»   » సెక్సువల్ గా హెరాస్ చేసాడు: కంప్లైంట్ చేసి, ఫేస్ బుక్ లో అతని ఫొటోతో పోస్ట్ పెట్టిన నటి

సెక్సువల్ గా హెరాస్ చేసాడు: కంప్లైంట్ చేసి, ఫేస్ బుక్ లో అతని ఫొటోతో పోస్ట్ పెట్టిన నటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 'చోకర్ బాలి', 'పరిణీత' వంటి సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యి..తర్వాత హిందీ టీవీ చానల్‌ కలర్స్‌ వారి 'ఉత్తరన్‌' షో చేస్తున్న స్టార్‌ టీనా దత్తాకు సెక్సవల్ హెరాస్ మెంట్స్ ఎదురయ్యాయి. ఈ విషయమై ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది.

దాంతో ప్రపంచానికి ఈ విషయం తెలిసిందే. తనను విమానంలో ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడని ఆమె తెలియచేసింది. దీనిపై ఫ్లైట్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. టీనా దత్తా

ఈ విషయం వైరల్‌ కావాలంటూ... తన ఫేస్‌బుక్‌ పేజీలో జరిగిన విషయాన్నంతటినీ పోస్ట్‌ చేసింది. శుక్రవారం ఉదయం టీనా జెట్‌ ఎయిర్‌ వేస్‌ విమానంలో ముంబై నుంచి రాజ్‌కోట్‌కు ప్రయాణమయ్యారు. ఫ్లైట్‌లో ఎక్కి కూర్చున్న ఆమెను టేకాఫ్‌కు కొద్ది సమయం ఉందనగా వెనక సీటులోని రాజేశ్‌ అనే వ్యక్తి వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో ఆగ్రహించిన టీనా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో ఎఫ్‌బీలో పోస్ట్‌ చేసింది.

 Tina Dutta

ఈ నెల 6న ఆమె ముంబై నుంచి రాజ్ కోట్ వెళ్లేందుకు జెట్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం ఎక్కారు. విమానం టేకాఫ్ కు ముందు తన మేనేజర్ తో వర్క్ రిలేటెడ్ అంశాలు మాట్లాడుతున్నారు. ఇంతలో పక్కసీట్లో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా చేతులతో అసభ్యకరంగా తాకాడట. దీంతో ఆమె సిబ్బందికి ఫిర్యాదు చేయగా, అది సాధారణమేనని పేర్కొని, అతని సీట్ మార్చేశారట. దీనిపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

సహ ప్రయాణికులు కూడా తనకు మాటసాయం చేయలేదని వాపోతోంది. భద్రతా ఏర్పాట్లు చేయరా? అంటూ ఆమె జెట్ ఎయిర్ వేస్ ను ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు తాను జెట్ ఎయిర్ వేస్ విమానాల్లోనే ప్రయాణించే దానినని, ఇకపై అలా ప్రయాణించనని ఆమె చెప్పింది. ఇలాంటి ఘటనలపై ప్రశ్నించాలని చెప్పిన ఆమె, దీనిని వైరల్ చేయాలని సూచించింది. మహిళలకు భద్రత అవసరమని చెప్పింది.

English summary
Famous TV actress Tina Dutta who has worked in famous show “Uttaran” had a ghastly ordeal while venturing out from Mumbai to Rajkot for an occasion. She was a casualty to inappropriate behavior on the flight she was ready.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu