Don't Miss!
- News
ఎందుకు రాలేదు? పిలిస్తేగా వచ్చేది?: కేటీఆర్, ఈటల మధ్య మాటలు, రాజాసింగ్ డ్రెస్సుపై.!
- Lifestyle
మీ తలలో మొటిమలు ఉన్నాయా?మొటిమలు దురుదపెడుతున్నాయా? వాటికి కారణాలు, నివారణ ఇక్కడ తెలుసుకోండి!
- Finance
Vidya Deevena: విద్యార్థుల ఆశలకు 'విద్యా దీవెన' రెక్కలు.. నిధులు విడుదల చేసిన సీఎం..
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Sports
Border-Gavaskar Trophy: అప్పుడు భారత్‌ను గెలిపించింది.. ఇప్పుడు ఆడుతున్నది ఆ నలుగురే!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Guppedantha Manasu Weekly Roundup: రిషికి భార్యగా వసుధార.. ఊహించని మలుపులతో ఎపిసోడ్స్!
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే డిసెంబర్ 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

డిసెంబర్ 12వ ఎపిసోడ్ లో..
రిషి వాళ్లు మంత్రి దగ్గరికి వెళతారు. మిషన్ ఎడ్యుకేషన్ అంటే ఇతర రాష్ట్రాల వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, దానికి హెడ్ గా ఉండలేనని జగతి మెయిల్ చేశారు. తన స్థానంలో వసుధారను పెట్టమని జగతి సూచించినట్లు మంత్రి రిషి వాళ్లకు చెబుతారు. అటు జగతి కూడా తన దగ్గరికి వచ్చిన మేడమ్ వాళ్లకు చెబుతుంది.
ఇంత పెద్ద బాధ్యత మోయలేనని వసుధార అంటుంది. కానీ, రిషి మాత్రం జగతి మేడమ్ గైడెన్స్ లో వసుధార చేస్తుందని చెబుతాడు. ఇదే విషయం గురించి ఇంట్లో వాళ్లకు చెబుతాడు రిషి. జగతి మేడమ్ స్థానాన్ని భర్తీ చేసేంత గొప్పదాన్ని కాదని వసుధార అంటుంది.

డిసెంబర్ 13వ ఎపిసోడ్ లో..
రిషికి మంత్రి నుంచి ఫోన్ వస్తుంది. జగతి స్థానంలో వసుధారను ఉంచాలనుకున్న మాట నిజమే కానీ, రేపటి రోజున ఈ విషయంపై అధికారులు ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉండదని మంత్రి అంటే రిషి షాక్ అవుతాడు. మీకు ఇష్టం వచ్చిన వాళ్లను నియమిస్తారా అని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు కదా అని అనడంతో అవును సార్ అని రిషి అంటాడు.
తర్వాత కాల్ కట్ చేసి వచ్చిన రిషితో ఏమైందని అడుగుతారు మహేంద్ర, ఫణీంద్ర. వెంటనే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా వసుధారను నియమించడం మంత్రి కరెక్ట్ కాదంటున్నారని అనడంతో మహేంద్ర ఆశ్చర్యపోతాడు. ఆ మాట విన్న కాలేజీ స్టాఫ్ నవ్వుకుంటారు. మహేంద్ర ఏం చేద్దామని అడిగితే.. ఓటింగ్ పెడదామాని చెప్పి వెళ్లిపోతాడు రిషి.

డిసెంబర్ 14వ ఎపిసోడ్ లో..
వసుధారకు జగతి ఓటు పడటంతో అనుకూలంగా 4, ప్రతికూలంగా 4 ఓట్లు పోలవుతాయి. ఈ తర్వాత ఓట్లు ఎటు పడతాయో అని టెన్షన్ లో ఉంటారు అంతా. మొత్తం 12 ఓట్లలో సమానంగా పోల్ అవుతాయి. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన దేవయాని వెళ్లి వసుధారకు ఓటు వేస్తుంది. దీంతో కాలేజీ స్టాఫ్ షాక్ అవుతారు. దీంతో మీరు సూపర్ పెద్దమ్మా అని పొగిడేస్తాడు రిషి.
ఈ దేవయాని ఏంటో అర్థం కాలేదు కదా.. ముందు ముందు నీకు బాగా అర్థమవుతుందని వసుధార దగ్గరకి వెళ్లి చెబుతుంది దేవయాని. వసుధార గెలవడంతో రిషి తెగ సంబరపడిపోతాడు. సీట్ లో కూర్చోబెట్టి కంగ్రాట్స్ చెబుతాడు. జగతి మేడమ్ లా సమర్థవంతంగా ప్రాజెక్ట్ నడపాలి అని రిషి అంటే.. థ్యాంక్యూ చెబుతుంది వసుధార.

