For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Winner రేవంత్ కాదు.. ముందే చెప్పిన గూగుల్ తల్లి, తప్పవని అంచనా?

  |

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ చివరి తుది ఘట్టానికి చేరుకుంది. అతి త్వరలో టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. ప్రస్తుతం హౌజ్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగాడు రేవంత్. అంతేకాకుండా మొదటి నుంచి అతనిపై కాస్తా ఫేవరిజం చూపించారు హోస్ట్ నాగార్జున. అలాగే సింగర్ అయిన రేవంత్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో అతనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ అని దాదాపుగా ఖరారు అయిందని అంతా అనుకుంటున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేసేలా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తల్లి షాక్ ఇచ్చింది. ఈ సీజన్ విన్నర్ రేవంత్ కాదని అంటోంది.

  2017లో తొలిసారిగా..

  2017లో తొలిసారిగా..

  బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి సైతం తీసుకొచ్చారు. ఇక తెలుగులో 2017లో అనేక అనుమానాల నడుమ ప్రారంభమై భారీగా ప్రేక్షకాదరణ పొందింది. వరుస సీజన్లతో దూసుకుపోతూ ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది.

   21 మంది ఎంట్రీ..

  21 మంది ఎంట్రీ..

  ఇప్పటికే ఐదు టీవీ, ఒక నాన్ స్టాప్ (ఓటీటీ) సీజన్లు పూర్తి చేసుకుంది ఈ రియాలిటీ షో. మొదటి రెండు సీజన్స్ మినహాయిస్తే మిగతా అన్ని సీజన్లకు టాలీవుడ్ కింగ్, మన్మథుడు నాగార్జున హోస్ట్ గా అలరించాడు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 4న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కు కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావు, రేవంత్‌‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు.

   హౌజ్ లో ప్రస్తుతం ఆరుగురు..

  హౌజ్ లో ప్రస్తుతం ఆరుగురు..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో 14 వారాలకు 15 మంది ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్, జబర్దస్త్ ఫైమా, ఇనయాసుల్తానా ఇలా 15 మంది వెళ్లిపోయారు. దీంతో హౌజ్ లో ఆరుగురు మాత్రమే మిగిలారు.

   ఎమోషనల్ పోస్ట్..

  ఎమోషనల్ పోస్ట్..

  ఇక ఈ 15వ వారం మరో ఎలిమినేషన్ ఉందని హోస్ట్ నాగార్జున తెలిపారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో మరొకరిని ఎలిమినేట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే సీజన్ ప్రారంభం నుంచి టైటిల్ ఫేవరెట్ గా సింగర్ రేవంత్ బరిలోకి దిగాడు. హౌజ్ లోకి అడుగుపెట్టడానికి ముందే ఎన్ని అడ్డుంకులు ఎదురైనా పోరాడి కప్పు గెలుచుకుని వస్తా అని ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు. హౌజ్ లో కూడా చాలాసార్లు కప్పు కొట్టాక అది మా పాపకు గిఫ్ట్ ఇవ్వాలి అంటూ మాట్లాడేవాడు.

   గూగుల్ తల్లి షాక్..

  గూగుల్ తల్లి షాక్..

  రేవంత్ మాటలు చూసి ముందే టైటిల్ విన్నర్ ఫిక్స్ అయ్యారా అనే అనుమానాలు తలెత్తాయి. కానీ, తర్వాత అలా ప్రతీసారి అంటే గెలుస్తానన్న నమ్మకంతో అలా అంటానని రేవంత్ అన్నాడు. ఇక హౌజ్ లో, బయట ప్రేక్షకులు అందరూ రేవంతే టైటిల్ విన్నర్ అని భావిస్తున్నారు. కానీ వారికి షాక్ ఇచ్చింది గూగుల్ తల్లి. బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ విన్నర్ రేవంత్ కాదని మిస్టర్ పర్ఫెక్ట్ రోహిత్ అని తేల్చి చెప్పేసింది.

   ఎలా చూసిన రోహిత్ పేరే..

  ఎలా చూసిన రోహిత్ పేరే..

  గూగుల్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ ఎవరు అని సెర్చ్ చేస్తే రోహిత్ సహ్ని, టెలివిజన్ యాక్టర్ అని దర్శనం ఇస్తుంది. ఎలాంటి కీవర్డ్ తో వెతికినా అతని పేరే కనిపిస్తుంది. అది మిస్టేకో లేదా ఇంకేదైనా కావొచ్చు కానీ, నిజానికి రోహిత్ మాత్రం విన్నర్ మెటీరియల్ అని చాలామందిలో ఉన్న భావన. హౌజ్ లో బయట మిస్టర్ పర్ఫెక్ట్ అని అతనికి పేరు ఉంది. అలాగే అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.

  విన్నర్ అయిన సందర్భాలు..

  విన్నర్ అయిన సందర్భాలు..

  అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న రోహిత్ ను టైటిల్ విన్నర్ చేస్తే ఆ టైటిల్ కే గౌరవం అని వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు గూగుల్ సెర్చ్ లో బిగ్ బాస్ విన్నర్ ను ప్రకటించడానికి ముందే బజ్ ఆధారంగా విన్నర్ పేరును చూపించేది. గూగుల్ వికీపీడియాలో ఎవరి పేరు అయితే కనిపించేదో.. చివరికీ వాళ్లే విన్నర్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈసారి గూగుల్ అంచనా తప్పకుండా రోహిత్ టైటిల్ విన్నర్ అవుతాడా అనేది చూడాలి.

  English summary
  Google Search Engine Shows Bigg Boss Telugu 6 Winner Is Rohit Sahni And Not Displayed Revanth Name.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X