For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Weekly Roundup: దేవయాని ప్లాన్ సక్సెస్.. వసుధారకు జగతి సలహా, మహేంద్ర అసంతృప్తి

  |

  యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే డిసెంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

  డిసెంబర్ 5వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 5వ ఎపిసోడ్ లో..

  గౌతమ్ బ్యాగులు తీసుకుని గది నుంచి బయటకు రాగానే.. ఎదురుగా రిషి, వసుధార ఉంటారు. ఎక్కడికో బయల్దేరావ్ ఎక్కడికి అని రిషి అడుగుతాడు. అమెరికాకు వెళ్తున్నావా అని అడుగుతాడు రిషి. నాకు చెప్పకుండా ఎలా వెళ్తావ్.. ఇదేనా నా మీద నీకున్న ప్రేమ, ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే.. నేను నీకు ఏం కానా అని గౌతమ్ ని హగ్ చేసుకుంటాడు రిషి.

  దీంతో గౌతమ్ హ్యాపీ అవుతాడు. నిజాన్ని దాచిపెట్టి ఎంత బాధపడ్డానో అని గౌతమ్ మాట్లాడబోతుంటే.. నాకేమీ చెప్పొద్దు నాకు కోపం ఎంతో.. అంతకి వందరెట్లు ప్రేమ ఉంటుంది. డాడ్ వాళ్లు నీ దగ్గర కాకుండా వేరే వాళ్ల దగ్గర ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కదా అని రిషి అంటాడు. డాడ్ వాళ్లను నువ్ బాగా చూసుకున్నావని డాడ్ చెప్పారు. నిజం దాచడం తప్పు అందులో కోపం ఉంది. కానీ డాడ్ వాళ్లని బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్. కోపంలో చాలా తిట్టేశాను సారీ అని చెబుతాడు రిషి. అనంతరం రిషి గురించి ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర. అప్పుడే రిషి, వసుధారలు గౌతమ్ ను తీసుకుని ఇంటికి రావడంతో మహేంద్ర షాక్ అవుతాడు.

  డిసెంబర్ 6వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 6వ ఎపిసోడ్ లో..

  వన భోజనాల సంగతి ఫణీంద్రకు చెబుతాడు మహేంద్ర. అదే విషయం రిషికి కూడా చెబుతాడు. దీంతో వెంటనే గతంలో వన భోజనాల సమయంలో వసుధారతో గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటాడు రిషి. ఈ వన భోజనాల గురించి జగతికి వసుధార చెబుతుంది. రిషితో కలిసి చేసిన అల్లరి గుర్తుచేసుకుంటుంది. ఈసారి కూడా మనం బాగా ఎంజాయ్ చేద్దాం అంటుంది వసుధార. మనం అంటున్న వెంటనే ఎంట్రీ ఇస్తుంది దేవయాని.

  అసలే జగతికి ఆరోగ్యం బాలేదు. ఇలాంటప్పుడు బయటకు తీసుకెళ్లడం కరెక్ట్ కాదు. ఈసారికి జగతిని ఇక్కడే ఉంచేసి మనం వెళదాం అని దేవయాని అంటుంది. మేడమ్ బాగానే ఉన్నారు. తీసుకెళదాం అని వసుధార అంటే.. రిషి ఒప్పుకోడు నేను ఒప్పుకోను అంటుంది దేవయాని. దీంతో అక్కయ్య చెప్పేది నిజమే అంటుంది జగతి. ఇదంతా విన్న మహేంద్ర.. వదినగారు నిర్ణయించుకున్నారు. జగతికి తోడుగా నేను ఉంటాను మీరు వెళ్లండి అని గౌతమ్ తో అంటాడు.

  డిసెంబర్ 7వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 7వ ఎపిసోడ్ లో..

  వన భోజనానికి రానివ్వకుండా చేసేందుకు కావాలనే దేవయాని కాళ్లపై హాట్ బాక్స్ పడేలా చేస్తాడు గౌతమ్. దీంతో దేవయాని కాలు నొప్పితో అల్లాడుతూ ఉంటే మీరంతా వెళ్లండి.. నేను రిషి దగ్గరే ఉంటాను అని అంటాడు రిషి. అప్పుడు అదేంటి రిషి.. మినిస్టర్ సార్ నిన్ను తప్పకుండా రమ్మని చెప్పారు. నువ్వు వెళ్లు అని అంటాడు ఫణీంద్ర.

  నువ్వు వెళ్లకపోతే ఎలా.. నేను కూడా ఓపిక చేసుకుని వస్తాను అంటుంది దేవయాని. అప్పుడు మీరు వద్దు పెద్దమ్మా అని.. సరే నేను కూడా వెళ్తాను అంటాడు రిషి. రిషి తెచ్చిన చీర కట్టుకుని అద్దం ముందు మురిసిపోతూ ఉంటుంది వసుధార. చీరలో నేను ఎలా ఉన్నాను అనుకుంటూ రిషి దగ్గరికి వెళ్లి కళ్లు మూస్తుంది. ఎవరు అని అడిగితే.. ఎవరో చెప్పుకోండి చూద్దాం అని అంటుంది వసుధార. నేను కాలేజీ ఎండీని తెలుసా అని రిషి అంటే.. అది కాలేజీలో ఇక్కడ కాదు కదా అంటుంది వసుధార.

