For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5 first week elimination: సర్వేలో తేలింది ఇదే.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

  |

  టెలివిజన్ ప్రపంచంలో టాప్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో తెలుగు లో 5వ సీజన్ తో ఇటీవల అంగరంగ వైభవంగా మొదలైంది. మరోసారి నాగార్జున హోస్టింగ్ తో గ్రాండ్ గా స్టార్ట్ అయినటువంటి వేడుక మంచి రేటింగ్స్ ను అందుకుంటోంది. అసలు తెలుగులో హిట్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ మొత్తానికి ఎన్టీఆర్, నాని ఆ తరువాత నాగార్జున ఎవరి స్టైల్లో వారు మంచి హోస్టింగ్ తో ఈ రియాల్టీ షో ను ముందుకు కొనసాగించారు.

  ఇక మొదటి వారానికి దగ్గరవుతున్న బిగ్ బాస్ సీజన్ 5పై ప్రస్తుతం అనేక రకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక ఇటీవల ఫిల్మీ బీట్ తెలుగు ప్రత్యేకంగా నిర్వహించిన సర్వేలో ఒక ప్రత్యేకమైన ఫీడ్ బ్యాక్ అందుకుంది. బిగ్ బాస్ 5 కోసం ప్రత్యేకంగా నిర్వహించిన పోల్స్ ద్వారా నెటిజన్లు వారి అభిప్రాయాలను తెలియజేశారు.

  ప్రారంభ వేడుక ఎలా ఉందంటే?

  ప్రారంభ వేడుక ఎలా ఉందంటే?

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 వేడుక గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. అయితే గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ స్థాయిలో ఖర్చు చేసి మొదటి ఎపిసోడ్ లో స్టార్ట్ చేశారట. కంటెస్టెంట్స్ ను భారీ స్థాయిలో ఇన్వైట్ చేసినా నిర్వాహకులు దాదాపు రెండు కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అయితే టాక్ వచ్చింది. ఇక మొదటి ఎపిసోడ్ బాగుంది అని 40.38 శాతం మంది జనాలు మద్దతు పలికారు. ఇక బాగాలేదని 44.23% మంది వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. చెప్పలేం అంటూ మరో 17.38 శాతం మంది వివరణ ఇచ్చారు.

  ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్?

  ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్?

  బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో ఈసారి నిర్వాహకులు డిఫరెంట్ గా ఆలోచించారు అని అర్ధమయ్యింది. ఈసారి మాంచి క్రేజ్ కలిగిన కొంత మంది సెలబ్రెటీలను కంటెస్టెంట్ గా రంగంలోకి దింపారు. ఇక ప్రస్తుతం టాప్ లిస్టులో యాంకర్ రవి షణ్ముఖ్ జస్వంత్ లోబో వంటివారు ఉన్నారు అయితే ఇందులో ఎవరు బెస్ట్ అని అనుకుంటున్నారు అనే ప్రశ్నకు 55.36 శాతం మంది యాంకర్ రవికి ఓటు వేశారు. ఇక షణ్ముక్ బెస్ట్ అని 25% శాతం మంది మద్దతు పలకగా లోబోకు కేవలం 19.64శాతం ఓట్లు లభించాయి.

  నాగార్జున హోస్టింగ్ ఎలా ఉంది?

  నాగార్జున హోస్టింగ్ ఎలా ఉంది?

  బిగ్ బాస్ సీజన్ 1 జూనియర్ ఎన్టీఆర్ గ్రాండ్ గా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఆ బాధ్యతను నేచురల్ స్టార్ నాని కూడా తనదైన శైలిలో పూర్తి చేశాడు. ఆ తర్వాత మూడవ సీజన్ నుంచి కొనసాగుతున్న నాగార్జున ఇప్పుడు 5వ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక మొదటి ఎపిసోడ్ లో నాగార్జున హోస్టింగ్ ఎలా ఉంది అనే విషయంపై 55.93 శాతం జనాలు బాగుందని అన్నారు. ఇక 33.9% జనాలు బాగా లేదు అని అన్నారు. ఇక 10% జనాలు చెప్పేలేము అన్నారు.

  ఎంపిక ఎలా ఉంది?

  ఎంపిక ఎలా ఉంది?

  ఇక బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో ఈసారి నిర్వాహకులు ఎంతవరకు సంతృప్తి పరచాలనే విషయంలోకి వెళితే బాగుంది అని కేవలం 27.91 శాతం మంది మాత్రమే అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక బాగాలేదని దాదాపు 65.12 శాతం మంది తెలియజేశారు. ఇక మరొక 6.98% ఉంది చెప్పేలము అని వారి వివరణ ఇచ్చారు.

  లోబో.. నచ్చేలా ఉన్నాడా?

  లోబో.. నచ్చేలా ఉన్నాడా?

  ఇక బిగ్ బాస్ షో లో ప్రతిసారి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించే కొంతమంది కమెడియన్స్ తీసుకు రావడం ఆనవాయితీగా వస్తున్నదే. ఇక ఈ సారి ఆ బాధ్యతను లోబో మీద వేసినట్లుగా అర్థమవుతోంది. అతనికి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు. అయితే బిగ్ బాస్ షోలో లో బాడీ లాంగ్వేజ్ మాటతీరు అందరికీ నచ్చేలా ఉన్నాయా లేదా అనే ప్రశ్నకు.. బాగానే ఉంది అంటూ 43.48 శాతం మంది ఓటు వేశారు. ఇక నచ్చడం లేదు అంటూ 41.3 శాతం వారి వివరణ ఇచ్చారు. ఇక ఏమీ అర్థం కావడం లేదు అంటూ 15.22 శాతం మంది అభిప్రాయాన్ని తెలియజేశారు.

  Kangana Ranaut True Admirer Of Jayalalitha | Thalaivii Interview
  ఎలిమినెట్ అయ్యేది ఎవరు?

  ఎలిమినెట్ అయ్యేది ఎవరు?

  బిగ్ బాస్ తెలుగు 5 షోలో తొలివారం నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని సందేహం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇక వెళ్లిపోయే ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంది అనే విషయంలో నెటిజన్లు ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. యాంకర్ రవి వెళ్లిపోయే అవకాశం ఉందని 7.69% నెటిజన్లు ఓటు వేశారు. ఇక కాజల్ 7.69%, సరయు 15.38%, మోడల్ జస్వంత్ 30.77%, హామీదా 25.4%, మానస్ నాగులపల్లి 12.82% ఓట్లతో నెటీజన్స్ వారి వివరణ ఇచ్చారు.

  English summary
  Filmibeat Survey on Bigg Boss Telugu 5 first week elimination: Is Hamida Khatoon in Threat
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X