Don't Miss!
- News
అందుకే సీఎం జగన్ కు అంత క్రేజ్ - తండ్రిని మించి పోయేలా..!!
- Sports
INDvsNZ : మహాకాలేశ్వర్ ఆలయంలో టీమిండియా.. పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Technology
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
Guppedantha Manasu Weekly Roundup: అత్తింట్లో వసుధారకు అవమానం, అల్లుడికి చక్రపాణి వార్నింగ్!
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే జనవరి 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

జనవరి 16వ ఎపిసోడ్ లో..
ఎక్కడికి వెళ్తావ్ రిషి అని బాధగా తండ్రి మహేంద్ర అడుగుతాడు. కొన్నాళ్లు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను రిషి అంటే.. ఎక్కడికి రిషి.. పారిపోతున్నావా అని మహేంద్ర అంటాడు. మనుషుల నుంచి అయితే పారిపోగలను.. నా మనసు నుంచి ఎక్కడికి వెళ్లగలను అని రిషి అంటాడు. ఎవరో మోసం చేశారని దేవయాని అంటే.. పెద్దమ్మా.. ఎవరో మోసం చేశారని పారిపోయేంత పిరికివాడిని కాదు. నాకు నేనే నచ్చడం లేదు. నేను ఎవరో తెలియని చోటుకు వెళ్లి చెక్కిన శిల్పంలా వస్తాను. నేనే శిల్పం.. నేనే శిల్పిని అని అంటాడు రిషి. మరి కాలేజ్ ఎవరు చూసుకుంటారని ఫణీంద్ర అంటే.. జగతి మేడమ్ చూసుకుంటారు అని రిషి అంటాడు. వెళ్లడం అవసరమా రిషి అని మహేంద్ర అడిగితే.. అత్యంత అవసరం డాడ్. నా గుండె బరువును మోయలేకపోతున్నాను. నేను ఎవరో తెలియని ఒక కొత్త ప్రదేశానికి వెళ్తాను. మళ్లీ కొత్తగా పుట్టినట్లు తిరిగివస్తాను అని రిషి చెబుతాడు. ఎప్పుడు వస్తావ్ అని మహేంద్ర అడిగితే.. ఏమో తెలియదు.. అసలు వస్తానో రానో కూడా తెలియదు అని రిషి సమాధానం చెబుతాడు.

జనవరి 17వ ఎపిసోడ్ లో..
వసుధార బ్యాగ్ తో సహా కాలేజీలోకి అడుగు పెడుతుంది. దారిలో కారులో రిషి వెళుతూ కనిపిస్తాడు. అయితే సార్ అంటూ వసుధార పిలిచిన రిషి పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. తర్వాత కాలేజీలోకి రిషి క్యాబిన్ లోకి వెళుతుంది వసుధార. రిషి స్థానంలో జగతిని చూసిన వసుధార.. పాత ఎండీ గారు ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. కనిపించని భవిష్యత్తు కోసం.. తెలియని దారిలో వెళ్తున్నాడు. అందుకే మాకు కూడా చెప్పలేదు. ఒక్కొక్కసారి పాలలాగే మనసులు కూడా విరిగిపోతాయి. మనసుల్ని విరకొట్టి చాలా మంది ఆనందాన్ని పొందుతారు అని జగతి అంటుంది. మీరు ఏమంటున్నారో నాకు అర్థమైందని వసుధార అంటుంది.

జనవరి 18వ ఎపిసోడ్ లో..
మీరు కొత్త వసుధారగా అవతారమెత్తారు కదా.. మీ ప్రవర్తనను, ఆలోచనలను మా ఊహకు అందడం లేదు. అందుకే మిమ్మల్ని గౌరవించక తప్పడం లేదని మహేంద్ర సమాధానమిస్తాడు. ఇంతలో తనతో మాటలేంటీ మహేంద్ర.. కొందరు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటారు. అందరితో మంచిగా ఉంటారు. చివరికీ తాము నడిచి వచ్చిన దారి, తాము ప్రేమించిన వారని మర్చిపోయి కొత్త అడుగులు వేస్తారు. మనం అల్పులం. వాళ్ల ఆలోచనలను అంచనాలను మనం అందుకోలేము. మనం అల్పులం వాళ్లతో మనం పోటీ పడలేం అని జగతి అంటుంది. సరే మేడమ్.. నేను నా క్యాబిన్ కు వెళ్తున్నాను. మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా ఛార్జ్ తీసుకుంటున్నాను అని వసుధార చెబుతుంది. నువ్వు ఇక్కడికి రావడం అవసరామా.. సమాధానం చెప్పకుండా ఎన్నాళ్లు దాటవేస్తావు అంటూ నిలదీస్తుంది జగతి. కొన్ని సమాధానాలు కొందరికి చెబితేనే బాగుంటాయి. నేను ఎవరికీ చెప్పాలో వాళ్లకే చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార. తన క్యాబిన్ లో కూర్చున్న వసుధార.. రిషి ఎక్కడికి వెళ్లాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.

