For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Weekly Roundup: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మహేంద్ర-జగతి.. దేవయానిని నిలదీసిన రిషి

  |

  యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే అక్టోబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 22వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

  అక్టోబర్ 17వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 17వ ఎపిసోడ్ లో..

  ప్రేమ అన్నింటిని కలుపుతుంది. ఓర్చుకుంటుంది. మన మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయేమో కానీ, అంతకుమించి అనంతమైన ప్రేమ ఉంది. మన మధ్య ప్రేమను ఒక చీర కొలవలేదు. ఆ చీర మీకు ఎమోషన్. ఒక గొప్ప భావన అంతే. అసలు ఆ చీర నాకు ఇవ్వాలనే ఆలోచన మీకు వచ్చిందని నేను అనుకోను అని వసుధార అంటుంది. ఆ చీరను దేవయాని ఇవ్వడాన్ని రిషి గుర్తు చేసుకుంటాడు. అవును, ఆ చీర నీకు ఇవ్వమని పెద్దమ్మా ఇచ్చిందని చెబుతాడు. తను ఏ తప్పు చేయలేదని వసుధార సమర్ధించుకుంటే.. బాధగా ఉందని రిషి అంటాడు. మేడమ్ తరఫున నేను నీకు సారీ చెబుతున్నాను అని రిషి అంటే. జగతి మేడమ్ నన్ను కొట్టారు. మీరు మేడమ్ తరఫున సారీ చెబుతున్నారు అంటే మీ మనసులో ఏమనుకుంటున్నారు అని వసు అనబోతుంటే.. కోపంగా వసుధార్ అని అరిచి వెళ్లిపోతాడు రిషి.

  అక్టోబర్ 18వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 18వ ఎపిసోడ్ లో..

  ఫోన్ లో రిషి ఫొటో చూసుకుంటూ మాట్లాడుతుంది వసుధార. ఎందుకు నన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని మచ్చలేని మనిషిగా చూడాలనుకుంటున్నాను. ఆ ఒక్క విషయంలోనే ఎందుకు అలా ఉన్నారు అని రిషికి కాల్ చేస్తుంది వసుధార. కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు రిషి. కట్ చేస్తే కాలేజీలో తన క్యాబిన్ లో రిషి ఉంటాడు. గౌతమ్ అక్కడికి వచ్చి.. టైమ్ అవుతుంది రా.. లంచ్ చేద్దామని క్యారేజ్ తీస్తాడు. ఇది ఇంటి భోజనంలా ఉందే అని రిషి అడుగుతాడు. లేదురా.. కొత్తగా హోటల్ పెట్టాడు. అందులో నుంచి తెప్పించాను అని గౌతమ్ అంటాడు. తర్వాత.. నిల్చున్నది చాలు అలసిపోతావ్.. లోపలికి రా.. అని రిషి అంటాడు. లేదురా.. నేను కూర్చొనే ఉన్నాను.. అని గౌతమ్ అంటాడు. దీనికి నేను చెబుతుంది నీకు కాదు.. వసుధారకు అని అంటాడు రిషి.

  అక్టోబర్ 19వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 19వ ఎపిసోడ్ లో..

  వసుధార మెల్లిగా వెళ్లి దేవయాని చెవిలో మీరేం భయపడొద్దు మేడమ్.. నేను ఆ ఇంటికి వస్తాను.. అందరి తిక్క కుదురుస్తాను అని చెబుతుంది. నేను ఇంటికి రమ్మని చెబుతున్నాను కదా. ఏంటి తెలివిగా మాట్లాడుతున్నావా అని అంటుంది దేవయాని. మీరే అన్నారు కదా మేడమ్ నేను తెలివైనా దాన్ని అని వసుధార అంటుంది. ఇంతలో ఇప్పుడు రోడ్డు మీద మీరేం మాట్లాడుకోవద్దు ఇంటికి వెళదాం పదండి పెద్దమ్మా అని దేవయానిని అక్కడి నుంచి తీసుకెళ్తాడు రిషి. కారులో వెళ్తుండగా.. దేవయాని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నారు అని రిషి అడిగితే.. నా పెద్దరికం పక్కన పెట్టి వసుధారను ఒప్పిద్దామనుకున్నా. మీ అమ్మానాన్నలకు నీ మీద బాధ్యత ఎలాగు లేదు. నేనే ఆ బాధ్యత తీసుకుని మాట్లాడుదాం అనుకుంటే వసుధార నా పెద్దరికం కూడా పట్టించుకోలేదు అని చెబుతుంది. అందుకు రిషి.. వసుధారని ఎలా మార్చాలో నాకు తెలుసు పెద్దమ్మా.. మీరు మా గురించి ఏం కంగారు పడొద్దు. వసుధారకి జగతి మేడమ్ పై ఉన్న కృతజ్ఞతా భావం కన్నా నా మీద ఉన్న ప్రేమే ఎక్కువ అని అంటాడు.

  అక్టోబర్ 20వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 20వ ఎపిసోడ్ లో..

  మిమ్మల్ని చూస్తుంటే మీరు కూడా మారిపోతారేమే అనిపిస్తోంది డాడ్. సారీ పెద్దమ్మా.. నేను వెళ్తున్నా అనేసి వెళ్లిపోతాడు రిషి. ఏంటిదంతా.. నేను ఏమన్నాని మహేంద్ర అడగడంతో ఇప్పుడేం మాట్లాడొద్దని జగతి ఆపేస్తుంది. ఇప్పుడు మీ కళ్లు చల్లబడ్డాయా అని దేవయాని మరో డ్రామా చేస్తుంది. రిషితో అలాగే మాట్లాడుతురా అని అంటుంది. దీంతో ఏం జరిగిందో రిషికి తెలియకపోవచ్చు.. కానీ మీకు తెలుసు కదా అని జగతి అంటుంది. బాగా తెలుస్తోంది. అసలు మీకు రిషి ఆనందంగా ఉండటం ఇష్టంలేదా అని దేవయాని అంటే.. అన్ని మీరే అంటారు.. అవన్నీ మేం అన్నామని నిరూపిస్తారు అని మహేంద్ర అంటాడు. రిషి మనసు తెలుసుకోలేరు. ఏం తల్లిదండ్రులు మీరు. రిషి సరదాగా మాట్లాడి నవ్వుతూ పలకరించి ఎన్నాళ్లయిందో కదా.. ఆ విషయం మీరు ఆలోచించారా.. సాక్షి విషయంలో ఏదో చిన్న పొరపాటు జరిగితే సర్ది చెప్పాల్సింది పోయి వదిలేశారు. నీ కాలు ఇంట్లో మోపాకే రిషి ఆనందాలు ఆగిపోయాయి.. కొందరి లెగ్గు మహిమ అలా ఉంటుంది మరి అని దేవయాని అంటుంది.

  అక్టోబర్ 21వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 21వ ఎపిసోడ్ లో..

  వసు, రిషి ఒక కారులో వెళ్తుంటారు. మరోవైపు జగతి-మహేంద్ర మరో కారులో ప్రయాణిస్తుంటారు. మనసుకి ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని రిషి అంటే.. మరోవైపు గుండె బరువెక్కిపోతోంది జగతి.. రిషికి నేను దూరంగా వెళ్తున్నాను జగతి. ఇది కల అయితే బాగుండేది కదా.. అని మహేంద్ర అంటాడు. రిషి ఆనందం కోసం మనిద్దరం కలిసి రిషికి అందిస్తున్న కానుక అనుకుందాం అంటుంది జగతి. అదే సమయంలో ఆ దేవుడు నాకు ఇచ్చిన కానుక నువ్వు అని వసుధారను రిషి అంటాడు. లేదు లేదు.. మీరే నాకు కానుక అని వసుధార అంటుంది.

   అక్టోబర్ 22వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 22వ ఎపిసోడ్ లో..

  రిషి. డాడ్ కి నా మీదకోపం వస్తే నన్ను తిట్టే హక్కు డాడ్ కి ఉంది కదా. ఎప్పుడూ కోపం వచ్చిన సరే నన్ను తిట్టరు. ఎందుకంటే నేను బాధపడతాను అని. నన్ను ఒక్క మాట కూడా అనని డాడ్ నన్ను ఇలా వదిలేసి వెళ్లారంటే.. ఏదో తప్పు జరిగింది పెద్దమ్మా అని రిషి అంటాడు. పోనీలే పెద్దమ్మా.. వాళ్లిద్దరు వెళ్లిపోయారు కదా.. నాకు మీరున్నారు అదే చాలు అని అంటాడని అనుకుంటే ఇలా అయిందేంటి అని మనసులో అనుకుంటుంది దేవయాని. జగతి వల్ల అని దేవయాని ఏదో చెప్పబోతుంటే.. లేదు పెద్దమ్మా డాడ్ ఎప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటాడు రిషి. ఇంతలో వసుధార వస్తుంది. డాడ్ కనిపించడం లేదు వసు.. నీకు ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు రిషి. నా కాల్ కూడా ఎత్తడం లేదు మీరు ముందు ధైర్యంగా ఉండండి, గౌతమ్ సర్ వెళ్లారుగా వెతకడానికి అని రిషిని పైకి తీసుకెళ్తుంది.

  English summary
  Guppedantha Manasu Weekly Roundup:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X