట్. తెర మీద సీన్స్‌ను చింపేశాడు అని ఎన్టీఆర్ అన్నారు.

  English summary
  Evaru Meelo Koteeswarulu Show started on August 22nd. Ram Charan and NTR satires on SS Rajamouli and Rana Daggubati in Episode number 2.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X