twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu Weekly Roundup: అనేక మలుపులతో సీరియల్.. కూతురి కాళ్లపై తండ్రి చక్రపాణి, ఎమోషనల్ గా!

    |

    యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే జనవరి 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

    జనవరి 9వ ఎపిసోడ్ లో..

    జనవరి 9వ ఎపిసోడ్ లో..


    ఎలాగైనా జరిగింది ఏంటో తెలుసుకోవాలనుకుని మళ్లీ వసుధార కోసం పోలీస్ స్టేషన్ కి వెళతాడు రిషి. వసుధార దగ్గరకు వెళ్లిన రిషి.. "ఒకే ఒక్క మాట చెప్పు వసుధార. ఆ తాళి ఎవరు కట్టారో చెప్పు" అని రిషి ఎంతో ఆవేదనగా అడుగుతాడు. అప్పుడు వసుధార జరిగింది అంతా తలుచుకుంటూ ఉంటుంది. రిషిని ఊహించుకుంటూ ఆ తాళిని తన మెడలో వేసుకోవడం గుర్తు తెచ్చుకుంటుంది. తర్వాత "నా ఇష్టంతోనే ఈ తాళి నా మెడలో పడింది. మనస్ఫూర్తిగానే నాకు ఈ పెళ్లి జరిగింది. ఇక ఇంతతకుమించి చెప్పాల్సింది ఏం లేదు. మీకు దండం పెడతాను సర్.. ఇక రాకండి" అని వసుధార కూడా ఎంతో బాధగా చెబుతుంది. వసుధారకు తన మనస్ఫూర్తిగానే పెళ్లి జరిగింది అని చెప్పడంతో రిషి ఉక్కిరిబిక్కిరి అవుతాడు.

    జనవరి 10వ ఎపిసోడ్ లో..

    జనవరి 10వ ఎపిసోడ్ లో..

    శూన్యంలోకి చూస్తూ అంతా కోల్పోయినట్లుగా ఇంట్లోకి మెల్లిగా అడుగులు వేస్తాడు రిషి. రిషిని చూసి బాధతో ఎలా ఉన్నావో చూడు అని తండ్రి మహేంద్ర అంటాడు. ఉన్నాను కదా డాడ్ అని రిషి అంటాడు. దీంతో అదికాదు రిషి అని జగతి అంటే.. నాకేం చెప్పకండి మేడమ్.. మీ శిష్యురాలిని కాలేజీకి తీసుకొచ్చినందుకు అప్పుడప్పుడు మనసులో మీకు థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలా మేడమ్.. తను జీవితంలో మరిచిపోలేని గుణపాఠం నేర్పించింది. థ్యాంక్యూ మేడమ్ అని ఎంతో బాధగా, కోపంగా చెబుతాడు రిషి. రిషి అలా అనడం చూసి దేవయాని తను అనుకున్నది జరిగిందని సంతోషపడుతుంది. మరోవైపు జైల్లో వసుధార కుమిలిపోతూ ఉంటుంది.

    జనవరి 11వ ఎపిసోడ్ లో..

    జనవరి 11వ ఎపిసోడ్ లో..

    మనసుకు గుచ్చుకునే జ్ఞాపకాలను ఎందుకు తలుచుకుంటావు. ఈ జ్ఞాపకాల నుంచి నువ్వు బయటపడాలి అని జగతి అంటే.. ఇందులో నా తప్పేం ఉంది చెప్పండి. ఎందుకు ఇలా చేసింది. ప్రాణంగా ప్రేమించడమే తప్పా. మీ శిష్యురాలు నా మనసుని ఏం అర్థం చేసుకుంది మేడమ్. నా పసి మనసుని అర్థం చేసుకోకుండా మీరు వెళ్లిపోయారు. మీరు ఎందుకు వెళ్లిపోయారు నాకు తెలియదు. మీరు కూడా నాకు చెప్పలేదు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేను వారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారని అనుకోవడం లేదు అని రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆగు రిషి అని జగతి అనడంతో.. మీరేం చెప్పకండి.. మీ శిష్యురాలు కనిపిస్తే.. ఈ రిషీంద్ర భూషణ్ కి మోసపోవడం కొత్తేమి కాదు. జ్ఞాపకాలతో బతకగలడు. తను నాకు అక్కర్లేదు అన్న విషయం చెప్పండి అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి.

     జనవరి 12వ ఎపిసోడ్ లో..

    జనవరి 12వ ఎపిసోడ్ లో..

    రిషి క్యాబిన్ లోకి వసుధార అడుగుపెడుతుంది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన రిషి.. నువ్ వచ్చావా అని గట్టిగా అడుగుతాడు. ఏంటీ సార్.. రాకూడదా అని వసుధార అంటుంది. తర్వాత మీరు నన్ను వదిలేసి వస్తే.. నేను రాననుకున్నారా అని వసుధార అంటుంది. అప్పుడు వసుధార తాళి వైపు చూస్తాడు రిషి. ఈ పెళ్లి నా ఇష్టపూర్వకంగానే జరిగింది అన్న వసుధార మాటలను తలుచుకుంటాడు రిషి. దీంతో వెళ్లిపో వసుధార అని అరుస్తాడు రిషి. నువ్ వేరేవాళ్లతో తాళి కట్టించుకున్నప్పుడు.. నువ్ నా కళ్ల ఎదురుగా నిలుచుంటే.. నేను భరించలేను.. మోసపోయాను నీ చేతిలో.. అని ఆవేదనగా అంటాడు రిషి. దీనికి సర్.. నాకు పెళ్లయింది నిజమే.. కానీ అంటూ వసుధార చెప్పబోతుండగా.. ఇంకేం మాట్లాడకు వసుధార వెళ్లిపో ఇక్కడి నుంచి అంటూ గట్టిగా అరుస్తూ టేబుల్ పై ఉన్న ఫైళ్లను విసిరేస్తాడు రిషి. దీంతో షాక్ అయి అలానే చూస్తుండిపోతుంది వసుధార.

     జనవరి 13వ ఎపిసోడ్ లో..

    జనవరి 13వ ఎపిసోడ్ లో..

    రాజీవ్ చెంపపై గట్టిగా కొడతాడు చక్రపాణి. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయి చూస్తారు. చెంపపై చక్రపాణి కొట్టగానే షాక్ తో మావయ్య అని అంటాడు రాజీవ్. ఎవర్రా నీకు మావయ్య.. మావయ్య గారు అంటా.. అని కోపంతో రగిలిపోతూ వీడు నయ వంచకుడు సార్. వీడు చెప్పే మాటలు ఏవి నిజాలు కాదు సార్. వీడి మాటలు.. వీడి బతుకు అంతా పెద్ద అబద్ధం సార్. సార్.. వీడే నా భార్యను పొడిచింది అని ఆవేశంతో పోలీసులకు చెబుతాడు చక్రపాణి. దీంతో పోలీసులు షాక్ అవుతారు. సుమిత్ర మాత్రం సంతోషపడుతుంది. అప్పుడు అవును సార్.. వసుధారకు తెలియకుండా వీడే సార్ నన్ను పొడిచాడు. వీడు దుర్మార్గుడు సార్. మంచి వాడు కాదు అని సుమిత్ర అంటుంది. వీడు నా భార్యను పొడవడం నా కళ్లతో చూశాను సార్ అని చక్రపాణి అంటాడు. దీంతో అవును సార్.. నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టాడు. కిడ్నాప్ చేయడానికి చాలా ప్రయత్నించాడు అని వసుధార చెబుతుంది.

     జనవరి 14వ ఎపిసోడ్ లో..

    జనవరి 14వ ఎపిసోడ్ లో..

    ఆస్పత్రి నుంచి వాళ్ల ఇంటికి వెళతారు వసుధార, చక్రపాణి, సుమిత్ర. అప్పుడు ఇల్లు మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండటంతో అది చూసి బాధపడుతూ ఉంటారు ముగ్గురు. తర్వాత రాజీవ్ అన్న మాటలు చేసిన పనులు గుర్తు తెచ్చుకున్న చక్రపాణి బాధపడుతాడు. చక్రపాణి దగ్గరికి వెళ్లిన వసుధార ఏం ఆలోచించొద్దు నాన్న అని చెబుతుంది. ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా.. జరిగింది చిన్న విషయం కాదు కదా అని చక్రపాణి అంటే.. వసుధార ఓదార్చుతూ ఉంటుంది. తర్వాత చక్రపాణి అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లి వసుధార కాళ్ల మీద పడతాడు. అయ్యే నాన్న ఏంటింది.. ముందు పైకి లేవండి. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటుంది వసుధార. నన్ను క్షమించు వసుధార అని ఏడుస్తూ ఉంటాడు చక్రపాణి. అప్పుడు సుమిత్ర ఏంటండీ మీరు ఇలా చేస్తున్నారు అని అంటుంది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నా ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నానని అంటాడు చక్రపాణి. అప్పుడు చేతులు జోడించి క్షమించమని వసుధారను వేడుకుంటాడు చక్రపాణి.

    English summary
    Guppedantha Manasu Weekly Roundup:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X