For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Evaru Meelo Koteeswarulu vs Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ రికార్డు బద్దలు..చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన ఎన్నో షో ప్రజాధరణ దొరకక మధ్యలోనే కనుమరుగైపోయాయి. కానీ, కొన్ని మాత్రం భారీ స్థాయిలో ప్రేక్షకుల మద్దతును అందుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అలాంటి వాటిలో క్విజ్ ఆధారంగా ప్రసారం అయ్యే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే షో ఒకటి. సామాన్యులను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో మొదలైన ఈ షో విజయవంతం అయింది.

  ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా ఐదో సీజన్ మొదలైంది. తాజాగా దీనికి సంబంధించిన నాల్గవ వారం టీఆర్పీ రేటింగ్ బయటకు వచ్చింది. ఇందులో ఇది బిగ్ బాస్ షోను దాటేసింది. ఆ లెక్కలేంటో చూద్దాం పదండి!

  ఇద్దరు స్టార్ హీరోలతో నాలుగు సీజన్లు

  ఇద్దరు స్టార్ హీరోలతో నాలుగు సీజన్లు

  ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ' ఆధారంగా తెలుగులోకి వచ్చిన షోనే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. జనరల్ నాలెడ్జ్‌ ఆధారంగా నడిచే ఈ షో మన దగ్గర కూడా విజయవంతం అయింది. ఫలితంగా ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో మొదటి మూడింటినీ కింగ్ అక్కినేని నాగార్జున.. నాలుగో దాన్ని మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు.

  Bigg Boss: షోలో చెండాలమైన పని చేసిన హమీదా.. పర్సనల్ ఫొటోలను లీక్ చేసి ఝలక్ ఇచ్చిన ఫ్యాన్స్

  మార్పులతో ఐదో సీజన్.. రామారావుతో

  మార్పులతో ఐదో సీజన్.. రామారావుతో

  నాలుగు సీజన్లు పూర్తైనా తర్వాత ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' నిర్వహకులు గ్యాప్ తీసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ‘ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్‌తో ఐదో సీజన్ మొదలు పెట్టారు. దీన్ని స్టార్ మాలో కాకుండా జెమినీ టీవీలో ప్రసారం చేస్తున్నారు. ఈ సీజన్‌ను టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ రామారావు హోస్ట్ చేస్తున్నాడు.

  ఫస్ట్ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయి రేటింగ్

  ఫస్ట్ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయి రేటింగ్

  ఎన్నో అంచనాల నడుమ ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షోను ఆగస్టు 22న అంగరంగ వైభవంగా ప్రారంభించారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సారథ్యంలో మొదలైన ఈ సీజన్‌ కర్టన్ రైజర్ ఎపిసోడ్‌కు టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఎపిసోడ్‌కు 11.40 రేటింగ్ దక్కింది. దీంతో ఈ షో చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది.

  MAA Elections: ప్యానెల్‌ను ప్రకటించిన మంచు విష్ణు.. ఆ సినీ జంటకు రెండు పదవులు.. సంపూ కూడా!

  రేటింగ్ ఎక్కువే.. ఎన్టీఆర్ రేంజ్‌ కాదు

  రేటింగ్ ఎక్కువే.. ఎన్టీఆర్ రేంజ్‌ కాదు

  తెలుగు బుల్లితెరపై సక్సెస్ అయిన షోలలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు' ఒకటి. ఇప్పుడు ఈ సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేస్తుండడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి వారం సగటున దీనికి 5 పైచిలుకు రేటింగ్ దక్కింది. గతంలో కంటే ఇది ఎక్కువే అయినా.. ఎన్టీఆర్ రేంజ్‌కు మాత్రం చాలా తక్కువే అన్న టాక్ వినిపించింది.

  క్రమ క్రమంగా పెరుగుతోన్న స్పందన

  క్రమ క్రమంగా పెరుగుతోన్న స్పందన

  ‘ఎవరు మీలో కోటీశ్వరులు' మొదటి వారం రేటింగ్ సోసోగానే వచ్చినా.. ఆ తర్వాత నుంచి దీనికి ప్రేక్షకుల స్పందన క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్ అద్భుతమైన హోస్టింగ్‌తో ఇది ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. దీంతో రెండో వారం 6కు దగ్గరగా రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత మూడో వారం కూడా మరికాస్త పెరిగింది. దీంతో ఈ షో సగటు రేటింగ్ వారం వారం పెరుగుతోంది.

  Bigg Boss: బయటపడిన రవి బండారం.. లహరి విషయంలో ప్రియ అన్నది నిజమే.. షాకిస్తోన్న వీడియో

  నాలుగో వారం రేటింగ్ అదుర్స్ అనేలా

  నాలుగో వారం రేటింగ్ అదుర్స్ అనేలా


  జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షో నాలుగో వారానికి సంబంధించిన రేటింగ్ తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ షోకు గత వారంలో సగటున 6.59 రేటింగ్ దక్కింది. దీంతో ఈ షో చరిత్రలోనే అత్యధిక స్పందన దక్కినట్లైంది. గతంలో ఇంత మొత్తంలో ఎప్పుడూ రేటింగ్ రాలేదు. దీంతో తారక్ పేరిట అరుదైన ఘనత వచ్చి చేరింది.

  బిగ్ బాస్ రికార్డును బద్దలు కొట్టేస్తూనే

  బిగ్ బాస్ రికార్డును బద్దలు కొట్టేస్తూనే

  తెలుగు బుల్లితెరపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తోన్న షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో ఐదో సీజన్ ఇటీవలే ప్రారంభం అయింది. ఇది రెండో వారంలో సగటున 6.18 రేటింగ్‌ను మాత్రమే అందుకుంది. అంటే బిగ్ బాస్ షోను ‘ఎవరు మీలో కోటీశ్వరులు' దాటిపోయిందన్న మాట. మరోవైపు, గత వారం బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌కు మాత్రం 9.96 రేటింగ్ రావడం విశేషం.

  English summary
  Jr NTR's Evaru Meelo Koteeswarulu Show Got 6.59 TRP in 4th Week. Akkineni Nagarjuna Bigg Boss Show Got 6.18 TRP in 2nd Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X