For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Show September 6th Episode: ఎన్టీఆర్‌నే కంగారు పట్టించిన మాస్టర్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?

  |

  యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో ఆసక్తికరంగా, వినోదపరంగా, నాలెడ్జ్‌కు పరీక్ష పెట్టే కార్యక్రమంగా కొనసాగుతున్నది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సం కావడంతో ఈ వారం టీచర్లతో షో నిర్వహించనున్నట్టు చెప్పారు. సోమవారం అంటే సెప్టెంబర్ 6వ తేదీన టెక్కలికి చెందిన టీచర్ సింహాచలం హాట్ సీట్‌పైకి వచ్చారు. పేదరికంలో పుట్టిన ఆయన కష్టపడి టీచర్ ఉద్యోగం సంపాదించారు. ప్రస్తుతం సొంత ఇంటి కలను సాకారం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌తో సింహాచలం ఎంత గెలుచుకొన్నారో తెలుసా?

  ఈ చరిత్రాత్మక సంఘటనలను కాలక్రమేణా సరైన ఆర్డర్ అమర్చండి

  ఈ చరిత్రాత్మక సంఘటనలను కాలక్రమేణా సరైన ఆర్డర్ అమర్చండి

  A) తెలంగాణ రాష్ట్ర అవతరణ
  B) ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం
  C) శ్రీ పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టడం
  D) ఆంధ్ర రాష్ట్ర అవతరణ

  Answer: D, C, B, A

  తక్కువ సమయంలో ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ పోటీలో 5.4 సెకన్ల సమయంలో జవాబు చెప్పిన టెక్కలికి చెందిన ఇంగ్లీష్ టీచర్ సింహాచలం హాట్ సీట్‌పైకి వచ్చారు.

   1000 రూపాయల కోసం

  1000 రూపాయల కోసం

  1. సాధారణంగా వీటిలో టీవీలో ఛానెల్ మార్చడానికి ఉపయోగించేది ఏది?

  a) టేప్ రికార్డర్
  b) డీవీడీ ప్లేయర్
  c) ఫ్లాష్ డ్రైవ్
  d) రిమోట్ కంట్రోల్

  Answer:రిమోట్ కంట్రోల్

  2000 రూపాయల కోసం

  2000 రూపాయల కోసం

  2. క్రికెట్‌లో అంపైర్ ఒక చేతిని పైకి లేపి చూపుడు వేలు చూపిస్తే ఏమని సంకేతం ఇచ్చినట్టు?
  a) థర్డ్ అంపైర్
  b) అవుట్
  c) ఫోర్
  d) ఓవర్ త్రో

  Answer:అవుట్

  3000 రూపాయల కోసం

  3000 రూపాయల కోసం

  3. ఈ సామెతను పూర్తి చేయండి: --- మీద గుగ్గిలం లాగా
  a) అగ్గి
  b) బుగ్గి
  c) లుంగి
  d) అంగి

  Answer: అగ్గి

  5000 రూపాయల కోసం

  5000 రూపాయల కోసం

  4. వీటిలో వేరు జాతికి సంబంధించని కూరగాయ ఏది
  a) క్యారెట్
  b) చిక్కుడు
  c) చిలకడ దుంప
  d) ముల్లంగి

  Answer: చిక్కుడు

  10000 రూపాయల కోసం

  10000 రూపాయల కోసం

  5. చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఉన్న ప్రసిద్ద దేవాలయంలో కొలువుదీరిన దేవుడు ఎవరు?
  a) నరసింహాస్వామి
  b) వినాయకుడు
  c) వెంకటేశ్వర స్వామి
  d) హనుమంతుడు

  Answer: వినాయకుడు

  20000 రూపాయల కోసం

  20000 రూపాయల కోసం

  6. చిత్రంలోని జెండా ఏ దేశందో గుర్తించండి
  a) భూటాన్
  b) యూఎస్ఏ
  c) నేపాల్
  d) శ్రీలంక

  Answer: శ్రీ లంక

   40000 రూపాయల కోసం

  40000 రూపాయల కోసం

  7. వీటిలో కథ మరియు ఎక్కువ భాగం చిత్రీకరణ విశాఖపట్నంలో జరిగిన చిత్రం ఏది?
  a) కేరాఫ్ కంచరపాలెం
  b) 7 జీ బృందావన్ కాలనీ
  c) హనుమాన్ జంక్షన్
  d) అన్నవరం

