Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
బిగ్ బాస్ విన్నర్ సీక్రెట్ లీక్ చేసిన గంగవ్వ: అందరూ అతడి పేరు చెబితే.. ఈమె మాత్రం అలా!
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో చూపించిన చూపిస్తోన్న ప్రభావం అంతా ఇంతా కాదు. ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభమై, కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాదరణను అందుకుందీ షో. ఈ షో ద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లో పాపులారిటీ పెంచుకుంటున్నారు. ఇలా నాలుగో సీజన్ ద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకున్నారు విలేజ్ స్టార్ గంగవ్వ. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె బిగ్ బాస్ విన్నర్ సీక్రెట్ లీక్ చేశారు. అంతేకాదు, తనకెంతో ఇష్టమైన కంటెస్టెంట్‌కు భారీ షాకిచ్చారు. ఆ సంగతులు మీకోసం!

బిగ్ బాస్‌కు స్పెషల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ
‘మై విలేజ్ షో' అనే వీడియోల ద్వారా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయారు సహజ నటి గంగవ్వ. ఈ క్రేజ్‌తోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. స్పెషల్ కంటెస్టెంట్‌గా వచ్చిన ఆమెకు... షో నిర్వహకులు ప్రత్యేకమైన వసతులు కల్పించారు. అలాగే, నాగార్జున కూడా ఆమెను బాగా చూసుకోమని కంటెస్టెంట్లు అందరినీ ఆదేశించారు. దీంతో గంగవ్వ హవా చూపించారు.

అనూహ్యంగా బయటకొచ్చిన కంటెస్టెంట్
బిగ్ బాస్ హౌస్‌లో కండ బలం చూపించి కొందరు.. బుద్ధి బలం చూపించి మరికొందరు నెగ్గుకొస్తున్న సమయంలో టాస్కులు సరిగా ఆడకున్నా తన ప్రేమతో ప్రేక్షకులను మాయ చేశారు గంగవ్వ. ఇలానే చాలా వారాలు షోలో కొనసాగారు. అయితే, అక్కడి పరిస్థితులకు అలవాటు పడలేకపోయిన ఆమె.. అనారోగ్య కారణాలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.

ఆ హామీతో సంతోషంగా వెళ్లిన గంగవ్వ
తనకు ఐదుగురు అమ్మాయిలు ఉన్నారని, వాళ్లందరికీ పెళ్లి చేసేశానని గంగవ్వ చాలా సార్లు చెప్పారు. అదే సమయంలో తనకు సొంత ఇంటి కల ఉందని వెల్లడించారు. అందుకోసమే బిగ్ బాస్ షోకు వచ్చానని కూడా చెప్పారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కినేని నాగార్జున స్టేజ్ మీద ఉన్న సమయంలోనే ఆమెకు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గంగవ్వ సంతోషంగా వెళ్లారు.

అభిజీత్‌కు సర్‌ప్రైజ్ కాల్ చేసిన గంగవ్వ
ఎంతో ఆసక్తికరంగా సాగింది బిగ్ బాస్ నాలుగో సీజన్. అందరూ అనుకున్నట్లుగానే దీన్ని అభిజీత్ గెలుచుకున్నాడు. గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్నాడు. గెలిచిన తర్వాత అతడు వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఓ ఛానెల్‌లో చిట్ చాట్ చేస్తున్న సమయంలో గంగవ్వ అతడికి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఇద్దరిలో ఒకరు గెలుస్తారని అనుకున్నా
ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ‘మీకోసం ఓ స్పెషల్ గెస్ట్ కాల్ చేశారు. తను ఎవరో మీరు కనిపెట్టండి' అని కోరింది. దీనికి వెంటనే అభిజీత్.. కాల్ చేసింది గంగవ్వనా అంటూ పట్టేశాడు. దీంతో అంతా షాకయ్యారు. ఆ సమయంలో గంగవ్వ మాట్లాడుతూ.. ‘గెలిస్తే నేను లేకుంటే అభి అనుకున్నా. ఆ విషయం అతడికి కూడా చెప్పాను' అంటూ బిగ్ బాస్ విన్నర్‌పై ఓ సీక్రెట్‌ను లీక్ చేశారామె.

అందరూ అతడి పేరు చెబితే నేను మాత్రం
దీనిని కొనసాగిస్తూ.. ‘హౌస్‌లో, బయట అందరూ అఖిల్ సార్థక్ గెలుస్తాడని అన్నారు. కానీ, నేను మాత్రం అభిజీత్ విజేతగా నిలుస్తాడని చెప్పాను. ఇప్పుడదే జరిగింది' అని చెప్పుకొచ్చారు గంగవ్వ. అంతేకాదు, తన గృహప్రవేశ కార్యక్రమానికి అమ్మానాన్నను తీసుకుని రమ్మని, మంచిగా తిని దిట్టంగా తయారవమని అభిజీత్‌కు చెప్పారామె. ఈ కాల్‌తో బిగ్ బాస్ విన్నర్ ఫుల్ ఖుషీ అయ్యాడు.