Don't Miss!
- Lifestyle
మీ పార్ట్నర్ ఎప్పుడూ మూడీగా ఉంటారా? వారితో వేగలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
- News
YS Avinash Reddy : అవినాష్ కు సీబీఐ ప్రశ్నలివే-2గంటలకు పైగా విచారణ-లాయర్ కూ నో ఎంట్రీ..!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
కంట్రోల్ చేసుకోలేకపోయిన వంటలక్క.. స్టేజ్ పైనే డాక్టర్ బాబుని ముద్దు పెట్టుకొని కౌగిలింతలు..
ఇటీవల కాలంలో టెలివిజన్ ప్రపంచంలో అత్యధిక స్థాయిలో రేటింగ్స్ అందుకున్న సీరియల్స్ చాలా తక్కువే అని చెప్పాలి. ఇక అందులో కార్తీకదీపం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ మొదట స్టార్ట్ అయినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ మొదలైన కొన్ని వారాలకి ఊహించని స్థాయిలో రేటింగ్స్ అందుకుని ఒక బ్రాండ్ గా నిలిచిపోయింది. అయితే ఈ సీరియల్ ముగింపు దశకు చేరుకోవడంతో ఒక షోలో పాల్గొన్న సీరియల్ నటీనటులు చాలా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా వంటలక్క డాక్టర్ బాబుని కౌగిలించుకొని ముద్దులు పెట్టింది. ఆ వివరాలలోకి వెళితే..

రికార్డులను బ్రేక్ చేసేలా రేటింగ్స్
ఇటీవల కాలంలో అయితే టెలివిజన్ సీరియల్స్ కు చాలా తక్కువ స్థాయిలో ఆదరణ దక్కుతోంది. డిఫరెంట్ ఓటీటీ కంటెంట్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అభిరుచులు కూడా మారాయి. అయితే ఎదో ఒకటి రెండు సీరియల్స్ మాత్రమే రేటింగ్స్ తో దూసుకుపోతున్నాయి. ఒక విధంగా కార్తీకదీపం అయితే స్టార్ మాకు ఊహించని స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ సీరియల్ టెలివిజన్ రేటింగ్స్ లో రికార్డులను బ్రేక్ చేస్తూ వెళుతొంది.

బోర్ అని ఫీల్ అవ్వకుండా
దాదాపు ఆరేళ్లుగా కార్తీకదీపం సీరియల్ కు ఎదురులేదు అని చెప్పాలి. మధ్యలో ఈ సీరియల్ ఆగిపోతుంది అని ఒక టాక్ అయితే వినిపించింది. కానీ రేటింగ్ బాగుండడంతో ప్రొడక్షన్ వారు ఏమాత్రం ఆపలేదు. అసలైతే కంటెంట్ ఇంకా లేకపోయినప్పటికీ కూడా సీరియల్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రేక్షకులు ఈ సీరియల్ బోర్ అని ఫీల్ అవ్వకుండా చూస్తూనే ఉన్నారు.

స్టార్ క్యాస్ట్ కు మంచి క్రేజ్
సోషల్ మీడియాలో కూడా కార్తీక దీపంకు సంబంధించిన మీమ్స్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో ఉండే కార్తిక దీపం సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది. ఇక వంటలక్క పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమీ విశ్వనాధ్ నటించే విధానం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక లీడ్ పాత్రలో పరిటాల నిరూపన్ కూడా మంచి క్రియేషన్ అందుకున్నాడు.

శుభం కార్డు పడుతున్న సందర్భంగా
అయితే ఇప్పుడు ఈ సీరియల్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ వారం అయితే శుభం కార్డు పడిపోతుందనే క్రమంలో స్టార్ మా పరివార్ ప్రోగ్రాంలో కార్తీక దీపానికి సంబంధించిన నటీనటులను ఇన్వైట్ చేశారు. పరిటాల నిరూపమ్ తో ప్రేమి అలాగే శౌర్య, హిమా, సౌందర్య అందరూ కూడా ఈ షోలో అడుగు పెట్టారు. వీరికి గ్రాండ్గా ఫేర్వెల్ ఇచ్చేందుకు నిర్వాహకులు వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

ముద్దు పెట్టిన వంటలక్క
అయితే స్టేజ్ పైన పాటలకు డాన్స్ చేసిన ప్రేమీ నిరుపమ్ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పుడే కుట్టింది చీమ డాక్టర్ బాబు అంటే నాకు ప్రేమ.. అనే డైలాగ్ తో కూడా ఆమె ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సీరియల్ ఇంత త్వరగా ముగిసినట్టు అనిపిస్తుంది అని చాలా బాధగా ఉంది అని ప్రేమి విశ్వనాథ్ కూడా చాలా ఎమోషనల్ అయ్యింది. డాక్టర్ బాబుకి ప్రేమగా ముద్దు పెట్టింది. కౌగిలించుకొని మరి ఏడ్చేసింది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This Episode of Aadivaaram With Star Maa Parivaaram features a farewell party for the Karthika Deepam Team. Watch a journey filled with emotions and Hilarious Comedy this Sunday at 11 Am only on #StarMaa #AadivaaramwithStarMaaParivaaram #karthikadeepam #starmaaserials pic.twitter.com/I4BI6Z3Vym
— Starmaa (@StarMaa) January 16, 2023