twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీళ్లంతా ఫేక్ ఆడియన్స్... సంపాదన కూడా బాగానే ఉంది!

    చైనాలో ‘ఫేక్ ఆడియన్స్’జాబ్ ఒక ప్రొఫెషన్ గా, పరిశ్రమగా వృద్ది చెందుతోంది. టీవీ షోలలో ఆడియన్స్ లాగా పాల్గొనడం ద్వారా రూ. 7 నుండి 10వేలు సంపాదిస్తున్నారు.

    By Bojja Kumar
    |

    ఫేక్ ఆడియన్స్... వినడానికే చాలా కొత్తగా ఉంది కదూ ఈ పదం. మీరు విన్నది నిజమే....వీరంతా నకిలీ ఆడియన్స్. బుల్లితెర రంగం వెండితెర రంగం పోటీ పడుతున్న ఈ కాలంలో ఇలాంటి ఫేక్ ఆడియన్స్ అవసరం కూడా టీవీ ఇండస్ట్రీకి బాగా పెరిగింది.

    మన దగ్గర ఇది ఇంకా ప్రొఫెషన్ స్థాయికి ఎదగలేదు కానీ.... చైనాలో ఫేక్ ఆడియన్స్ అనేది ఓ ఉద్యోగంలా మారిపోయింది. అందుకే అక్కడ వారిని ప్రొఫెషనల్ ఆడియన్స్ అని పిలుస్తుంటారు. వీరు చేసే పని.... రియాల్టీ షోలలో మామూలు ప్రేక్షకుల మాదిరిగా కలిసిపోయి తమదైన ప్రత్యేకత, హావభావాలు, నవ్వులు, ఏడుపులు, అరవడం లాంటివి చేసి షోకు మరింత ఉత్సాహాన్ని తేవడమే.

    ఒక్కో షోకు 120 నుండి 160 డాలర్లు

    ఒక్కో షోకు 120 నుండి 160 డాలర్లు

    ఈ ఫేక్ ఆడియన్స్‌ ఒక్క షోలో పాల్గొనడం ద్వారా అత్యధికంగా 120 నుండి 160 యూఎస్ డాలర్లు వేతనంగా పొందుతున్నారట. అంటే దాదాపు రూ. 7 వేల నుండి 10 వేల రూపాయలన్నమాట.

    ఆదరణ పెరుగుతోంది

    ఆదరణ పెరుగుతోంది

    2014 నుంచి ఈ ఇండస్ట్రీకి ఆదరణ పెరుగుతోంది. సాధారణ ప్రేక్షకుల మధ్యలో కూర్చొని కార్యక్రమంలో జరిగే సంఘటనలకు చక్కటి స్పందనను.. హావభావాలను ప్రదర్శించాలి. అంటే చప్పట్లు కొట్టడం.. నవ్వడం.. ఏడవటం.. కేకలు వేస్తూ అల్లరి చేయడం ఇలాంటివి వీరు చేస్తారు.

    180 మిలియన్ యువాన్లు

    180 మిలియన్ యువాన్లు

    చైనాలో బుల్లితెర రంగం నుండి ‘ప్రొఫెషనల్ ఆడియన్స్' కు సంవత్సరానికి 180 మిలియన్ యువాన్లు(దాదాపు రూ. 170 కోట్లు) చెల్లింపులు జరుగుతున్నాయట.

    ప్రొఫెషన్‌గా

    ప్రొఫెషన్‌గా

    ఇపుడంతా రియాల్టీ షోల కాలం. దీంతో ఆడియన్స్ అవసరం కూడా బాగా పెరిగింది. దీంతో దీన్ని ప్రొఫెషన్ గా ఎంచుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. చైనాలో ఏ రియాల్టీ షో అయినా, టీవీ కార్యక్రమైనా ‘ప్రొఫెషనల్ ఆడియన్స్'ను హైర్ చేసుకోవడం ఇపుడు చాలా కామన్ అయిపోయింది.

    ఇది కూడా నటనే

    ఇది కూడా నటనే

    ఇది కూడా ఒకరంగా నటన లాంటిదే. తమకు నచ్చినా నచ్చక పోయినా షో ఎంజాయ్ చేస్తున్నట్లు, ఎగ్జైట్ అవుతున్నట్లు నటించాలి. బాగా మెప్పించిన వారికి ‘బావ్‌లింగ్‌ బాయ్స్‌'.. ‘గ్రీవింగ్‌ గర్ల్స్‌'.. ‘ఎమోషనల్‌ ఎంపరర్స్‌' అంటూ బిరుదులివ్వడంతో పాటు పారితోషికం కూడా బాగా ఇస్తారట.

    English summary
    Fake Audience Members in China Make $120 Per Show By Crying and Laughing. These actors make up the country’s lucrative “professional audience” industry, now pegged to be worth over 180 million yuan ($26.5 million) since its boom in 2014.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X