డిసెంబర్ 15వ ఎపిసోడ్ లో..
దేవయాని అంటే చాలా తక్కువ అంచనా వేస్తున్నావ్.. నేను నీపై కరెక్ట్ గా దృష్టిపెడితే.. ఏమవుతుందో తెలుసా.. అని దేవయాని అంటే.. మేడమ్ నేను ఇంటికి వస్తే మీకేంటి ఇబ్బందని వసుధార అంటే.. నీకున్న హక్కు ఏంటి.. ఈ ఇంటికి రావడానికి నీకు ఏం హక్కు ఉందని రివర్స్ గా క్వశ్చన్ చేస్తుంది దేవయాని.
ఏ అర్హత గురించి అడుగుతున్నారో.. అదే అర్హతతో ఇదే ఇంట్లో నేను అడుగు పెడతాను అంటుంది వసుధార. మీరేంటో మీ బుద్దులేంటో రిషి సార్ కి తెలిసేలా చేస్తాను అనేసి వెళ్లిపోతుంది వసుధార. ధరణి పిలుస్తుండగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంది వసుధార. మరోవైపు కాలేజీ నుంచి గులాబీల బొకే తీసుకుని బయలు దేరతాడు రిషి.

డిసెంబర్ 16వ ఎపిసోడ్ లో..
కాలేజీ స్టాఫ్, ఇంటి ఓనర్ అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతుంటుంది వసుధార. అక్కడికి వచ్చిన రిషితో వాళ్లు మాటలతో చాలా బాధ పెట్టారు సార్. టెక్నాలజీ మారింది, డెవలప్ అయింది అంటున్నారు. కానీ, ఆడపిల్ల మాత్రం సమాజం దృష్టిలో అలాగే ఉంది సార్. ఆడమగ కనిపిస్తే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంటారు. ఏవేవో ఊహించుకుంటారు అని చెబుతుంది వసుధార.
వసుధార మాటలకు మౌనంగా ఉన్న రిషి.. ఇంటికి పదా వెళదాం అని రిషి అంటే.. ఆ ఇంటికి నాకు ఏంటీ సార్ సంబంధం. ఏ అర్హతతో నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి. ఆ ఇంటికి ఏ హక్కుతో రావాలో చెప్పండి సార్. అతిథిగా అయితే 3 రోజులు ఉండొచ్చు. ప్రతిసారీ ఇంటికి వచ్చి కూర్చుంటే చాలా మందికి అనుమానాలు వస్తాయి సార్. నేను వాళ్లందరికి సమాధానం చెప్పాలనుకోవట్లేదు సార్.. మా ఊరికే వెళ్లిపోతున్నాను అని వసుధార అంటుంది.

డిసెంబర్ 17వ ఎపిసోడ్ లో..
వసుధార చేయిని రిషి పట్టుకోవడంతో దేవయాని షాక్ అవుతుంది. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను వసుధార పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా అభ్యంతరమా అని అడుగుతాడు రిషి. దీంతో అందరూ వాళ్లిద్దరిని చూస్తూ నిల్చుని ఉంటారు.
పెద్దమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఇష్టం ఉందా లేదా అని అడగడంతో ఇష్టమే రిషి అని అంటుంది దేవయాని. దీంతో జగతి, మహేంద్ర.. దేవయాని తిక్క కుదిరిందని నవ్వుకుంటారు. వసుధార నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను. ఏ అర్హతతో ఇంటికి రావాలి సార్ అని అడిగావ్. ఇప్పుడు చెబుతున్నాను విను. ఈ రిషీంద్ర భూషణ్ భార్యగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టు అని రిషి అనడంతో దేవయాని కంగుతింటుంది. ఈ రిషీంద్ర భూషణ్ తో జీవితాంతం కలిసి నడిచే భార్యగా ఇంట్లోకి అడుగు పెట్టు అంటాడు రిషి.