  డిసెంబర్ 8వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 8వ ఎపిసోడ్ లో..

  వసుధార డ్రెస్ గురించి ఫొటో తీసి పంపిస్తాడు రిషి. తర్వాత డ్రెస్ సరిచేసుకునేందుకు వసుధార ఇబ్బంది పడుతుంటే రిషి వెళ్లి సహాయం చేస్తాడు. ఇదంతా చూసిన కాలేజీ స్టాఫ్ కొందరు చెడుగా మాట్లాడతారు. ఆ మాటలు విన్న వసుధార షాక్ అవుతుంది. వసు గమనిస్తుందని తెలిసి మరింతగా మాట్లాడతుంది కాలేజీ స్టాఫ్. దీంతో వసుధార మౌనంగా వెళ్లిపోతుంది. ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి వారిపై సీరియస్ అవుతాడు. మీరు మాట్లాడింది తప్పు మేడమ్. వసుధార ఇక్కడ అందరి ముందు ఇబ్బింది పడుతుండగా రిషి సహాయం చేశాడు. అలాంటిది మీరు నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతారా.

  మీ ఇంట్లో ఇలాంటివి జరగవా. మీరు ఇన్ని మాటలు అన్న వసుధార ఏం మాట్లాడకుండా వెళ్లింది అంటే అది ఆమె సంస్కారం అని చెబుతాడు గౌతమ్. మీరిద్దరూ మాట్లాడిన మాటలు ప్రతి ఒకటి రిషికి చెబితే తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండని వార్నింగ్ ఇస్తాడు గౌతమ్.

  డిసెంబర్ 9వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 9వ ఎపిసోడ్ లో..

  వసుధార ఏడుస్తూ ఉంటుంది. ఏమైందని జగతి అడుగుతుంది. ఎందుకు మేడమ్ ఎదుటి వ్యక్తుల గురించి ఇలా తప్పుగా మాట్లాడతారు అని వసుధార అంటే.. అవేమీ పట్టించుకోవద్దని జగతి అంటుంది. వాళ్లకు నాతో శత్రుత్వం ఏంటీ మేడమ్.. గుండెలు కోసేసేలా మాట్లాడుతారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార.

  ఒకరి గురించి మాట్లాడేందుకు శత్రుత్వం ఏం అవసరం లేదు వసుధార. ఒక ఒంటరి అమ్మాయి వాళ్లకు టాపిక్ మాట్లాడుకోవడానికి దొరికింది. ఏమైనా మాట్లాడుకుంటారు. దానికి నువ్వు బాధపడకు. నువ్వు మీ ఊరికి వెళ్లు. మీ అమ్మా నాన్నలతో ధైర్యంగా మాట్లాడు. జరిగింది చెప్పు అని జగతి అనడంతో.. వసుధార షాక్ అవుతుంది. నేను ఎందుకు వెళ్లమంటున్నానో నాకు స్పష్టత ఉంది. ఇంకా ఆలస్యం చేయకు. ఊరికి వెళ్లు అని వసుధారకు చెబుతుంది జగతి.

   డిసెంబర్ 10వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 10వ ఎపిసోడ్ లో..

  వనభోజనాల్లో జరిగినదంతా మహేంద్రకు చెబుతుంది జగతి. అలాగే వసుధారను వాళ్ల ఊరు వెళ్లమని చెప్పానని జగతి అంటే.. వసుధార వెళితే ఎలా అని మహేంద్ర అంటాడు. వసుధార వెళ్లి మళ్లీ తిరిగి ఈ ఇంటికి రావాలి మహేంద్ర అని జగతి అంటుంది. ఏంటీ డల్ గా ఉన్నావని అడుగుతాడు రిషి. ఏం లేదు సార్ అని చెప్పిన వసుధార.. మేడమ్ వాళ్లు అన్న మాటలు రిషి సార్ కి చెబితే బాధపడతారు.

  వద్దులే అని అనుకుంటుంది వసుధార. ఎదుటి వాళ్ల గురించి ఎప్పుడు పట్టించుకోవద్దు. నువ్వు కరెక్ట్ గా ఉండు చాలు అని రిషి చెబుతాడు. వసుధారను రిషి ఓదార్చన తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోకవైపు జగతి కోసం ఓ ఇద్దరు ఇంటికి రావడంతో దేవయాని వాళ్లకి మర్యాదలు చేస్తుంది. జగతిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతుంది. జగతి గురించి మాట్లాడుతూనే వాళ్లు వసుధార గురించి చెడుగా మాట్లాడటంతో ఇదేదో కలిసొచ్చే టాపిక్ లా ఉందే అనుకుంటుది దేవయాని. ధరణి వచ్చి కాఫీ ఇచ్చి వెళ్లి వంటగదిలో నుంచి వాళ్ల మాటలు చాటుగా వింటుంది. వాళ్లిద్దరూ దేవయానిని పొగుడుతుంటే దేవయాని మురిసిపోతూ ఉంటుంది.

  English summary
  Guppedantha Manasu Weekly Roundup
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X