  Answer: కేరాఫ్ కంచరపాలెం

  80000 రూపాయల కోసం

  80000 రూపాయల కోసం

  8. వీటిలో ఇత్తడి సమానులకు, గంటలకు జీఐ ట్యాగ్ పొందిన ప్రదేశం ఏది?
  a) కొండపల్లి
  b) మచిలీపట్నం
  c) భూదాన్ పోచంపల్లి
  d) బుడితి

  Answer: బుడితి

  16000 రూపాయల కోసం

  16000 రూపాయల కోసం

  9. ఫిబ్రవరి 2021లో ప్రారంభించిన ఇన్‌టెన్సిఫైడ్ మిషన్ ఇంధ్రధనుష్ 3.0 యొక్క లక్ష్యం ఏమిటి?
  a) టీకాలు వేయించడం
  b) అడవులు విస్తరణ
  c) కాలుష్య నివారణ
  d) గంగా పునరుద్దరణ

  Answer: టీకాలు వేయించడం

  32000 రూపాయల కోసం

  32000 రూపాయల కోసం

  10. రామాయణంలో సుగ్రీవుడు, వాలి లాగా కనిపించకుండా ఉండటానికి, వారిద్దరి పోరాట సమయంలో ఏమి ధరించాడు?
  a) కిరీటం
  b) ఉగరం
  c) కడియం
  d) మాల

  Answer:మాల

  పై ప్రశ్నకు సమాధానం చెప్పడంతో సింహాచలం 320000 రూపాయలు గెలుచుకొన్నారు. దీంతో ఈ షో నుంచి కనీసం 320000 గెలుచుకొనే అవకాశం కలిగింది. దాంతో ఎన్టీఆర్ చెక్‌పై సంతకం చేసి ఇచ్చాడు. అయితే ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఎన్టీఆర్ అడిగితే... సుమారు 30 లక్షలు అవుతుంది అని సింహాచలం చెప్పారు.

  620000 రూపాయల కోసం

  620000 రూపాయల కోసం

  11. రచయిత ఓల్గా, వీటిలో ఏ రచనకు సాహిత్య అకాడమీ పురస్కారం అందుకొన్నారు?
  a) స్వేచ్ఛ
  b) రాజకీయ కథలు
  c) విముక్త
  d) గులాబీలు

  Answer: విముక్త

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఆడియెన్స్ పోల్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకొన్నారు. అయితే ఆడియెన్స్ ఇచ్చిన ప్రకారం విముక్తకు ఎక్కువ మంది ఓటు వేయడంతో సింహాచలం సీ ఆప్షన్‌ను ఎంచుకొన్నారు. దాంతో 640000 రూపాయలు గెలుచుకొన్నారు. రచయిత ఓల్గా అసలు పేరు లలితా కుమారి. 2015లో ఈ అవార్డు లభించింది అని ఎన్టీఆర్ చెప్పారు.

  Legendary Director Raghavendra Rao Releases Pellikuturu Party Trailer
  1250000

  1250000

  12. ఆంధ్ర మహిళా సభ స్థాపించిన దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ వివాహం చేసుకొన్న వ్యక్తి. వీటిలో ఏ పదవిని చేపట్టిన మొదటి భారతీయుడు?
  a) ఆర్బీఐ గవర్నర్
  b) చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్
  c) భారత ప్రధాన న్యాయమూర్తి
  d) అటార్నీ జనరల్

  Answer: ఆర్బీఐ గవర్నర్

  పై ప్రశ్నకు సింహాచలం తడుముకోకుండా అర్బీఐ జనరల్ అంటూ సమాధానం చెప్పారు. దాంతో 1260000 రూపాయలు గెలుచుకొన్నారు. దాంతో ఎన్టీఆర్ మరో చెక్‌పై సంతకం చేసి పక్కన పెట్టారు. మీరు మరింత ఇక్కడ గెలుచుకోవాలని అనుకొంటున్నాను అని అంటూ.. 25 లక్షల ప్రశ్నను వేయడానికి సిద్ధం కాగా.. హ్యూటర్ (శంఖం) మోగడంతో ఈ రోజు సమయం ముగిసింది. దాంతో సింహాచలం రోల్ ఓవర్ కాంటెస్టెంట్‌గా ఈ గేమ్‌ను మంగళవారం ( సెప్టెంబర్ 07 తేదీన) ఆడనున్నారు.

  English summary
  Evaru Meelo Koteeswarulu Show September 6th Episode: Simhachalam of Tekkali of Chittor, has participated in this show. Here is the questions and Answers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X