జనవరి 19వ ఎపిసోడ్ లో..
రిషి గురించి వసుధార అడగడంతో.. వసుధారను పట్టుకుని బలవంతంగా బయటకు గెంటేస్తుంది. జగతి ఆగు.. నేను వసుధారను కొన్ని ప్రశ్నలు అడగాలి అని చెబుతున్నా వినకుండా వసుధారను ఇంటి నుంచి బయటకు గెంటేస్తుంది దేవయాని. తర్వాత వసుధార మొహం మీదే తలుపు వేస్తుంది జగతి. ఈ రిషీంద్ర భూషణ్ భార్యగా అడుగు పెట్టు అని రిషి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది వసుధార. తలుపు మూసిన జగతి అక్కడే బాధపడుతూ ఉంటుంది. తర్వాత అమ్మవారి దగ్గరికి వెళుతుంది వసుధార. నీ దగ్గరికి రప్పించుకోవడానికే నాకు ఈ కష్టాలు తెప్పిస్తున్నావా.. ఎందుకిలా చేస్తున్నావ్.. రిషి సార్ ని కనిపించేలా చేయమని కన్నీళ్లతో తన కష్టాలన్నీ చెప్పుకుంటుంది వసుధార. ఇంతలో వసుధార గురించి ఆలోచించుకుంటూ అమ్మవారి దగ్గరికి వస్తాడు రిషి. అప్పటికే అక్కడ ఉన్న వసుధారను చూసి షాక్ అవుతాడు రిషి. ఇది నిజమా.. నా భ్రమ అని అనుకుంటాడు. ఇంతలో రిషిని వసుధార చూసి సంతోషిస్తుంది. వసుధార మెడలో తాళి చూసిన రిషి వెళ్లిపోవాలనుకుంటాడు.

జనవరి 20వ ఎపిసోడ్ లో..
రూమ్ డోర్ ను లోపలి నుంచి రిషి.. బయట నుంచి వసుధార ఇద్దరు ఒకేసారి ఓపెన్ చేయడంతో వసుధార పడబోతుంటే రిషి పట్టుకుంటాడు. అప్పుడు ఇద్దరు చూపులు కొద్దిసేపు కలుస్తాయి. ఇంతలో రిషి షర్ట్ కి వసుధార తాళి తగులుకోవడం చూసి.. అది తీసేసి పక్కకు వెళ్లి నిల్చుంటాడు రిషి. ఏంటీ సార్ ఇక్కడ ఉన్నారు అని వసుధార అడిగితే.. అది నేను అడగాలి అని రిషి అంటాడు. వసుధార ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని రిషి అంటే.. ఒకసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్. నేను మీకు చెప్పాల్సింది చాలా ఉంది అని వసుధార అంటే.. నాకు వినడానికి ఏం లేదు అని రిషి అంటాడు. ఇంటికి వెళ్లండి అని వసుధార అంటే రిషి వినడు. నన్ను ఒంటరిగా వదిలేయమని దండం పెడతాడు రిషి. మీకు ఎలా చెబితే అర్థం అవుతుందో అని అంటూ మహేంద్రకు వాట్సాప్ లో రిషి సార్ కాలేజ్ గెస్ట్ హౌజ్ లో ఉన్నారు. వచ్చి తీసుకెళ్లండి అని వాయిస్ మెసేజ్ పెడుతుంది వసుధార. ఎందుకు ఇలా వేధిస్తున్నావ్ వసుధార.. నువ్ వెళ్తావా.. నన్ను వెళ్లమంటావా అని కోపంగా రిషి అనడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార.

జనవరి 21వ ఎపిసోడ్ లో..
రిషి నువ్.. అని జగతి అడిగితే.. ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెబుతాడు రిషి. వసు అని జగతి అంటే.. ప్రాజెక్ట్ హెడ్ వసుధార వచ్చారు. నన్ను కలిశారు అని రిషి చెబుతాడు. రిషి కూల్ గా ఉన్నాడా.. ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడా అని జగతి అనుకుంటాడు. ప్రాజెక్ట్ హెడ్ కి ఇవ్వండి అని చెప్పిన రిషి.. ఇది గౌతమ్ ఫ్లాట్ కీ. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా తనకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సినా బాధ్యత మన కాలేజీకి ఉంది. తనకు కావాల్సిన అరెంజ్ మెంట్స్ స్టాఫ్ తో చెప్పి చేయించండి అని రిషి అంటాడు. వసుధారపై కోపం లేదా అని జగతి అడిగితే.. ఎవరి కోపాలకు ఎవరిని బాధ్యులం చేస్తాం.. మన కోపం మన వ్యక్తిగతం.. అదే గతం సాధ్యమైనంత తొందరగా ప్రాజెక్ట్ హెడ్ గారిని గౌతమ్ ఫ్లాట్ లోకి షిప్ట్ అవ్వమని చెప్పండి. అలాగే పుష్ప తెచ్చింది.. ఈ క్యారియర్ ప్రాజెక్ట్ హెడ్ కి ఇవ్వండి అని రిషి చెబుతాడు. నువ్ ఎంత మంచివాడివి.. గొడ్డలితో గంధం చెట్టును నరికినా.. ఆ పరిమళం గొడ్డలికి కూడా అంటుకుంటుంది అని జగతి అనుకుని వెళ్లిపోతుంది. మరోవైపు వసుధార ఇంట్లో రిషి వాళ్లతో ప్రవర్తించిన తీరు గుర్తు చేసుకుంటుంది వసుధార.