For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Weekly Roundup:తల్లిదండ్రులను మాట అననివ్వని రిషి.. బెడిసికొట్టిన దేవయాని ప్లాన్

  |

  యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే అక్టోబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

  అక్టోబర్ 24వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 24వ ఎపిసోడ్ లో..

  గౌతమ్ ఇంట్లో మహేంద్ర-జగతిలు కూర్చుని ఆలోచనలో ఉంటారు. ఓ సమస్య వచ్చింది గౌతమ్. దాని పరిష్కరించాడనికి మేము వచ్చాం. అందుకే అజ్ఞాతవాసం మాకు తప్పదు. మేము ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పొద్దు అని మహేంద్ర అంటాడు. అదే నా బాధ అంకుల్. రిషి అడిగితే అబద్దం చెప్పలేను. అలాగని నిజం దాచలేను అని గౌతమ్ అంటాడు. ఓ మంచి కోసం ఒక అబద్దం మంచిదే గౌతమ్ అన మహేంద్ర అంటాడు. మరోవైపు కాలేజ్ బయట కూర్చున్న వసుధార దగ్గరికి వచ్చిన రిషి.. ఎందుకు వెళ్లిపోయారు.. వస్తారా.. నేను ఏమైనా తప్పు చేసినట్లయితే నన్ను నిలదీసి అడగాలి కదా. అసలు నేనేం తప్పు చేశాను అంటాడు రిషి.

  దేవయాని గురించి ఆలోచిస్తూ మీ ముందే సమాధానం ఉంది సార్ మీరు తెలుసుకోలేకపోతున్నారు అని వసుధార అంటుంది. అయితే నాకేం తెలియదు అంటావా వసు.. నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను అడగాలి గానీ, ఇలా వెళ్లిపోవడం ఏంటని రిషి అంటాడు. మహేంద్ర సార్ ఎక్కడికి వెళ్లారని మీరు అనుకుంటున్నారు, ఎందుకు వెళ్లుంటారని అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ జగతి మేడమ్ విషయంలో మీ నిర్ణయం మార్చుకుంటే.. అని వసుధార అనేలోపే.. ఆపేయ్ వసుధార.. అటువైపు వెళ్లొద్దు అని అంటాడు రిషి.

   అక్టోబర్ 25వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 25వ ఎపిసోడ్ లో..

  రిషి, వసుధారలు గౌతమ్ ఇంటికి రావడం చూసి ముగ్గురు షాక్ అవుతారు. ఏంటీ గౌతమ్ ఇది.. రిషి వచ్చాడేంటి.. స్నేహధర్మం పాటించావా.. అంటూ అరిచేస్తాడు మహేంద్ర. సరే గౌతమ్.. మేము లోపలికి వెళ్తున్నాం.. మేము ఇక్కడే ఉన్నామని వాడికి చెప్పావో.. ఇక జీవితంలో నీతో మాట్లాడను గుర్తుపెట్టుకో.. అని పక్క గదిలోకి వెళ్తారు మహేంద్ర-జగతి. తర్వాత వెళ్లి తలుపు తీస్తాడు గౌతమ్. గౌతమ్ తలుపు తీయ్యగానే.. వెంటనే లోపలికి పరిగెత్తి.. డాడ్ ఎక్కడున్నారు అంటూ పిలుస్తాడు రిషి. ఇంతలో టీపాయ్ పై రిషి, మహేంద్రల ఫొటో ఉంటుంది. అటువైపుగా రిషి నడిస్తే.. కంగారు పడతాడు మహేంద్ర. వెంటనే వాటర్ తో వచ్చిన గౌతమ్.. ఆ ఫొటోకు అడ్డుగా నిలబడతాడు.

