For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Weekly Roundup: అతనితో బలవంతంగా వసుధార పెళ్లి.. జగతి-మహేంద్రలు అడ్డుకోనున్నారా?

  |

  యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే డిసెంబర్ 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

   డిసెంబర్ 26వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 26వ ఎపిసోడ్ లో..

  యూనివర్సిటీ టాపర్ అయినందుకు వసుధార కప్పు చూపిస్తూ ఉండగా ఇంతలో వసుధార తండ్రి చక్రపాణి అక్కడికి వచ్చి ఆ కప్పును విసిరి కొడతాడు. ఏం గొప్పగా చేశావని గొప్పగా చెప్పుకుంటున్నావ్. నువ్వు గెలిచిన గెలుపు పోయిన పరువు తీసుకువస్తుందా.. నేను అన్న మాటలకు ఇంకా ఎవరైనా అయింటే విషం తాగి చచ్చేవాళ్లు, నువ్వు ఇంకా అలాగే ఉన్నావ్. సుమిత్ర దాన్ని ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని చెప్పు ఇక్కడే ఉంటే నా పరువు తీస్తుంది. ఇది నా కడుపుని ఎందుకు పుట్టిందో. పుట్టినప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుండేదని చక్రపాణి అంటే సుమిత్ర కుమిలిపోతూ ఉంటుంది. తర్వాత వసుధారను అంతా ఓకే కదా ఏం సమస్య లేదు కదా అని రిషి అడుగుతాడు. ఇది మా ఇల్లే కదా సార్.. ఏం సమస్య ఉంటుంది అని అబద్ధాలు చెబుతూ కవర్ చేస్తుంది వసుధార. నీ వాయిస్ ఎందుకో తేడాగా ఉంది. నిజం చెప్పు వసుధార. నువ్వు ఏదో విషయం గురించి బాధపడుతున్నావ్ కదా.. అని రిషి అడగడంతో.. ఏం లేదు సార్ అని చెప్పి మ్యానేజ్ చేస్తుంది వసుధార. రిషితో ఫోన్ మాట్లాడుతూ అమ్మ వస్తున్నాను.. అని అబద్ధం చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత సారీ సర్.. నన్ను క్షమించండి అని అనుకుంటుంది వసుధార.

   డిసెంబర్ 27వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 27వ ఎపిసోడ్ లో..

  వసుధార ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో జగతి టెన్షన్ పడుతుంది. నవ్వు ఏం బాధపడకు జగతి చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్లింది కదా అని సర్ది చెబుతాడు మహేంద్ర. రిషికి కాల్ చేయమని అంటుంది జగతి. మరోవైపు వసుధార కాల్ కోసం రిషి ఎదురుచూస్తుంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతోంది. ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. నాకు తిరిగి కాల్ చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది.. తనే చేస్తుందిలే అనుకుంటాడు రిషి. ఇంతలో దేవయాని ఫోన్ చేయడంతో చెప్పు వసుధార అనగానే నేను మీ పెద్దమ్మని అంటుంది దేవయాని. అప్పుడు అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకుని దేవయాని నవ్వుకుంటూ ఉంటుంది. మరోవైపు తండ్రితో మాట్లాడుతుంటుంది వసుధార. నాకు అహంకారం లేదు.. చదువుకోవాలి అనుకున్న నాకు పెళ్లి చేయాలనుకున్నారు అని వసుధార చెబుతుంటే తండ్రి చక్రపాణి ధీర్ఘాలు తీస్తూ వసుధారను అపార్థం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధార నీ కూతురు యూనివర్శిటీ టాపర్ వచ్చిందని గర్వంగా చెప్పుకోండి అని అనడంతో పరువు పోయిందని చక్రపాణి అంటాడు.

   డిసెంబర్ 28వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 28వ ఎపిసోడ్ లో..


  రిషి కారు హారన్ కొట్టగానే అతని దగ్గరికి వెళ్లిపోతుంది వసుధార. తర్వాత ఒక చోట కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అని రిషి అడిగితే.. లేదు సార్ అని చెబుతుంది వసుధార. మరి ఎందుకు అలా ఉన్నావ్. నేను మీ ఇంటికి దగ్గర్లోకి వస్తే ఎందుకు వచ్చారు సార్ అని అడిగావ్ ఏంటి వసు. నువ్వు లేకపోతే నాకు ఎలాగో ఉంటుంది. నువ్వు ఎప్పటిలాగే గలగల మాట్లాడాలి. ఇలా మౌనంగా ఉండకూడదు అని అంటాడు రిషి. దీంతో రిషి చేయి పట్టుకుని ఎమోషనల్ అవుతుంది వసుధార. ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగితే కన్నీళ్లు కాదు సార్.. మిమ్మల్ని నాకు ఇచ్చినందుకు మీ ప్రేమ పొందినందుకు ఆనంద భాష్పాలు అని అంటుంది వసుధార. ఫోన్ గురించి అడిగేసరికి టెన్షన్ అవుతుంది వసుధార. తర్వాత ఫోన్ పగిలిపోయిందని చెబుతుంది. మరోవైపు వసుధార-రిషిని చూసిన రాజీవ్ కోపంతో రగిలిపోతుంటాడు.

  డిసెంబర్ 29వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 29వ ఎపిసోడ్ లో..

  ఎవడో వచ్చాడంట.. ఇది వెళ్లిందట.. నేను పరువు పరువు అని కొట్టుకుంటుంటే అది వెళ్లింది. రానీ.. దాని సంగతి చెబుతాను అని చక్రపాణి అంటుంటే వసుధార ఎంట్రీ ఇస్తుంది. సుమిత్ర టెన్షన్ పడుతుంటుంది. తండ్రిని చూసి భయం భయంగా అడుగు పెడుతుంది వసుధార. ఆగు అని అరుస్తాడు చక్రపాణి. వాడెవడు అని చక్రపాణి అంటే.. నాన్న మర్యాద అని వసుధార అంటుంది. ఏంటీ మర్యాదా.. ఎవడే వాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు. నువ్వెందుకు వెళ్లావ్. సమాధానం చెప్పాకే లోపలికి రా అని చక్రపాణి అంటే.. నాకు కాబోయే మొగుడు అని వసుధార చెబుతుంది. ఒక్కసారిగా సుమిత్ర-చక్రపాణి షాక్ అయి చూస్తారు. తను నాకు కాబోయే భర్త అన్నాను. అనవసరంగా ఆవేశపడొద్దు అని వసుధార అంటుంది. ఏం తల్లివే నువ్వు అని సుమిత్రను చక్రపాణి అంటే.. ఇందులో అమ్మ తప్పేముంది. ప్రతి చిన్నదానికి పెళ్లాంపై అరవడం గొప్పేం కాదు అని వసుధార అంటే చక్రపాణి చేయి ఎత్తుతాడు. దీంతో ప్రశాంతగా వినండి.. వచ్చింది రిషి సార్.. మేం ఇద్దరం ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం అని వసుధార అంటుంది. అంతా మీ ఇష్టమేనా అని చక్రపాణి అంటే.. ఇది నా జీవితం నాన్న. నా ఇష్టమే అని వసుధార తేల్చి చెప్పేస్తుంది.

  డిసెంబర్ 30వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 30వ ఎపిసోడ్ లో..

  నాన్న నేను మీ పెద్దరికం గౌరవిస్తాను. కానీ నన్ను మీరు అర్థం చేసుకోవట్లేదు అని వసుధార అంటుంది. దీంతో వసుధారను ఏం అనలేక సుమిత్రపై సీరియస్ అవుతాడు చక్రపాణి. ఇంతలో జగతి కాల్ చేస్తుంది. అప్పుడు వసుధార చేతిలో నుంచి ఫోన్ లాక్కొని లిఫ్ట్ చేస్తాడు. వసుధార అక్కడ అంతా ఓకేనా అని జగతి అడగడంతో.. వెంటనే చక్రపాణి గట్టిగట్టిగా అరుస్తాడు. అమ్మ తల్లి టీచరమ్మా అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాడు. రిషి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. అప్పుడు ఊరు పేరు లేని వాడు కాదు.. రిషి నా కొడుకు.. డీబీఎస్టీ కాలేజ్ ఎండీ అని చెప్పడంతో చక్రపాణి షాక్ అవుతాడు. ఏం స్కెచ్ వేశావ్ టీచరమ్మా.. అసలు నీ మొగుడు ఎవడో.. నీ సంసారం ఏంటో.. అసలు నీ ఊరు ఏంటో నీకే తెలియదు. ఎవరినో తీసుకొచ్చి నా కొడుకు అని చెప్పిన నా కూతురు గొంతు కోస్తున్నావా అని అంటాడు చక్రపాణి. చక్రపాణి గారు మర్యాదగా మాట్లాడండి.. రిషి నా కన్న కొడుకు అని జగతి అనడంతో.. అయితే ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోను అని అంటాడు వసుధార తండ్రి చక్రపాణి.

   డిసెంబర్ 31వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 31వ ఎపిసోడ్ లో..

  వసుధారకు ఫోన్ వస్తుంది. కానీ చక్రపాణి మాత్రం ఫోన్ ఇవ్వను అని గట్టిగా చెబుతాడు. రిషి చేసిన కాల్ ను లిఫ్ట్ చేస్తుంది సుమిత్ర. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. "ఏం జరుగుతుంది. మీ బావ వచ్చి ఏదేదో వాగి నీకు తనకు పెళ్లి అని అంటున్నాడు. నేను వస్తున్నాను. భయపడకు. మా వాళ్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ బావ ఇంటికి వచ్చి నిన్ను ఇబ్బంది పెడతాడు. అందుకే నువ్వు వద్దన్నా నేను మీ ఇంటికి వస్తున్నా" అని రిషి కంగారుగా చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో పంతుల్ని తీసుకుని రాజీవ్ ఇంట్లో అడుగుపెడతాడు. పెళ్లి ఏర్పాట్లు చూసి రాజీవ్ నవ్వుకుంటాడు. మీరు ఇంత కష్టపడి పెళ్లి చేస్తున్నారని చూసి సంబరపడిపోతాడు.

  English summary
  Guppedantha Manasu Weekly Roundup:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X