Wild Cards: బిగ్‌బాస్ 9 తెలుగు 2.0 రంగం సిద్దం.. 5 గురు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎప్పుడంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో రెండో వారం ముగింపు దశకు చేరుకొన్నది. ఈ సీజన్‌లో వినూత్నంగా సెలబ్రిటీలు ఒక గ్రూపుగా, కామన్ మ్యాన్స్ ఒక గ్రూపుగా క్రియేట్ చేసి ఆటను రక్తి కట్టించేందుకు ప్లాన్ చేశారు. అయితే తొలివారం ఫస్ట్ ఎలిమినేషన్ తర్వాత రెండో వారం ఎలిమినేషన్‌కు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో 2.0 ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్లను పంపించేందుకు ఎండెమాల్ షైన్ ఇండియా గ్రూప్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ 2.0 ఈవెంట్ ఎప్పుడు ప్రారంభవుతుంది? వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా ఎవరు ఇంట్లోకి వస్తున్నారు అనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 షోలొకి సెలబ్రిటీల క్యాటగిరీలో భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరీ, సంజనా గల్రానీ, తనూజా, శ్రష్టి వర్మ, ఆశా సైనీ, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇక కామన్ మ్యాన్ గ్రూప్ నుంచి శ్రీజ దమ్ము, డీమాన్ పవన్, పవన్ కల్యాణ్, హరిత హరీష్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి తదితరులు షోలోకి వచ్చారు. తొలి వారం ఇంటి నుంచి శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు.

ఇక రెండో వారంలో 7 గురు సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో హరిత హరీష్, భరణి శంకర్, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, డీమాన్ పవన్ నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కెప్టెన్ సంజనకు స్పెషల్ పవర్ ఇచ్చి ఒకరిని నామినేట్ చేయమని అడిగితే.. సుమన్ శెట్టిని డైరెక్టుగా నామినేట్ చేశారు. దాంతో టాప్ కంటెస్టెంట్లు అంతా ఈ వారం నామినేషన్‌లోకి రావడంతో మరింత ఆసక్తిగా మారింది.
ఇదిలా ఉండగా, ఈ షోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో 5 గురు కంటెస్టెంట్లను పంపేందుకు ప్రణాళిక సిద్దమైంది. త్వరలోనే వారి ఎంపిక పూర్తి చేసి ప్రత్యేకంగా ఓ ఈవెంట్‌ను నిర్వహించి వారిని ప్రేక్షకులకు, ఇంటి సభ్యులకు పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. 2.0 ఈవెంట్ 5వ వారం ముగింపులో ఉంటుంది అని తెలిసింది.
ఇక 2.0 ఈవెంట్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కామన్ మ్యాన్‌లో ఒకరు.. సెలబ్రిటీల నుంచి 4 గురు కంటెస్టెంట్లను షోలోకి పంపేదుకు రెడీ అవుతున్నారు. కామన్ మ్యాన్స్ నుంచి నాగ ప్రశాంత్, సెలబ్రిటీల నుంచి రమ్య పికిల్, సింగర్ శ్రీ తేజ, దివ్వెల మాధురి, జ్యోతి రాయ్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. వారితో పలు విషయాలపై చర్చలు జరుపుతున్నారు. చర్చల్లో ఈ కంటెస్టెంట్ల మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చని తెలిసింది.
అయితే ఈ వారం రెండో సభ్యుడు ఎలిమినేట్ కావడానికి సిద్దంగా ఉన్నాడు. 3వ వారంలో డబుల్ ఎలిమినేషన్ చేస్తే ఇంటి నుంచి నలుగురు వెళ్లే అవకాశం ఉంటుంది. 5వ వారం మరో వ్యక్తిని ఎలిమినేట్ చేసి మొత్తం మరో 5 గురిని ఇంటిలోకి తీసుకు రావడానికి ప్లాన్ చేశారు అని తెలుస్తున్నది. ఈ వారం ప్రియా శెట్టి గానీ, మర్యాద మనీష్ గానీ ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