  తర్వాత ఇద్దరిని కూర్చొమన్న గౌతమ్.. రేయ్.. మీటింగ్ వదిలేసి మరి వచ్చావేంట్రా.. నువ్ ఇంకా రావులే అనుకున్నానని అంటాడు. డాడ్ కంటే నాకు ఏది ఎక్కువ కాదురా.. అయినా మా డాడ్ ది చిన్న పిల్లల మనస్తత్వం రా.. హగ్ ఇచ్చి సారీ చెబితే వెంటనే కోపం తగ్గిపోతుంది తెలుసా.. అని రిషి మాట్లాడుతుంటే చాటుగా వింటున్న మహేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు.

  అక్టోబర్ 26వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 26వ ఎపిసోడ్ లో..

  తండ్రి గురించి బాధపడుతున్న రిషిని చూసిన దేవయాని.. ఏంటి రిషి నువ్వు ఇలా ఉండటం ఏంటి. జగతికి అయితే బుద్ది లేదు, మహేంద్రకి ఏమైంది. తనకైనా తెలియాలి కదా అని దేవయాని అంటే.. డాడ్ ని ఏం అనొద్దు పెద్దమ్మ అని సమాధానం ఇస్తాడు రిషి. అయినా జగతి వచ్చిన తర్వాత మహేంద్రకు నీపై దృష్టి తగ్గింది. జగతి మీదే పెరుగుతున్నట్లు ఉంది అని దేవయాని అంది.

  దాంట్లో తప్పేముందు పెద్దమ్మా. డాడ్ కి నేను కొడుకు అవ్వడానికి ముందే మేడమ్ భార్య అయ్యారు. భార్య స్థానం భార్యదే కదా. అయినా వాళ్ల గురించి మనం ఇలా మాట్లాడుకోకూడదు అని రిషి చెప్పాడు. ఇది విన్న వసుధార మనసులో ఎంతో సంతోషిస్తుంది. అప్పుడు గౌతమ్.. కరెక్ట్ గా చెప్పావు రిషి, చాలా బాగా చెప్పావ్ అని అంటాడు. దీనికి మహేంద్ర వాళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయినా.. రిషి మనసు నుంచి వెళ్లట్లేదు ఏంటి.. అని మనసులో అనుకుంటుంది దేవయాని. ఇంతలో వసుధారను చూసిన దేవయాని నువ్ ఇక బయలుదేరొచ్చు అని అంటే.. వసుధార ఇక్కడే ఉంటుంది అని రిషి అంటాడు.

  అక్టోబర్ 27వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 27వ ఎపిసోడ్ లో..

  తండ్రి గురించి గౌతమ్ కు చెప్పుకుంటూ రిషి బాధపడతాడు. దీనికి.. ఏంటిది.. నిజం తెలిసి కూడా చెప్పలేను. వీడి బాధను చూస్తూ ఉండలేను అని మనసులో అనుకుంటాడు గౌతమ్. అరేయ్ వాళ్లు ఎక్కడున్నా బాగానే ఉంటారు. నీకోసం వచ్చేస్తారు అని చెబుతాడు గౌతమ్. వాళ్లు కావాలనే దొరక్కుండా ఉంటున్నారు.. నేను చేసిన తప్పేంటి.. నాకైనా ఎవరున్నారు డాడీ తప్పా.. అందరు కోపం ఎక్కువ అంటారు కానీ, ఆ కోపం వెనుక ఉన్న కొండంత ప్రేమను ఎందుకు అర్థం చేసుకోరు. నేను ఎవర్ని ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ల నుంచి దూరం అయిపోతుంటాను అని రిషి అంటే.. ఎవరూ దూరం అవలేదురా అని గౌతమ్ అంటాడు.

  దీనికి ఇంకేంట్రా.. డాడ్ నన్ను ఎలా వదిలి వెళ్లగలిగారని రిషి అంటే.. ఒక్కోసారి ఎంత ప్రేమ ఉన్నా.. పరిస్థితుల వల్ల దానికి వ్యతిరేకంగా మసులుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రేమ ఉన్నా చూపించలేని పరిస్థితి రావొచ్చు.. ఎవరికీ తెలుసు అని గౌతమ్ అంటాడు. నీకు అన్ని తెలిసినట్టే మాట్లాడుతున్నావ్ అని రిషి అంటే.. సమస్యలు, పరిస్థితుల గురించి చెబుతున్నాను. ఒక్కోసారి ఎదుటివాళ్ల పరిస్థితి తెలియదు కదా అని గౌతమ్ అంటాడు. వీళ్ల మాటలు బయట ఉండి వింటున్న వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది.

