For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Evaru Meelo Koteeswarulu August 30th Episode: రూ. 12.50 లక్షల ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా?

  |

  జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఘనంగా సాగుతూ ముందుకెళ్తున్నది. విజానంతోపాటు డబ్బు కూడా గెలుచుకొనే విధంగా ఈ షో కంటెస్టెంట్లకు, వ్యూవర్స్‌కు వెసలుబాటు కల్పించింది. ఆగస్టు 30 తేదీన సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో అడిగిన ప్రశ్నలు, వాటికి చెప్పిన సమాధానాలు మీ కోసం ఇవ్వడం జరిగింది.. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా ఒకసారి చెక్ చేసుకొండి...

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ కోసం ప్రశ్న..

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ కోసం ప్రశ్న..

  ఒక శ్లోకం మొదటి పంక్తిలో ఉండే ఈ పదాలను సరైన క్రమంలో అమర్చండి
  A) మహాకాయ
  B) సూర్యకోటి
  C) వక్రతుండ
  D) సమప్రభ

  Answer: C, A, B, D

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్‌లో చాలా వేగంగా జవాబు లాక్ చేసిన వ్యక్తి అభిరామ్. 4.719 సెకన్లలో అన్సర్ చేయడంతో ఎన్టీఆర్ ముందు ఉన్న హాట్ సీట్‌పైకి వెళ్లారు. ఖమ్మంకు చెందిన అభిరామ్. ఫైనాన్సియల్ కంటెస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎవరు మీలో కోటీశ్వరుడు గేమ్‌‌లో గెలిచే మొత్తాన్ని సొంత ఇంటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని అభిరామ్ తెలిపారు.

  1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

  1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

  1. కొత్తగా పెళ్లైన జంట చేసే విహారయాత్రను ఏమంటారు?
  a) బ్లూ మూన్
  b) న్యూమూన్
  c) ఫుల్ మూన్
  d) హానీమూన్

  Answer: హానీమూన్

  2000 రూపాయల కోసం రెండో ప్రశ్న

  2000 రూపాయల కోసం రెండో ప్రశ్న

  2. వీటిలో సాధారణంగా పండిన తర్వాత అత్యంత తీయగా ఉండేది ఏది?
  a) మామిడి కాయ
  b) ఉసిరికాయ
  c) నిమ్మకాయ
  d) చింతపడు

  Answer: మామిడి కాయ

  3000 రూపాయల కోసం 3వ ప్రశ్న

  3000 రూపాయల కోసం 3వ ప్రశ్న

  3. అల్లు అర్జున్, తమన్నా కలిసి నటించిన చిత్రం ఏది?
  a) అమరనాథ్
  b) కేదారినాథ్
  c) బద్రినాథ్
  d) కాశీనాథ్

  Answer: బద్రినాథ్

  50000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

  50000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

  4. ఈ సామెతను పూర్తి చేయండి.. పాలు పోసినట్టు
  a) జింకకి
  b) సింహానికి
  c) పులికి
  d) పాముకి

  Answer: పాముకి

  10000 కోసం 5వ ప్రశ్న

  10000 కోసం 5వ ప్రశ్న

  5. వీటిలో ప్లాట్ స్క్రీన్, ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ అనేవి దేనిలో రకాలు?
  a) టెలివిజన్
  b) మైక్రోవేవ్ ఓవెన్
  c) టోస్టర్
  d) ప్రెషర్ కుక్కర్

  Answer: టెలివిజన్

  అభిరామ్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ద్వారా మొదటి సేఫ్ లైన్‌ను అధిగమించారు. పదివేల రూపాయలను గెలుచుకొన్నారు.

  20000 కోసం 6వ ప్రశ్న

  20000 కోసం 6వ ప్రశ్న

  6. 500 రూపాయల నోటు మీద ఉన్న కట్టడాన్ని గుర్తించండి
  a) ఆగ్రా కోట
  b) గ్వాలియర్ కోట
  c) ఎర్రకోట
  d) గోల్కొండ కోట

  Answer: ఎర్ర కోట

  40 వేల రూపాయల కోసం 7వ ప్రశ్న

  40 వేల రూపాయల కోసం 7వ ప్రశ్న

  7. రామాయణంలో సీతారాములు వనవాస సమయంలో నివాసం ఉన్న ఆశ్రమం ఏది?
  a) ఆయోధ్య
  b) గాంధార
  c) మిథిల
  d) పంచవటి

  అభిరామ్‌కు ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఆడియెన్స్ పోల్ లైఫ్ లైన్‌ను ఉయోగించుకొన్నారు. ఎక్కువ మంది ఆడియెన్స్ సమాధానం పంచవటి అని సమాధానం చెప్పడంతో అభిరామ్ పంచవటి అనే జవాబు చెప్పి 40 వేలు గెలుచుకొని తదుపరి ప్రశ్న కోసం ముందుకెళ్లారు.

  Answer: పంచవటి

  80000 రూపాయల కోసం 8వ ప్రశ్న

  80000 రూపాయల కోసం 8వ ప్రశ్న

  8. ఏ దేశంలోని సినోవాక్ అనే కంపెనీ కోవిడ్ 19కు కరోనావ్యాక్ అనే టీకాను ఉత్పత్తి చేసింది?
  a) శ్రీలంక
  b) బ్రెజిల్
  c) చైనా
  d) మెక్సికో

  పై ప్రశ్నకు జవాబు తెలియకపోవడంతో వీడియో కాల్ లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. బెంగళూరుకు చెందిన సూర్య నారాయణకు కాల్ చేశారు. ఆయన చైనా అని సమాధానం చెప్పడంతో అభిరామ్ కూడా అదే జవాబు చెప్పారు. ఆ సమాధానం కరెక్ట్ కావడంతో 80 వేలు గెలుచుకొన్నారు.

