For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: బాత్రూంలో బోల్డు బ్యూటీ గలీజ్‌గా.. అవి కనిపించడంతో తట్టుకోలేక!

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే అసాధారణ రెస్పాన్స్‌తో గతంలో ఏ షోకూ సాధ్యం కాని విధంగా సూపర్ సక్సెస్ అయింది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. మన ప్రేక్షకులు ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. ఈ ప్రోగ్రామ్‌కు భారీ స్థాయిలో స్పందనను అందించారు. తద్వారా సూపర్ డూపర్ హిట్‌ షోగా మార్చేశారు. అందుకే ఇది ఏకంగా సీజన్ల మీద సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. వాటిలో దేనికదే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలోనే గత ఆదివారం ఆరో సీజన్ కూడా అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బాత్రూం వివాదం గొడవకు కారణం అయింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!

  వైభవంగా మొదలైన ఆరో సీజన్

  వైభవంగా మొదలైన ఆరో సీజన్

  తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు ప్రారంభం అయినా దానికి అదిరిపోయే స్పందన వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రీమియర్ ఎపిసోడ్‌ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అలాగే, గత ఆదివారం సాయంత్రం ఆరో సీజన్ కూడా అంచనాలకు తగ్గట్లుగానే మొదలైంది. ఇందులో కంటెస్టెంట్ల ఆటపాటలు, కొత్త టాస్కులతో ఎంతో సందడిగా సాగిపోయింది.

  Manchu Manoj రెండో పెళ్లి.. కాబోయే శ్రీమతితో పూజలు.. ఎవరీ మౌనికారెడ్డి?

  తొలిసారి అంత మందితో రికార్డు

  తొలిసారి అంత మందితో రికార్డు

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో రికార్డు స్థాయిలో 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు హౌస్‌లోకి అడుగు పెట్టారు.

  ఆరంభం నుంచే ఆసక్తికరంగానే

  ఆరంభం నుంచే ఆసక్తికరంగానే

  సాధారణంగా బిగ్ బాస్ షో అంటే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. అందులోనూ ఐదు సీజన్లను నేషనల్ రేంజ్‌లో హిట్లుగా మార్చుకున్న దీనికి అభిమానులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. దీంతో ఆరో సీజన్‌పై ఆరంభం నుంచే భారీ బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో షో నిర్వహకులు అదిరిపోయేలా దీన్ని డిజైన్ చేసినట్లు మొదట్లోనే తెలిసిపోయింది.

  హాట్ షోలో హద్దు దాటిన జబర్ధస్త్ రీతూ చౌదరి: తొలిసారి బికినీలో అందాల ఆరబోత

  నామినేషన్ లేకున్నా గొడవలతో

  నామినేషన్ లేకున్నా గొడవలతో

  సాధారణంగా బిగ్ బాస్ షోలో సోమవారం ఎపిసోడ్‌లోనే నామినేషన్స్ టాస్కును నిర్వహించేవారు. కానీ, ఆరో సీజన్‌లో మాత్రం ఈ టాస్కును పెట్టలేదు. పైగా మొదటి రోజే ఓ టాస్కును కూడా నిర్వహించారు. అంతేకాదు, అంతకు ముందు తర్వాత కొన్ని గొడవలను చూపించారు. దీంతో నామినేషన్స్ టాస్క్ లేకున్నా ఈ ఎపిసోడ్ మాత్రం రచ్చ రచ్చగానే సాగిందని చెప్పుకోవచ్చు.

  బాత్రూంలో బోల్టు బ్యూటీ గలీజ్

  బాత్రూంలో బోల్టు బ్యూటీ గలీజ్

  సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో ఓ చిన్న సంఘటన పెద్ద గొడవకు దారి తీసింది. ఫైర్ బ్రాండ్ గీతూ రాయల్ బాత్రూంలోకి వెళ్లిన సమయంలో కొన్ని వెంట్రుకలు కనిపించాయి. దీంతో ఆమెకు ఎంతో కోపం వచ్చింది. వెంటనే నిన్న రాత్రి ఎవరు స్నానం చేశారని ప్రశ్నించింది. దీంతో బోల్టు బ్యూటీగా పేరొందిన ఇనయా సుల్తానానే ఫస్ట్ చేసిందని అక్కడున్న వాళ్లు కొందరు చెప్పారు.

  ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: ప్రైవేటు పార్టులను చూపిస్తూ దారుణంగా!

  ఇనయాపై గీతూ తిక్క ఆగ్రహం

  ఇనయాపై గీతూ తిక్క ఆగ్రహం


  బాత్రూంలో వెంట్రుకలు చూసిన తర్వాత అవి ఇనయా సుల్తానావే అని భావించిన గీతూ రాయల్.. నేరుగా ఆమె దగ్గరకు వచ్చి గొడవకు దిగింది. 'బాత్రూంలో ఎవరి హెయిర్స్ వాళ్లే తీయాలి. నాకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినా కూడా నేను అయితే వాటిని తీయను. తిక్క మొఖం దానా.. నీ మూతు చూడు ఎలా ఉందో' అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నానా గొడవ చేసేసింది.

  ఆమె సమాధానం.. సర్ధి చెప్పగా

  ఆమె సమాధానం.. సర్ధి చెప్పగా


  గీతూ రాయల్ మాటలకు ఇనయా 'నైట్ నేనొక్కదాన్నే స్నానం చేశానా? ఇంకెవరూ చేయలేదా? అయినా వెంట్రుకలు తీస్తే ఏమవుతుంది' అని బదులిచ్చింది. అప్పుడు గీతూ 'అయితే నేను నావి మొత్తం పడేస్తాను నువ్వు తీయ్. అవే కాదు.. ఇంకా వేరేవి కూడా పడేస్తాను తీయ్' అని పిచ్చిపిచ్చిగా మాట్లాడింది. తర్వాత ఆదిరెడ్డి, బాలాదిత్య ఆమెకు సర్ధి చెప్పడంతో కామ్ అయింది.

  English summary
  Bigg Boss Telugu 6th Season was Started Last Sunday. Geetu Royal and Inaya Sultana Fight in Bigg Boss House in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X