»   »  శివుడిగా సాయికిరణ్, ప్రారంభ సందడి

శివుడిగా సాయికిరణ్, ప్రారంభ సందడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీ క్రియేషన్ - కామధేను ఆర్ట్స్ పతాకంపై శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ ఆశీస్సులతో గోమాత ధారావాహిక శుక్రవారం హైదరాబాదులో ప్రారంభమైంది. దీనికి పి. ఉదయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి కిరణ్ ఈశ్వరుడిగా నటిస్తున్నాడు. సుమన్, కన్నడ శ్రీధర్, రఘునాథ రెడ్డి, రాగిణి, కృష్ణవేణి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

పూజా కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్, శోభారాజ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోమాత ధారావాహిక అద్భుతమైన కాన్సెప్ట్ అని వివి వినాయక్ అన్నారు. గోమాత ఏ విధంగా అవిర్భవించిందని చెప్పే సీరియల్ ఇది అని ఆయన చెప్పారు. ఈ సీరియల్‌ను అందరూ చూడాలని, చూస్తారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.

 Gomata TV serial begins

ఇది యజ్ఞంలాంటి కార్యక్రమమని జి. కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు ప్రవేశపెట్టినా గోమాతకు అన్యాయం జరుగుతూనే ఉన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోవధను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఇటువంటి సీరియల్స్, సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఆయన అన్నారు.

గంగ, భగవద్గీత, తులసి, గోవు భగవంతుని రూపాలని, ఈ నాలుగు భారత జాతికి ఆరాధనీయాలని పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ అన్నారు. సృష్టిలోని 84 లక్షల జీవరాసుల్లో మాత పిలువబడే ఏకైక చతుష్పాది గోవు అని, అందుకే గోమాత విశిష్టతను గురించి సీరియల్ రూపంలో బుల్లితెరపైకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ సీరియల్‌కు సంబంధించి ప్రతి విషయంలోనూ తాను జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

గతంలో తాను ఎన్నో పౌరాణిక సీరియళ్లకు, సినిమాలకు తాను దర్శకత్వం వహించానని, ఇటీవల పరిపూర్ణానంద స్వామీజి గోమాతపై సీరియల్ తీయాలన్నారని, తాను వెంటనే అంగీకరించానని దర్శకుడు ఉదయ భాస్కర్ చెప్పారు. గోమాత గురించి చాలా విషయాలను తెలిసిన వివి వినాయక్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ఈ ధారావాహికకు సంగీతాన్ని అర్జున్ సమకూరుస్తుండగా, ఛాయాగ్రహణాన్ని మీర్ - భాస్కర్ అందిస్తున్నారు. రచనా సహకారాన్ని చిదంబర శాస్త్రి అందిస్తున్నారు.

English summary
Gomata TV serial begins
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu