Just In
- 16 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 40 min ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 45 min ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 52 min ago
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
Don't Miss!
- News
అనంత కలెక్టర్‌ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Sports
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ
- Automobiles
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బాస్‌లో దెయ్యం వాయిస్ ఆమెదే: అప్పుడు రన్నరప్ కంటెస్టెంట్.. ఇప్పుడేమో ఇలా!
దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతూ ఇండియన్ టెలివిజన్ రికార్డులను క్రియేట్ చేస్తోంది బిగ్ బాస్ షో. మిగిలిన వాటితో పోలిస్తే తెలుగులో ప్రసారమయ్యే షోకే భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ నమోదైన రికార్డులే అందుకు నిదర్శనం. ఇంతటి ప్రభావం చూపిస్తోన్న షోను మరింత ఆసక్తికరంగా మలిచేందుకు బిగ్ బాస్ యూనిట్ దెయ్యాన్ని తీసుకొచ్చింది. దాని ఎంట్రీ తర్వాత గెటప్ వేసిన ఆమె ఎవరు? వాయిస్ ఎవరిది? అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దెయ్యానికి వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎవరో తెలిసిపోయింది. ఆ వివరాలు మీకోసం!

ఇంట్రెస్టింగ్‌గా మొదలైన 12వ వారం
బిగ్ బాస్ నాలుగో సీజన్ రోజురోజుకూ ఆసక్తిని రేతెత్తిస్తూ సాగుతోంది. ఇప్పటికే ఈ షోలో ఎన్నో సరికొత్త అంశాలను పరిచయం చేసిన నిర్వహకులు.. ఈ వారం ఫ్రీ ఎవిక్షన్ పాస్ అనే కొత్త పద్దతిని పరిచయం చేశారు. దీని ప్రకారం.. నామినేట్ అయిన వారిలో ఒకరికి ఓ వారం ఎలిమినేషన్ నుంచి ఇమ్యూనిటీ లభిస్తుంది. దీన్ని అవినాష్ గెలుచుకున్న విషయం తెలిసిందే.

దెయ్యం ఎంట్రీతో మరింతగా పెరిగింది
ఫైనల్‌కు చేరువ అవుతుండడంతో బిగ్ బాస్ యూనిట్ సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. షోను మరింత రంజుగా నడిపేందుకు హౌస్‌లోకి దెయ్యాన్ని తీసుకొచ్చారు. దీన్ని మొదటిగా చూసిన ఆరియానా గ్లోరీ.. తెగ భయపడిపోయింది. ఆ తర్వాత అందరూ లైట్ తీసుకున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్‌లోనూ ఇదే టాస్కును తీసుకు వచ్చిన సంగతి విధితమే.

టాస్కులు ఇస్తున్న దెయ్యం జలజ
తన పేరును జలజగా చెప్పుకున్న దెయ్యం.. బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లతో మాట్లాడింది. ఈ క్రమంలోనే అందరినీ పేరు పెట్టి మరీ పిలిచింది. అయితే, అభిజీత్‌ను మాత్రం ‘ఒరేయ్.. తెలివైనోడా' అంటూ సంభోదించింది. ఈ క్రమంలోనే ప్రతీ హౌస్‌మేట్‌కు దెయ్యం జలజ టాస్కులు ఇచ్చింది. వీటిని కంటెస్టెంట్లు అందరూ చేయడానికి ముందుకు రాగా, అభిజీత్ మాత్రం నిరాకరించాడు.

దెయ్యం హరితేజ.. కాదని చెప్పింది
బుధవారం రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు ఒక్కొక్కటిగా వదిలింది స్టార్ మా. దీంతో ఆ దెయ్యం అందరి కంటా పడింది. అది చూసిన వెంటనే పలానా వ్యక్తి అని సోషల్ మీడియాలో తమకు తోచిన పేరును చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే నటి హరితేజ పేరు హాట్ టాపిక్ అయింది. దీంతో స్వయంగా స్పందించిన ఆమె.. తానా దెయ్యం కాదని క్లారిటీ ఇచ్చింది.

ఆ గొంతు ఎవరిదో చెప్పిన అవినాష్
ప్రస్తుత సీజన్‌లో ఉన్న కంటెస్టెంట్లు.. గతంలో పాల్గొన్న వారి కంటే తెలివైన వారిలా కనిపిస్తున్నారు. బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చినా ముందే ఊహించగలుగుతున్నారు. మొదటి నుంచీ ఇదే కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎంట్రీ ఇచ్చిన దెయ్యం గురించి తమకు తోచినట్లు చెబుతున్నారు. అవినాష్ అయితే ఆ వాయిస్ ఆర్జే సునీత గారిదే అంటూ పదే పదే అన్నాడు.

బిగ్ బాస్‌లో దెయ్యం వాయిస్ ఆమెదే
తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ హౌస్‌లో దెయ్యానికి వాయిస్ ఓవర్ ఇచ్చింది మాజీ కంటెస్టెంట్, సింగర్ గీతా మాధురి అట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొన్న గీతా మాధురి ఫైనల్స్ వరకు వెళ్లింది. తుది ఇద్దరిలో కౌశల్ మండా విన్నర్ కాగా, ఈమె రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.