  Answer: చైనా

  160000 రూపాయల కోసం 8వ ప్రశ్న

  160000 రూపాయల కోసం 8వ ప్రశ్న

  9. ఈ ప్రపంచకప్ గెలిచిన క్రికెటర్లలో తమ దేశానికి ప్రధానిగా ఉన్నవారు ఎవరు?
  a) అర్జున రణతుంగ
  b) ఇమ్రాన్ ఖాన్
  c) స్టీవ్ వా
  d) క్లైవ్ లాయిడ్

  Answer: ఇమ్రాన్ ఖాన్

  తన తండ్రి హరికృష్ణకు క్రికెట్ అంటే పిచ్చి. మ్యాచ్ వచ్చే సమయంలో నన్ను దానిని రికార్డు చేయమని చెప్పేవారు. అప్పుడు మ్యాచ్ చూసేవాడిని. అలాగే నాన్న రాత్రి ఆ మ్యాచ్‌ను చూసేవారు. అప్పుడు కూడా చూడాల్సి వచ్చింది. అలా నాకు క్రికెట్ చూడటంపై విరక్తి కలిగింది. కానీ క్రికెట్ నేను బాగా ఆడుతాను అని ఎన్టీఆర్ చెప్పారు.

   10. వీరిలో ఎవరి పేరుకు జ్ఞానోదయమయినవాడు అనే అర్థం వస్తుంది?

  10. వీరిలో ఎవరి పేరుకు జ్ఞానోదయమయినవాడు అనే అర్థం వస్తుంది?

  a) మహా వీరుడు
  b) బుద్ధుడు
  c) వృషభనాథుడు
  d) బాహుబలి

  Answer: బుద్దుడు

  ఖమ్మం జిల్లాకు చెందిన అభిరామ్ ఈ ప్రశ్నకు సరైన ఇవ్వడంతో 320000 రూపాయలు గెలుచుకొన్నారు. ఈ మొత్తానికి అభిరామ్ ఆదిత్యకు చెక్ రాసి సంతకం చేసి ఎన్టీఆర్ ఇచ్చారు. ఇంకా ఎక్కువ మొత్తం గెలుచుకోవాలని తారక్ కోరుకున్నారు. అయితే మీ పుట్టిన రోజు మే 20 తేదీ నా బర్త్ డే అని అభిరామ్ చెప్పారు. దాంతో మోహన్ బాబు అబ్బాయి మనోజ్ బర్త్ డే కూడా అదే రోజు అంటూ ఎన్టీఆర్ చెప్పారు. అలాగే రెండోది మీ అబ్బాయి పేరు అభయ్ రామ్.. నా పేరు అభి.. నన్ను అందరూ అభి అని పిలుస్తారు అని చెప్పారు.

  640000 రూపాయల ప్రశ్న కోసం

  640000 రూపాయల ప్రశ్న కోసం

  11. వీటిలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం ఏది?
  a) ఉత్తర ప్రదేశ్
  b) తెలంగాణ
  c) అస్సాం
  d) మధ్యప్రదేశ్

  అభిరామ్‌కు ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో 50:50 లైఫ్‌లైన్ ఉపయ్గోగించుకొన్నారు. అందులో ఉత్తర ప్రదేశ్, అస్పాం మిగిలి ఉండటంతో ఉత్తరప్రదేశ్ అని జవాబు చెప్పి 6 లక్షల 40 వేలు గెలుచుకొన్నారు.

  Answer: ఉత్తర ప్రదేశ్

  Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
  12 లక్షల 50 వేల రూపాయల కోసం.. 12వ ప్రశ్న..

  12 లక్షల 50 వేల రూపాయల కోసం.. 12వ ప్రశ్న..

  12. వీటిలో ఒక భారతీయ భాషలో మూలం ఉన్న పదం ఏది?
  a) క్యాండీ
  b) కెట్చప్
  c) సఫారీ
  d) రిక్షా

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోయినా.. రిస్క్ తీసుకొని సఫారీ అనే సమాధానాన్ని లాక్ చేసి ఫిక్స్ చేశాడు. అయితే సరైన సమాధానం క్యాండీ అవ్వడంతో ఈ గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. అంతేకాకుండా గెలిచిన 640000 నుంచి సగం కోల్పోయి 320000 మొత్తంతో గేమ్ నుంచి వైదొలిగాడు.

  Answer: క్యాండీ

  అభిరామ్ గెలిచిన చెక్‌తోపాటు చాక్లెట్ గిఫ్ట్ హ్యాంపర్‌ను ఇచ్చి.. జీవితంలో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాల్సి వస్తే ఎవరికి చెప్పుకొంటారు అని ఎన్టీఆర్ అడిగితే.. నా భార్యకు థ్యాంక్స్ చెప్పుకొంటాను. ఎందుకంటే నా పేరెంట్స్ ఎంత సపోర్టుగా ఉంటారో.. నా భార్య కూడా అలానే ఉంటారు అని అభిరామ్ చెప్పారు. దాంతో సోమవారం ఆగస్టు 30వ తేదీ ఎపిసోడ్ ముగిసింది.

  English summary
  NTR's EMK Show August 30th Episode: Abhiram Aditya of Khammam, has participated in this show. Here is the questions and Answers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X