  అక్టోబర్ 28వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 28వ ఎపిసోడ్ లో..

  వసుధార బ్యాగ్ పట్టుకుని కిందకు వెళ్తుంది. కిందకు వెళ్తున్న వసుధారను ఆపుతుంది దేవయాని. ఇంటి నుంచి వెళ్లిపోతున్నావా.. క్షేమంగా వెళ్లు.. ఆరోగ్యం జాగ్రత్త అని అంటుంది. మేడమ్.. నేను ఇంటి నుంచి వెళ్లిపోతే.. చూడటానికి మీరు ఆశగా ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను ఇంటి నుంచి వెళ్లడం లేదు. రిషి సార్ ఎప్పుడు వెళ్లమంటే అప్పుడే వెళతాను. ఒకవేళ రిషి సార్ వెళ్లమన్నా కూడా నాకు నచ్చితేనే వెళతానని వసుధార సమాధానం ఇస్తుంది.

  దీంతో దేవయానికి కోపం వస్తుంది. అదే సమయంలో రిషి వచ్చి.. ఏమైంది పెద్దమ్మా.. వసుధారను ఏదో అంటునట్టున్నారు అని అడుగుతాడు. దానికి వసుధార.. ఏం లేదు సార్.. నేను ఇక్కడ ఉండటం మేడమ్ కి చాలా నచ్చుతుంది. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని నన్ను అభినందిస్తున్నారు అని అంటుంది. దీంతో ఏం చేయలేక తల ఊపుతుంది దేవయాని.

  అక్టోబర్ 29వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 29వ ఎపిసోడ్ లో..

  కబుర్లు చెప్పడానికి కూర్చోమని ధరణికి చెబుతుంది దేవయాని. మీరంటే గౌరవం.. నేను కూర్చోలేను అని ధరణి సమాధానం ఇస్తుంది. ఓసారి నీ ఫోన్ తీసుకురా అని అడగడంతో ఫోన్ తీసుకొని ఇస్తుంది ధరణి. జగతి అత్తయ్య వాళ్లు కాల్ చేశారా అని చూస్తున్నారా. చిన్నత్తయ్య వాళ్లు వెళ్లినప్పుడు చూసింది మీరే కదా అని అంటుంది ధరణి. చూస్తే.. వాళ్లు ఎక్కడికి వెళ్లారో అడ్రస్ తెలుసుకోవాలా అని సమాధానం ఇస్తుంది దేవయాని.

  దీంతో వసుధార మాటలు గుర్తు తెచ్చుకున్న ధరణి.. మనం అన్నీ జరగాలి అనుకుంటాం జరగవు కదా.. నాకు కిచెన్ లో పనుంది.. ఫోన్ వస్తే పిలవండి అనేసి.. అందులో పాము, ముంగిస గేమ్ ఉంది. ఆడుకోండి. భలే బాగుంటుంది అని అంటుంది ధరణి. మరోవైపు రిషి ఫొటో చూస్తూ మహేంద్ర బాధపడుతుంటాడు. భోజనం చేయి మహేంద్ర అని జగతి అంటే.. రిషిని చూస్తుంటే చాలు నాకేం వద్దంటాడు మహేంద్ర. ఇప్పుడు రిషి కూడా నీ గురించే ఆలోచిస్తూ భోజనం మానేయాలి అని నువ్వు కోరుకోవు కదా.. రా మహేంద్ర.. అని తినిపిస్తుంది జగతి. అప్పుడు రిషియే తనకు తినిపిస్తున్నట్లు భావిస్తూ చాలా బాధపడిపోతుంటాడు మహేంద్ర.

  English summary
  Guppedantha Manasu Weekly Roundup
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X