»   » చిన్నారి పెళ్లి కూతురు... నటిపై కేసు నమోదు

చిన్నారి పెళ్లి కూతురు... నటిపై కేసు నమోదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘చిన్నారి పెళ్లి కూతురు' సిరీయల్ ఫేం స్మిత బన్సాన్, ఆమె కుటుంబ సభ్యులమీద కేసు నమోదైంది. స్మితా మరదలు మేఘా గుప్తా.... ఫిర్యాదు మేరకు స్మితతో పాటు ఆమె సోదరుడు సౌరభ్, ఇతర కుటుంబ సభ్యులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.

స్మితా సోదరుడు సౌరబ్‌కి మేఘా గుప్తాతో 2009లో వివాహమైంది. ఆ తర్వాత సౌరబ్‌ భార్యతో కలిసి గుర్ గావ్‌లో నివసిస్తున్నాడు. స్మితతో పాటు కుటుంబసభ్యులు కట్నం కోసం వేధిస్తున్నారని, తన దగ్గరున్న నగలు, డబ్బు లాగేసుకున్నారని ఆరోపిస్తూ మేఘా గుప్తా పెళ్లికి వెళ్లడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

FIR against Balika Vadhu actress Smita Bansal and her family

భర్త సౌరభ్ తో పాటు, ఆయన తండ్రి తనను డబ్బు కోసం వేధిస్తున్నారని, రూ. 50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని, స్మిత తన నగలు అనుమతి లేకుండా వెడ్డింగ్ పార్టీలకు తీసుకెలుతుందని, తనను తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని మేఘ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

హిందీ బుల్లితెరపై స్మిత బన్సాస్ పాపులర్ నటి. ఆమె నటించిన బాలికా వధు సీరియల్ తెలుగులో ‘చిన్నారి పెళ్లి కూతురు'గా ప్రసారం అయింది. దీంతో సౌత్ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. ఆ మధ్య ఆమె కేజ్రీ వాల్ కు మద్దతు ప్రకటించి వార్తల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు కావడం చర్చనీయాంశం అయింది.

English summary
If reports are to be believed, TV actress Smita Bansal is in legal trouble, as her sister-in-law Megha Gupta (married to her brother Saurabh), has registered an FIR against the actress and her family for dowry harassment. Megha has alleged that her husband Saurabh and his family have taken away her jewellery and money.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu